
ట్యాగ్ · 366 కథనాలు · పేజీ 12

చిరు, చరణ్ ఖాతాలో 5 లక్షల ట్విట్టర్ ఫాలోవర్స్
'కేజీఎఫ్ - చాప్టర్ 2'కి హైలెట్‌గా సంజయ్ దత్
కథ ముఖ్యం - నభా నటేష్
తాను.. నేను.. ఏం మారలేదు..!
కియారా అద్వానీ ఫేవరెట్ సినిమా
కొత్త లుక్‌లో విజయ్ దేవరకొండ?

ఉత్తరప్రదేశ్ నేపథ్యంలో హను రాఘవపూడి చిత్రం

లక్కీ బ్యానర్‌లో సమంత ఫీమేల్ సెంట్రిక్ ఫిలిమ్?
నెగటివ్ రోల్ లో అదితి రావు హైదరి ?

నిధి అగర్వాల్.. డ్రీమ్ ప్రాజెక్ట్
'ధృవ' కాంబినేషన్‌లో మరో చిత్రం?
మొన్న ఆల్కహాల్ ఐడియా.. ఇప్పుడు మరో ఐడియా..!
షార్ట్ ఫిల్మ్ లో పాయల్ రాజ్ పుత్
దీపావళి బరిలో విజయ్ 'మాస్టర్'?
సూర్యతో మరోసారి కె.వి.ఆనంద్?
రవితేజ చిత్రంలో మెగా హీరో?
సంక్రాంతి సీజన్‌లో 'ఎన్.బి.కె.106'?

మ్యూజిక్ పనుల్లో బిజీగా కె.జి.ఎఫ్2 టీమ్..!
ప్రభాస్ 21 పై అప్ డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్..!

