ట్యాగ్ · 366 కథనాలు · పేజీ 11
దుల్కర్ సల్మాన్‌కి జోడిగా పూజా హెగ్డే?
చిరుతో నటించాలని ఉంది..!

మరో ఛాన్స్ కొట్టేసిన హరీష్..!
అభిమానులకు ఎన్టీఆర్ విన్నపం..!
ఇన్ స్టా గ్రామ్ ఫాలోవర్స్ కు షాక్
వరుణ్ తేజ్ చిత్రానికి నదియా సెంటిమెంట్
స్క్రిప్ట్ వర్క్ లో బిజీ

తుది మెరుగుల్లో 'యన్టీఆర్ 30' స్క్రిప్ట్ వర్క్
‘కార్తికేయ’ సీక్వెల్ కోసం నిఖిల్ పెద్ద సాహసం
పరశురామ్.. ఫీమేల్ సెంట్రిక్ మూవీ

ముగ్గురు నాయికలతో రవితేజ సందడి
అరుణ్ విజయ్ హీరోగా మిస్కిన్ చిత్రం

యన్టీఆర్ ‘శ్రీకృష్ణాంజనేయ యుధ్ధం’కు 48 ఏళ్ళు

సూపర్ స్టార్ కృష్ణ ‘డియర్ బ్రదర్’కి 25 ఏళ్ళు

శోభన్‌బాబు ‘చట్టంతో చదరంగం’కు 32 ఏళ్ళు

వెంకటేష్ ‘ఒంటరి పోరాటం’కు 31 ఏళ్ళు
హెబ్బా పటేల్ రిపీట్ చేస్తుందా?
విజయ్ దేవరకొండ మాస్ లుక్
సెన్సేషనల్ హిట్ "అర్జున్ రెడ్డి "మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి విజయ్ దేవరకొండ అధిక సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్నారు. బ్లాక్ బస్టర్ "గీత గోవిందం " మూవీతో విజయ్ యెనలేని క్రేజ్ పెంపొందించుకున్నారు. చిత్ర జయాపజయాలతో సంబంధం లేకుండా విజయ్ ను అభిమానించే వారు ఎక్కువయ్యారు. విజయ్ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ "ఫైటర్ "(వర్కింగ్ టైటిల్ )మూవీ లో నటిస్తున్నారు. ఫైటర్ గా నటిస్తున్న విజయ్ ఈ మూవీ తో బాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.
దుల్కర్ సల్మాన్‌కి జోడిగా పూజా హెగ్డే?
'ఓకే బంగారం', 'కనులు కనులను దోచాయంటే' వంటి తమిళ అనువాద చిత్రాలతోనూ.. 'మహానటి' వంటి స్ట్రెయిట్ తెలుగు ఫిలింతోనూ తెలుగునాట ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు మలయాళ యువ కథానాయకుడు దుల్కర్ సల్మాన్. త్వరలో ఈ టాలెంటెడ్ స్టార్ మరో స్ట్రెయిట్ తెలుగు ఫిలింలో నటించబోతున్నాడు. 'అందాల రాక్షసి', 'కృష్ణగాడి వీర ప్రేమగాధ', 'లై', 'పడి పడి లేచే మనసు' చిత్రాల దర్శకుడు హను రాఘవపూడి రూపొందించనున్న ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ 'స్వప్న సినిమా' నిర్మించనుంది.
చిరుతో నటించాలని ఉంది..!
టైటిల్ చూసి అదేంటి రమ్య కృష్ణ చిరుతో చాలా సినిమాలు చేసింది కదా అన్న డౌట్ వచ్చే ఉంటది కదా. మెగాస్టార్ చిరంజీవి-రమ్య కృష్ణ కాంబినేషన్ ఒకప్పుడు సూపర్ హిట్ కాంబినేషన్ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే సినిమాలో కాదులెండి రమ్యకృష్ణ అనేది. ఆమె చేయాలనుకుంటుంది తనతో పాటు సినిమాలో కాదు.. వెబ్ సిరీస్‌లో.

