సుధీర్‌బాబు.. ఇంట్రెస్టింగ్ లైనప్

Sammohanam Actor Sudheer Babu Makes An Interesting Lineup Of Movies

వైవిధ్యభరితమైన పాత్రలకు చిరునామాగా నిలుస్తున్న యువ కథానాయకుల్లో సుధీర్ బాబు ఒకరు. ‘ప్రేమకథా చిత్రమ్’(2013), ‘సమ్మోహనం’(2018) వంటి విజయవంతమైన చిత్రాలతో నటుడిగా తనేంటో నిరూపించుకున్న సుధీర్.. త్వరలో విడుదల కానున్న ‘వి’లో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా దర్శనమివ్వనున్నాడు. ఉగాదికి విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా ఎఫెక్ట్‌తో వాయిదా పడింది. లాక్ డౌన్ పిరియడ్ అనంతరం రిలీజ్ డేట్‌పై క్లారిటీ వస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంటే.. తాజాగా ఓ దినపత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన రాబోయే చిత్రాలకి సంబంధించి క్లారిటీ ఇచ్చాడు సుధీర్. చాన్నాళ్ళుగా వార్తల్లో నిలుస్తున్న ‘పుల్లెల గోపీచంద్ బయోపిక్’.. లాక్ డౌన్ తరువాత ప్రారంభం కానుందని చెప్పుకొచ్చాడు. అలాగే, 70 ఎమ్.ఎమ్. సంస్థ నిర్మించనున్న‌ చిత్రంలోనూ నటించబోతున్నట్టు తెలిపాడు. అదే విధంగా వీటితో పాటు మరో కథ కూడా నచ్చిందని.. ఆ వివరాల్ని నిర్మాణ సంస్థే త్వరలో వెల్లడిస్తుందని ముక్తాయించాడు.

మరి… రాబోయే చిత్రాలతో సుధీర్ ఎలాంటి ఫలితాలను అందుకుంటాడో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.