‘వి’ గురించి సుధీర్ బాబు ఆసక్తికరమైన కబుర్లు
యువ కథానాయకుడు సుధీర్ బాబుకి అచ్చొచ్చిన దర్శకుల్లో ఇంద్రగంటి మోహనకృష్ణ ఒకరు. వీరిద్దరి కలయికలో రూపొందిన ‘సమ్మోహనం’(2018) కుటుంబ ప్రేక్షకులను విశేషంగా అలరించింది. కట్ చేస్తే.. స్వల్ప విరామం తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో మరో చిత్రం రాబోతోంది. ఆ చిత్రమే ‘వి’. ఉగాదికి విడుదల కావాల్సిన ఈ యాక్షన్ థ్రిల్లర్ కరోనా ఎఫెక్ట్ తో వాయిదా పడింది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
చిరు, చరణ్ ఖాతాలో 5 లక్షల ట్విట్టర్ ఫాలోవర్స్
కేవలం రెండు రోజుల గ్యాప్‌లో ట్విట్టర్ ఖాతా తెరిచిన ‘మెగా ఫ్యామిలీ’ తండ్రీకొడుకులు.. మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్.. తాజాగా ఓ మైల్‌స్టోన్‌కి చేరువయ్యారు.
'కేజీఎఫ్ - చాప్టర్ 2'కి హైలెట్‌గా సంజయ్ దత్
కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో తెరకెక్కిన కన్నడ చిత్రం 'కేజీఎఫ్ - చాప్టర్ 1' (2018).. పాన్ ఇండియా మూవీగా రిలీజై సంచలన విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. యష్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమాని ప్రశాంత్ నీల్ తెరకెక్కించాడు. రెండు భాగాల కథ అయిన 'కేజీఎఫ్'కి సంబంధించిన రెండో చాప్టర్ 'కేజీఎఫ్ - చాప్టర్ 2' ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది.
కథ ముఖ్యం - నభా నటేష్
సక్సెస్ ఫుల్ "వజ్రకాయ " కన్నడ మూవీ తో సినీకెరీర్ ప్రారంభించిన కన్నడ బ్యూటీ నభా నటేష్ "నన్నుదోచుకుందువటే " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. బ్లాక్ బస్టర్ "ఇస్మార్ట్ శంకర్ " మూవీ తో పలు అవకాశాలు అందుకున్నారు. నభా నటేష్ ప్రస్తుతం సాయి తేజ్ హీరోగా రూపొందుతున్న "సోలో బ్రతుకే సో బెటర్ ", బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా రూపొందుతున్న ""అల్లుడు అదుర్స్ " మూవీస్ లో నటిస్తున్నారు.
తాను.. నేను.. ఏం మారలేదు..!
లాక్ డౌన్ లో మొత్తానికి ఇంట్లో మంచిగా కాలక్షేపం చేస్తున్నారు మెగా స్టార్ చిరంజీవి. అంతేకాదు సోషల్ మీడియాకు దగ్గరగా వుంటూ అపుడప్పుడు అభిమానులతో ముచ్చటిస్తున్నారు. దానితో పలు సరదా వీడియోలు, ఫొటో లు కూడా పోస్ట్ చేస్తూ అభిమానులతో పంచుకుంటున్నారు. ఇప్పుడు తాజాగా త్రో బ్యాక్ ఫొటో ను పోస్ట్ చేసి పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. 1990లో అమెరికా వెళ్లినపుడు అక్కడ వంట చేస్తున్న ఫొటోను.. ప్రస్తుతం సొంతింట్లో వంట చేస్తున్న ఫొటోను చిరంజీవి షేర్ చేశారు. ఫొటో ను పోస్ట్ చేస్తూ.. కాలం మారినా.. దేశం మారినా.. తాను..నేను మాత్రం ఏమీ మారలేదని కాప్షన్ కూడా పెట్టారు. ఆ రెండు ఫొటోలో చిరు-సురేఖ ఒకే రంగు బట్టలు…
కియారా అద్వానీ ఫేవరెట్ సినిమా
‘భరత్ అనే నేను’తో తెలుగుతెరకు కథానాయికగా పరిచయమైంది కియారా అద్వానీ. అందులో ‘వసుమతి’ పాత్రలో ఒదిగిపోవడమే కాకుండా.. తన అభినయంతో, అందంతో తెలుగు కుర్రకారును కట్టిపడేసింది. ఆ తరువాత ‘వినయ విధేయ రామ’లోనూ సందడి చేసిన కియారా.. ప్రస్తుతం తన దృష్టంతా హిందీ చిత్రాలపైనే కేంద్రీకరించింది.
కొత్త లుక్‌లో విజయ్ దేవరకొండ?
యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ త్వరలో ఓ స్పోర్ట్స్ డ్రామాలో సందడి చేయనున్న సంగతి తెలిసిందే. 'ఇస్మార్ట్' డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. ఇప్పటికే కొంతమేర చిత్రీకరణ పూర్తి చేసుకుంది. లాక్‌డౌన్ పిరియడ్ ముగిసిన తరువాత ఈ చిత్రానికి సంబంధించిన నెక్స్ట్ షెడ్యూల్ ప్రారంభం కానుంది.

ఉత్తరప్రదేశ్ నేపథ్యంలో హను రాఘవపూడి చిత్రం
'అందాల రాక్షసి', 'కృష్ణగాడి వీర ప్రేమగాథ', 'లై', 'పడి పడి లేచె మనసు'.. ఇలా ఒకదానితో ఒకటి సంబంధం లేని సినిమాలను రూపొందించాడు హను రాఘవపూడి. త్వరలో ఈ టాలెంటెడ్ డైరెక్టర్.. స్వప్న సినిమా సంస్థలో ఓ చిత్రం చేయనున్నాడు. మలయాళ యువ కథానాయకుడు దుల్కర్ సల్మాన్ ఇందులో హీరోగా నటించబోతున్నాడు. లాక్ డౌన్ పిరియడ్ అనంతరం ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది.

లక్కీ బ్యానర్‌లో సమంత ఫీమేల్ సెంట్రిక్ ఫిలిమ్?
ఎలాంటి పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోయే నటీమణుల్లో కుందనపు బొమ్మ సమంత ఒకరు. గత కొంతకాలంగా నాయికా ప్రాధాన్యం ఉన్న చిత్రాల్లోనే నటిస్తూ వస్తున్న సామ్.. తాజాగా మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట.
నెగటివ్ రోల్ లో అదితి రావు హైదరి ?
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో నాని, సుధీర్ బాబు హీరోలుగా మల్టీ స్టారర్ "V" మూవీ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందింది. నివేత థామస్, అదితి రావు హైదరి కథానాయికలు. జగపతి బాబు, నాజర్, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటించారు. అమిత్ త్రివేది సాంగ్స్ , థమన్ ఎస్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. కరోనా మహమ్మారి కారణంగా "V" మూవీ విడుదల వాయిదా పడింది.

