రానా ట్వీట్ కు సురేష్ ప్రొడక్షన్స్ ఫన్నీ రిప్లై..!

Suresh Productions Gives A Funny Reply To Rana Daggubati Tweet

ఎలాంటి హడావుడి లేకుండా రానా తనకు కాబోయే భార్యను సోషల్ మీడియా ద్వారా పరిచయం చేసి ఒక రేంజ్ లో షాక్ ఇచ్చాడు రానా. నిజానికి వేరే ఏదైనా హీరో అయితే ఇంత రెస్పాన్స్ వచ్చేది కాదేమో. మొదటినుండి పెళ్లి, ప్రేమ అనే విషయాలు ఇంట్రెస్ట్ లేనట్టు ఉండే రానా ఇప్పుడు ఇలా చేయడంతో ఇంత రేంజ్ లో సోషల్ మీడియా వేదికగా చర్చలు జరిగాయి. ఇక కొంత మంది టాలీవుడ్ హీరోలు కూడా చాలా ఫన్నీగా రియాక్ట్ అవుతూ ట్వీట్స్ చేశారు. ఇక రానా పెళ్లిపై వచ్చిన ఫన్నీ మీమ్స్ అయితే పీక్స్ లెవెల్. అందరు సంగతి ఏమోకానీ ముందు ప్రభాస్ కు మాత్రం భజన స్టార్ట్ అయింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో వచ్చిన రెస్పాన్స్ పై రానా స్పందించి మీ ప్రేమకు.. మీ అభినందనలకు థాంక్స్ అంటూ ట్వీట్ చేశాడు. ఇక ఈ ట్వీట్ కు కూడా ఫన్నీ రిప్లై ఇచ్చారు సురేష్ ప్రొడక్షన్స్ వారు. రానా ట్వీట్ కు వెంకటేష్ సినిమా ప్రేమించుకుందాంరా సినిమాలోని పెళ్లికళ వచ్చేసిందే బాల అనే పాటను పోస్ట్ చేశారు. మొత్తానికి రానా పెళ్లి వార్త అటు షాక్ పాటు ఇటు అందరికీ ఫన్నీ గా కూడా ఉందన్నమాట.

 


ప్రస్తుతం వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా విరాటపర్వం 1992 అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమా కొంత షూటింగ్ ను కూడా పూర్తిచేసుకుంది. ఇక ఈ సినిమాలో రానా పొలిటికల్ లీడర్ గా కనిపించనున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen + 7 =