‘లయన్’గా బాలకృష్ణ సందడికి 5 ఏళ్ళు

Nandamuri Balakrishna Powerful Action Entertainer Lion Completes 5 Years.

నటసింహ నందమూరి బాలకృష్ణ త‌న కెరీర్‌లో పలువురు నూతన దర్శకులను ప్రోత్సహించారు. వారిలో సత్యదేవ్‌ ఒకరు. బాలయ్య, సత్యదేవ్‌ కాంబినేషన్‌లో రూపొందిన ఆ చిత్రమే ‘లయన్’. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో బాలయ్యకు జోడిగా త్రిష, రాధికా ఆప్టే నటించారు. ‘లెజెండ్’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తరువాత రాధికా ఆప్టే మరోసారి బాలయ్యతో జట్టుకట్టగా.. త్రిష తన కెరీర్‌లో తొలిసారి బాలయ్య సరసన క‌నువిందు చేసింది. ప్రకాష్‌రాజ్, చంద్రమోహన్, కోట శ్రీనివాసరావు, సురేష్, ఇంద్ర‌జ‌, జయసుధ, గీత, చలపతిరావు, ప్రదీప్ రావత్, విజయకుమార్, అలీ, శివ‌బాలాజి, అర్చ‌న‌ ముఖ్య పాత్రలు పోషించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రామజోగయ్య శాస్త్రి, భాస్కరభట్ల, శ్రీమణి గీతరచనకు “మెలోడీ బ్రహ్మ” మణిశర్మ స్వరాలు సమకూర్చాడు. “వన్ అండ్ ఓన్లీ లయన్”, “పిల్లా”, “ఆకాశం”, “ఐసా అంబాని పిల్ల”, “అనగనగా”.. ఇలా ఇందులోని పాటలు బాలకృష్ణ అభిమానులను అలరించాయి. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమా పతాకంపై రుద్రపాటి రమణారావు ఈ చిత్రాన్ని నిర్మించారు. 2015 మే 14న విడుదలైన ‘లయన్’.. నేటితో 5 ఏళ్ళను పూర్తి చేసుకుంటోంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × three =