నిధి అగర్వాల్.. డ్రీమ్ ప్రాజెక్ట్
నిధి అగర్వాల్.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయనక్కర్లేని పేరు. 'సవ్యసాచి'తో తెలుగు తెరకు పరిచయమైన నిధి.. ఆపై 'మిస్టర్ మజ్ను', 'ఇస్మార్ట్ శంకర్' చిత్రాల్లో సందడి చేసింది. వీటిలో 'ఇస్మార్ట్ శంకర్' నిధికి తొలి బ్లాక్‌బస్టర్‌ని అందించింది. త్వరలో ఈ టాలెంటెడ్ బ్యూటీ.. మాస్ మహారాజా రవితేజ సరసన కనువిందు చేయనుంది.
'ధృవ' కాంబినేషన్‌లో మరో చిత్రం?
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచిన చిత్రాల్లో 'ధృవ'(2016) ఒకటి. కోలీవుడ్ బ్లాక్‌బస్టర్ 'తని ఒరువన్' ఆధారంగా రూపొందిన ఈ కాప్ డ్రామాని టాలెంటెడ్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కించాడు. తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్పుచేర్పులతో రూపొందిన 'ధృవ'.. ఇక్కడ కూడా విజయపథంలో పయనించింది. నటుడిగా చరణ్‌కి మంచి గుర్తింపును తీసుకొచ్చింది.
మొన్న ఆల్కహాల్ ఐడియా.. ఇప్పుడు మరో ఐడియా..!
థియేటర్ లో ఆల్కహాల్ అమ్మితే ఏలా ఉంటది. కూల్ డైరెక్టర్ తన ఐడియా ను సోషల్ మీడియాలో షేర్ చేసుకొని.. ఒక్కసారిగా సంచలనం సృష్టించాడు. ఇక ఇంత సైలెంట్ గా ఉన్న డైరెక్టర్... మైండ్ లో ఇంత వైలెంట్ ఐడియా వుందా అంటూ పలు విమర్శలే వచ్చాయి. ఇక ఇప్పుడు మరో ఐడియా తో వచ్చేశాడు. అదే 'డ్రైవ్-ఇన్ థియేటర్' ఆలోచన. ‘డ్రైవ్ – ఇన్ థియేటర్.. పాత రోజుల్లో టూరింగ్ టాకీలలాగా, దీని గురించి మీరు ఏమనుకుంటున్నారూ..?’ అని మరోసారి నెటిజన్ల అభిప్రాయాన్ని అడిగారు. ఇక ఈ ఐడియా పై కూడా భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. ఒక నెటిజెన్ అయితే ‘‘సంతోషంగా ఇంట్లో కూర్చుని, కావలసింది చేసుకొని తింటూ నచ్చిన సినిమాను 55 అంగుళాల టీవీలో చూస్తాం కానీ…
షార్ట్ ఫిల్మ్ లో పాయల్ రాజ్ పుత్
సెన్సేషనల్ హిట్ "RX 100 " మూవీ తో టాలీవుడ్ కు ఎంటర్ అయిన పంజాబీ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు. "వెంకీ మామ ", "డిస్కో రాజా " మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. పాయల్ ప్రస్తుతం జయంత్ C పరాన్జీ దర్శకత్వంలో రూపొందుతున్న "నరేంద్ర" మూవీ లో ఫైటర్ పైలట్ గా నటిస్తున్నారు. "ఏంజెల్ " మూవీ తో కోలీవుడ్ లో ఎంటర్ కానున్నారు.
దీపావళి బరిలో విజయ్ 'మాస్టర్'?
'ఖైదీ' వంటి సంచలన విజయం తరువాత టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ రూపొందిస్తున్న చిత్రం 'మాస్టర్'. కోలీవుడ్ స్టార్ 'ఇళయ దళపతి' విజయ్ టైటిల్ రోల్‌లో నటిస్తున్న ఈ సినిమాలో మాళవికా మోహనన్ నాయికగా నటిస్తోంది. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని.. తొలుత తమిళ సంవత్సరాదిని పురస్కరించుకుని ఏప్రిల్ 9న విడుదల చేయాలని భావించారు.
సూర్యతో మరోసారి కె.వి.ఆనంద్?
కోలీవుడ్ స్టార్ సూర్యకి కలిసొచ్చిన దర్శకుల్లో కె.వి. ఆనంద్ ఒకరు. ఈ ఇద్దరి కలయికలో వచ్చిన 'అయన్' (వీడొక్కడే), 'మాట్రాన్' (బ్రదర్స్), 'కాప్పాన్' (బందోబస్త్) చిత్రాలు మంచి ఆదరణనే పొందాయి. కట్ చేస్తే.. త్వరలోనే ఈ ఇద్దరి కాంబినేషన్ లో నాలుగో సినిమా రాబోతుందని తమిళ చిత్ర వర్గాల సమాచారం.
రవితేజ చిత్రంలో మెగా హీరో?
మాస్ మహారాజా రవితేజ వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఒకవైపు తన తాజా చిత్రం 'క్రాక్' చిత్రీకరణ తుది దశలో ఉండగా.. మరోవైపు 'రాక్షసుడు' దర్శకుడు రమేష్ వర్మ కాంబినేషన్ లో ఓ యాక్షన్ థ్రిల్లర్ చేయనున్నాడు రవితేజ. లాక్ డౌన్ పీరియడ్ అనంతరం ఈ క్రేజీ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది.
సంక్రాంతి సీజన్‌లో 'ఎన్.బి.కె.106'?
నటసింహ నందమూరి బాలకృష్ణకి.. సంక్రాంతి సీజన్‌తో మంచి అనుబంధమే ఉంది. తన కెరీర్‌లో పలు ఘనవిజయాలు ఈ సీజన్‌లోనే నమోదయ్యాయి. ఈ నేపథ్యంలోనే.. బాలయ్య తదుపరి చిత్రం కూడా ముగ్గుల పండగని టార్గెట్ చేసుకుందని టాక్.

