లక్కీ బ్యానర్‌లో సమంత ఫీమేల్ సెంట్రిక్ ఫిలిమ్?

Tollywood Star Actress Samantha Akkineni To Work Under Her Lucky Movie Banner For Third Time

ఎలాంటి పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోయే నటీమణుల్లో కుందనపు బొమ్మ సమంత ఒకరు. గత కొంతకాలంగా నాయికా ప్రాధాన్యం ఉన్న చిత్రాల్లోనే నటిస్తూ వస్తున్న సామ్.. తాజాగా మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివరాల్లోకి వెళితే.. సమంత నాయికగా ‘జనతా గ్యారేజ్’ (2016), ‘రంగస్థలం’ (2018) వంటి సంచలన విజయం సాధించిన చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్.. త్వరలో ఓ హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ నిర్మించేందుకు ప్లాన్ చేస్తోందట. అంతేకాదు.. ఇందులో నాయిక పాత్ర కోసం సమంతతో చర్చలు జరుపుతున్నారని టాక్. త్వరలోనే సమంత, మైత్రీ మూవీ మేకర్స్ కాంబినేషన్ మూవీపై క్లారిటీ వస్తుంది.

మరి.. మైత్రి సంస్థలో ఇప్పటికే రెండు ఘన విజయాలు అందుకున్న సమంత.. హ్యాట్రిక్ కొడుతుందేమో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.