2 అవ‌ర్స్ ల‌వ్‌ తెలుగు మూవీ రివ్యూ

2 Hours Love Movie Public Talk, 2 Hours Love Movie Review, 2 Hours Love Movie Story, 2 Hours Love Review, 2 Hours Love Review And Rating, 2 Hours Love Review Live Updates, 2 Hours Love Telugu Movie Plus Points, 2 Hours Love Telugu Movie Review, 2019 Telugu Movies Reviews, Latest Telugu Movies News, Latest Telugu Movies Review And Rating, Telugu Film News, Telugu Filmnagar, Telugu Movies News 2019

శ్రీ ప‌వార్ తానే హీరో గా.. డైరెక్టర్ గా తెరకెక్కించిన సినిమా ‘2 అవ‌ర్స్ ల‌వ్‌’. శ్రీనిక క్రియేటివ్ వ‌ర్క్స్ నిర్మాణంలో కృతి గార్గ్ హీరోయిన్‌ గా తెరకెక్కిన ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి టీజర్, ట్రైలర్ లతో మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ సినిమా మరి ఆ అంచనాలను రీచ్ అయిందో? లేదో? చూద్దాం…

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నటీనటులు : శ్రీ ప‌వార్‌, క్రితి గార్గ్‌, త‌నికెళ్ళ‌భ‌ర‌ణి, న‌ర్సింగ్ యాద‌వ్‌, అశోక్ వ‌ర్ధ‌న్ త‌దిత‌రులు.
దర్శకత్వం : శ‌్రీప‌వార్
నిర్మాత‌లు : శ‌్రీనిక క్రియేటివ్ వ‌ర్క్స్‌
సంగీతం : గ‌్యాని సింగ్‌
సినిమాటోగ్రఫర్ : ప‌్ర‌వీణ్ వ‌న‌మాలి

కథ:

ఆదిత్ సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తుంటాడు. అయితే కాఫీ షాప్ లో పని చేసే అవికా (క్రితి గార్గ్‌) ని చూసిన తొలి చూపులోనే పడతాడు ఆదిత్ (శ్రీ ప‌వార్‌). కొద్ది రోజులకు అవికా కూడా ఆదిత్ ను ప్రేమిస్తుంది. అయితే తన లవ్ కు ఓ కండీషన్ పెడుతుంది. అలా వారి ప్రేమకథ నడుస్తున్న క్రమంలో కొన్ని సంఘటనల కారణంతో అవికా, ఆదిత్ ను దూరం పెడుతుంది. అలా దూరం గా ఉన్న టైం లో అవికా పేరు నయన అని తెలుస్తుంది. మరి అవికా నయనగా ఎందుకు మారింది..? లవ్ లో తాను పెట్టిన కండీషన్ ఏంటి..? ఆదిత్ వల్ల అవికాకు గతంలో ఏదైనా నష్టం జరిగిందా..? ఆఖరికి ఆదిత్, అవికా లు ఒక్కటయ్యారా..? అసలు ఈ ‘2 అవ‌ర్స్ ల‌వ్‌’ ఏంటి అనేది తెలియాలంటే మాత్రం సినిమా చూడాల్సిందే..?

విశ్లేషణ:

సినిమా టైటిల్ తోనే సినిమాలోని కాన్సెప్ట్ ఏంటో చెప్పేసాడు డైరెక్టర్ శ్రీ పవార్. కొత్త కుర్రాడు… అందులోనూ నటనతో పాటు డైరెక్షన్ కూడా చేయడం అంటే కొంచం కష్టమైన విషయమే. కానీ శ్రీ పవార్ మాత్రం రెండింటినీ బాగా హ్యాండిల్ చేసాడని చెప్పొచ్చు. కొత్తవాడైనా శ్రీ పవార్ కథను తన భుజాలపై మోశాడు. కేవలం నటనతోనే కాకుండా దర్శకత్వ బాధ్యతను చక్కగా పోషించాడు.. శ్రీప‌వార్ ప‌క్కా క్లారిటీతో సినిమాను తెర‌కెక్కించాడు. అస‌లు ద‌ర్శ‌కత్వంలో ఎలాంటి అనుభవం లేని వ్య‌క్తి సినిమాను తెర‌కెక్కించిన తీరు చూస్తే ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే. మనకి ప్రేమ కథలు కొత్తేమి కాదు. ఇప్పటివరకూ ఎన్నో ప్రేమకథలు చూసాం. ఇది కూడా ప్రేమకథ అయినా… కొంచెం కొత్తగా ట్రై చేసాడు.

ఇక హీరోయిన్ కృతి గార్గ్ నయన పాత్రలో ఒదిగిపోయింది. హీరోను టార్చర్ పెట్టే సన్నివేశాల్లో బాగా నటించి తన నటనతో ఆకట్టుకుంది. తనికెళ్ల భరణి నటన సినిమాకు మరో బలమని చెప్పవచ్చు. మిగితా పాత్రధారులు తమ పరిధి మేరకు మెప్పించారు. అలాగే రౌడీ గ్యాంగ్ కి లీడర్ గా నటించిన నూతన నటుడు శ్రీనివాస్ రాజు అద్భుతంగా నటించాడు.

ఇక గ్యాని సంగీతం, నేప‌థ్య సంగీతం సినిమాకు మ‌రో హైలైట్ గా నిలిచాయి. అలాగే ప్ర‌వీణ్ వ‌న‌మాలి సినిమాటోగ్ర‌ఫీ సింప్లీ సూప‌ర్బ్‌. మినిమం బ‌డ్జెట్ చిత్రానికే ఈ రేంజ్ సినిమాటోగ్ర‌ఫీ ఇవ్వ‌డం గొప్ప విష‌యం.

క‌థ‌కు సంబంధం లేని రెండు, మూడు స‌న్నివేశాలు, సెకండాఫ్ కాస్త సాగ‌దీత‌గా అనిపించ‌డం మిన‌హా సినిమా బాగానే తెరకెక్కించాడు. సెకండాఫ్‌లో కథలో వేగాన్ని పెంచి ఉంటే సినిమా మరింత బావుండేది శ్రీ పవార్. కొత్త త‌ర‌హా ప్రేమ‌క‌థ‌ల‌ను చూడాల‌నుకునే వారికి త‌ప్ప‌కుండా న‌చ్చే సినిమా.

2 అవ‌ర్స్ ల‌వ్‌ తెలుగు మూవీ రివ్యూ
  • Story
  • Screen Play
  • Direction
  • Performance
3
Sending
User Review
0 (0 votes)

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six + 14 =