మ్యూజిక్ పనుల్లో బిజీగా కె.జి.ఎఫ్2 టీమ్..!
సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూసే సినిమాల్లో కె.జి.ఎఫ్ 2 ఒకటి అని కూడా చెప్పొచ్చు. ‘కె.జి.ఎఫ్’ బ్లాక్ బస్టర్ కొట్టడంతో ఈ సినిమాపై కూడా అదే రేంజ్ లో అంచానాలు పెంచుకున్నారు అభిమానులు. ఇక అభిమానులను ఎట్టి పరిస్థితుల్లోనూ నిరాశ పెట్టకూడదన్న నేపథ్యంలో ఈ సినిమా అవుట్ ఫుట్ కోసం కోసం చిత్ర యూనిట్ అదే రేంజ్ లో కష్టపడుతున్నట్టు తెలుస్తుంది.
ప్రభాస్ 21 పై అప్ డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్..!
నాగ్ అశ్విన్ తో ప్రభాస్ 21 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అత్యంత భారీ బడ్జెట్‌తో సైన్ ఫిక్షన్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. పాన్ వరల్డ్ లెవెల్ సినిమా కాబట్టి ఈ సినిమాలో భారీ కాస్టింగ్ నే తీసుకోనున్నట్టు తెలుస్తుంది. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా అప్ డేట్ కోసం మరో పక్క అభిమానులు ఎదురు చేస్తున్నారు. ఈనేపథ్యంలో ఒక ప్రభాస్ అభిమాని తన ట్విట్టర్ ద్వారా ఈ సినిమా కాస్టింగ్ పూర్తయిందా ఏదో ఒకటి రిప్లై ఇవ్వండి అని నాగ్ అశ్విన్ ను కోరగా దానికి నాగ్ అశ్విన్ కూడా స్పందించి రిప్లై ఇచ్చాడు.