సక్సెస్ ఫుల్ “వజ్రకాయ ” కన్నడ మూవీ తో సినీకెరీర్ ప్రారంభించిన కన్నడ బ్యూటీ నభా నటేష్ “నన్నుదోచుకుందువటే ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. బ్లాక్ బస్టర్ “ఇస్మార్ట్ శంకర్ ” మూవీ తో పలు అవకాశాలు అందుకున్నారు. నభా నటేష్ ప్రస్తుతం సాయి తేజ్ హీరోగా రూపొందుతున్న “సోలో బ్రతుకే సో బెటర్ “, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా రూపొందుతున్న “”అల్లుడు అదుర్స్ ” మూవీస్ లో నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్




లాక్ డౌన్ కారణంగా బెంగళూరు లోని తన ఇంటికే పరిమితం అయిన నభా నటేష్ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ .. లాక్ డౌన్ మొదటి రెండు వారాలు సంతోషంగా ఉందని , ఆ తరువాత షూటింగ్స్ ఎప్పుడు మొదలవుతాయో నని ఆతృతగా ఎదురుచూస్తున్నానని, కొన్ని స్టోరీ లైన్స్ విన్నానని, పూర్తి స్థాయిలో స్క్రిప్ట్స్ విన్న తరువాత నిర్ణయం తీసుకుంటానని, కథ తరువాతే పారితోషికం అని, కథ నచ్చడంతో పాటు దర్శక, నిర్మాతల క్రెడిబిలిటీ కూడా పరిగణన లో తీసుకుని మూవీస్ ఎంపిక చేసుకుంటానని, థియేటర్ ఆర్టిస్ట్ కాబట్టి మంచి పాత్రలలో నటించాలని కోరుకుంటానని, ప్రస్తుతం తాను ఎంపిక చేసుకున్న పాత్రల పట్ల సంతోషంగా ఉన్నానని, రెండు తెలుగు చిత్రాలలో నటిస్తున్నానని , కొన్ని చిత్రాలు చర్చల దశలో ఉన్నాయని, త్వరలో కోలీవుడ్ కు ఎంటర్ కానున్నానని నభా నటేష్ తెలిపారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























