దీపావళి బరిలో విజయ్ ‘మాస్టర్’?

Thalapathy Vijay Master To Hit Theaters For Dipawali

‘ఖైదీ’ వంటి సంచలన విజయం తరువాత టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ రూపొందిస్తున్న చిత్రం ‘మాస్టర్’. కోలీవుడ్ స్టార్ ‘ఇళయ దళపతి’ విజయ్ టైటిల్ రోల్‌లో నటిస్తున్న ఈ సినిమాలో మాళవికా మోహనన్ నాయికగా నటిస్తోంది. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని.. తొలుత తమిళ సంవత్సరాదిని పురస్కరించుకుని ఏప్రిల్ 9న విడుదల చేయాలని భావించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే కరోనా ఎఫెక్ట్‌తో వాయిదా వేయక తప్పలేదు. ఈ క్రమంలోనే.. ఆ మధ్య విజయ్ పుట్టిన రోజైన జూన్ 22న ఈ సినిమాను రిలీజ్ చేస్తారని ప్రచారం సాగింది. ఇంకా లాక్ డౌన్ కొనసాగుతుండటంతో.. జూన్ 22న కూడా ఈ సినిమా విడుదల కావడం దాదాపు కష్టమేనని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే.. మరో కొత్త విడుదల తేదీ వెలుగులోకి వచ్చింది. కోలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం.. దీపావళి సీజన్‌లో ‘మాస్టర్’ ఆగమనం ఉండవచ్చని ప్రముఖంగా వినిపిస్తోంది. త్వరలోనే ‘మాస్టర్’ విడుదల తేదీపై క్లారిటీ రానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × five =