ఫైనల్లీ అందరూ ఎంతగానో ఎదుచూస్తున్న భారీ బడ్జెట్ అండ్ భారీ యాక్షన్ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమాపై ఎంత ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరి సుజిత్ దర్శకత్వంలో సుమారు 300 కోట్లతో తెలుగు, తమిళ, హిందీ, మలయాళంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ రోజు రిలీజ్ అయింది. మరి ఈ సినిమా ఆ అంచనాలను అందుకుందా? లేదా? అన్నది తెలియాలంటే రివ్యూ లోకి వెళ్లాల్సిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
నటీనటులు – ప్రభాస్, శ్రద్ధ కపూర్, వెన్నెల కిషోర్, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్, నీల్ నితిన్ ముఖేశ్, అరుణ్ విజయ్, మందిరా బేడీ తదితరులు
దర్శకత్వం: సుజీత్
బ్యానర్ – యూవీ క్రియేషన్స్, టీ సిరీస్
సంగీతం – తనిష్క్ బగ్చీ, గురు రాంద్వా, బాద్‌షా, జిబ్రాన్ (నేపథ్య సంగీతం)
సినిమాటోగ్రఫీ – ఆర్.మది
కథ:
వాజీ సిటీ గ్యాంగ్ స్టర్స్ ఎక్కువగా ఉండే ఏరియా. ప్రతి ఒక్కరూ క్రైమ్ వరల్డ్‌ను తన చేతుల్లోకి తీసుకోవాలనుకుంటారు. ఈ నేపథ్యంలో ఎవరి ప్రయత్నాలు వాళ్లు చేస్తుంటారు. మరోవైపు ముంబైలో ఓ భారీ చోరి జరగుతుంది. ఈ చోరీకి కారణం ఎవరు అనేది ఇన్వెస్టిగేట్ చేయడానికి అండర్ కవర్ కాప్‌గా వస్తారు ప్రభాస్..శ్రద్ధ కపూర్. ఈ కేసు ఛేజింగ్ లో ప్రభాస్, శ్రద్దా ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు..? కేసును ప్రభాస్, శ్రద్దా ఎలా ఛేదించారు..? అసలు ఈ సినిమాలో సాహో అంటే ఏంటి? అనేది తెలియాలంటే థియేటర్ లో చూడాల్సిందే.
విశ్లేషణ:
కేవలం ఒక్క సినిమాతోనే ప్రభాస్ లాంటి హీరో తో సినిమా చేసే ఛాన్స్ ను కొట్టేశాడు సుజీత్. ఇంత మంది దిగ్గజాలను నడిపించాడంటే హాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. అంతేనా ఈ సినిమా కోసం ప్రత్యేక వాహనాలు తెప్పించాడు. ఎప్పుడూ చూడని ఆయుధాలను డిజైన్ చేయించాడు. అంతర్జాతీయ స్థాయిలో సీజీ సాంకేతికతను వాడాడు. అంతర్జాతీయ నిపుణులనూ వినియోగించాడు. ఇవన్నీ చూసిన తర్వాత టెక్నీకల్ గా సుజీత్ ఎంత ఎక్స్పర్ట్ అన్న విషయమో అర్ధమవుతుంది.
ఇక గ్యాంగ్‌స్టర్ సినిమాలకు ప్రాణం యాక్షన్ సీన్లు, ట్విస్టులు. ఈ సినిమాలో అవి కావల్సినన్ని ఉన్నాయి. హాలీవుడ్ గ్యాంగ్‌స్టర్ సినిమాలకు ఏ మాత్రం తగ్గకుండా దర్శకుడు సుజిత్ సినిమాను తెరకెక్కించాడు. తొలి సన్నివేశం నుంచి ఆఖరి వరకు గ్యాంగ్‌స్టర్లు, తుపాకులు, బాంబులు, ఛేజ్‌లతో సినిమా మొత్తం ఆ ఫీల్ కనిపించేలా చూసుకున్నాడు. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సన్నివేశాలు థ్రిల్ చేస్తాయి.
ఇక ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓ రకంగా చెప్పాలంటే సినిమా మొత్తాన్ని తన భుజాలపై వేసుకున్నాడని చెప్పొచ్చు. ప్రభాస్ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. లుక్స్ పరంగానూ ప్రభాస్ సూపర్బ్ అనిపించాడు. ఇక యాక్షన్ సీన్స్‌లో ప్రభాస్ చూపించిన ఈజ్, పర్ఫెక్షన్ వావ్ అనిపించేలా ఉంది. రొమాంటిక్ సన్నివేశాల్లోనూ ఆకట్టుకున్నాడు. ఇక పోలీసు అధికారి పాత్రలో శ్రద్ధా కపూర్ ఒదిగిపోయింది. యాక్షన్ సీన్స్‌లోనూ మెప్పించింది.
చంకీ పాండే, నీల్ నితిన్ ముఖేష్, అరుణ్ విజయ్, లాల్‌లు జాకీ ష్రాఫ్, మందిరా బేడీ, మహేష్ మంజ్రేకర్ లాంటి నటులకు ఎక్కువ స్పేస్ లేకపోయినా ఉన్నంతలో తమ పాత్ర మేర నటించారు. మరో కీలక పాత్రలో నటించిన మురళీ శర్మ మరోసారి తనదైన నటనతో మెప్పించారు. వెన్నెల కిశోర్ అక్కడక్కడా నవ్వించాడు.
జిబ్రాన్ నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్ అయ్యింది. చాలా సన్నివేశాలను తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో మరింతగా ఎలివేట్ చేశాడు జిబ్రాన్. సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ యాక్షన్ కొరియోగ్రఫి. హాలీవుడ్ స్టంట్ మాస్టర్‌లు డిజైన్ చేసిన యాక్షన్ సీన్స్ రెప్ప వేయకుండా చూసేలా ఉన్నాయి. సినిమాటోగ్రఫి కూడా సూపర్బ్. గతంలో ఎప్పుడు చూడని లొకేషన్లను ఎంతో అందంగా వెండితెర మీద ఆవిష్కరించారు.
ప్లస్ పాయింట్స్
నటీ నటులు
స్టంట్స్
నేపధ్య సంగీతం
ఇక ఓవరాల్ గా చెప్పాలంటే ఈ సినిమా ప్రతి ఒక్కరూ చూసి ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పొచు. యాక్షన్ సినిమాలు ఇష్టపడే వాళ్ళు ఇంకొంచెం ఎంజాయ్ చేస్తారు.
[wp-review id=”27825″]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: