షార్ట్ ఫిలిమ్స్ లేకుంటే నేను లేను

Sujeeth Thanks Saaho Team and Audience,Director Sujeeth Gets Emotional About Saaho,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News,Telugu Movies News 2019,Saaho Director Sujeeth Gets Emotional About Saaho,Director Sujeeth Emotional Speech,Director Sujeeth Emotional About Prabhas And Saaho Movie,Saaho Movie Updates,Saaho Telugu Movie Latest News,Saaho Movie Review,Saaho Telugu Movie Review,Saaho Review,Director Sujeeth Emotional Speech At Saaho,Saaho Director Sujeeth Latest Interview

ప్రస్తుతం ఎక్కడ చూసినా సాహో మాట తప్పా ఇంకేం వినిపించట్లేదు. ఇంకా కొద్ది గంటల్లో సినీ లవర్స్ ఎంతగానో ఎంతగానో ఎదురుచూస్తున్న సాహో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ప్రభాస్ కూడా ఎన్నడూ లేని విధంగా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. ఇక చిత్ర యూనిట్ కూడా రోజుకో అప్ డేట్ ఇస్తూ ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేస్తున్నారు చిత్ర యూనిట్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ సినిమా డైరెక్ట్ చేసిన సుజిత్ రేంజ్ కూడా ఓ రేంజ్ లో పెరిగిపోయింది. అంతే కాదు ఇంత చిన్న వయసులో ఇంత పెద్ద ప్రాజెక్టు ను హ్యాండిల్ చేసిన విధానానికి అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక తాజాగా సుజీత్ తనకు సపోర్ట్ చేసిన వారికి సోషల్ మిడియా వేదికగా థాంక్స్ చెపుతూ ఓ పోస్ట్ పెట్టాడు. తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా నాకు ఏం లేనప్పుడు.. నాతో ఉండి.. వీడు ఏదో సాధిస్తాడు అనుకున్న ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు.. షార్ట్ ఫిలిమ్స్ లేకుంటే.. నేను లేను అంటూ పోస్ట్ చేసాడు. మరి సాహో సినిమా తర్వాత సుజీత్ కోసం హీరోలు లైన్లు కడతారేమో చూద్దాం.

కాగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ నటి శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. నీల్ నితిన్, జాకీ ష్రాఫ్, లాల్, అరుణ్ విజయ్, చుంకీ పాండే, మురళీ శర్మ, ముఖేష్ మంజ్రేకర్, మందిరా బేడీ ఇలా పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దాదాపు 350 కోట్ల రూపాయల బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్ బ్యానర్లో ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.