మరో ఛాన్స్ కొట్టేసిన హరీష్..!
గతకొద్ది నాలుగైదు రోజుల నుండి సోషల్ మీడియా లో హరీష్ శంకర్ పేరు గట్టిగానే వినిపిస్తుంది. దానికి కారణం హరీష్, బండ్ల గణేష్ మధ్య వారే. ఇక ఇది పక్కనపెడితే ప్రస్తుతం హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీ గా వున్నాడు. ఈ సినిమాకు సంబంధిన వివరాలు త్వరలో తెలియనున్నాయి. ఇక ఇప్పుడు మరో ఆఫర్ హరీష్ శంకర్ కు వచ్చినట్టు తెలుస్తుంది.
అభిమానులకు ఎన్టీఆర్ విన్నపం..!
మే 20న యంగ్ డైరెక్టర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు అన్న సంగతి తెలిసిందే. ఇక ఆ రోజు కోసం ఆర్ఆర్ఆర్ సినిమా నుండి తమ హీరో కు సంబంధించి ఏదో ఒక అప్ డేట్ వస్తుందని అనుకున్నారు. అయితే ఇప్పుడు ఆ ఛాన్స్ కూడా లేదని తెలిసింది. ఈ రోజు ఉదయమే చిత్రయూనిట్ లాక్ డౌన్ వల్ల కొన్ని టెక్నీకల్ ఇష్యూస్ వల్ల ఇంట్రడక్షన్ వీడియో కానీ.. ఫస్ట్ లుక్ కానీ విడుదల చేయలేకపోతున్నాం అని తెలిపారు. ఇక ఇప్పుడు దీనిపై ఎన్టీఆర్ కూడా స్పందించాడు. తన పుట్టిరోజు వేడుకలకు అభిమానులు దూరంగా ఉండాలని.. అందరూ ఇంట్లోనే ఉండాలని కోరాడు.
నాన్న డైలాగ్స్ తో ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటున్న ఆకాష్ పూరీ..!
టాలీవుడ్ లో ఉన్న డైరెక్టర్ లలో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్ ఉంటుంది. వారిలో డాషింగ్ డైరెక్టర్ పూరీ స్టైల్ ఇంకా సెపరేట్. నిజ జీవితానికి దగ్గర ఉండే విధంగా తన డైలాగ్స్ ఉంటాయి. అందుకే అందరూ పూరీ సినిమాలంటే అంత ఇష్టపడతారు. ఇక పూరీ వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు పూరీ తనయుడు ఆకాష్ పూరీ. ఇప్పటికి రెండు మూడు సినిమాలు చేసినా సరైనా విజయం దక్కించుకోలేకపోయాడు.

ఎన్టీఆర్ అభిమానులకు నిరాశే.. బర్త్ డే కి ఎలాంటి వీడియో లేదు..!
ఎన్టీఆర్ పుట్టిన రోజు కోసం అభిమానులు వేయి కళ్ళతో ఏడుస్తున్నారు. లాక్ డౌన్ కాబట్టి హీరోలు లు ఎలాగూ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవట్లేదు.. ఇంకా అభిమానులను ఎలాగూ పుట్టినరోజు వేడుకలు జరపొద్దని చెపుతున్నారు. అయితే అభిమానులు ఎదురుచూసేది మాత్రం ఆర్ఆర్ఆర్ నుండి ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ వీడియో కోసం. కానీ ఇప్పుడు వారి ఆశలకు నిరాశే ఎదురైంది. తాజాగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు
ఇన్ స్టా గ్రామ్ ఫాలోవర్స్ కు షాక్
మలయాళ మూవీ "ఒరు అదార్ లవ్ "(లవర్స్ డే ) తో ప్రియా ప్రకాష్ వారియర్ సినీ కెరీర్ ప్రారంభించారు. ఆ మూవీ లోని ఒక సాంగ్ లో కన్ను గీటే ఎక్స్ ప్రెషన్ తో ఇంటర్ నెట్ షేక్ చేసి ఓవర్ నైట్ స్టార్ గా మారి ప్రియా ప్రకాష్ కోట్లాది అభిమానులను సంపాదించుకున్నారు. "శ్రీదేవి బంగళా " మూవీ తో బాలీవుడ్ లో ప్రవేశించారు. సైబర్ క్రైమ్ నేపథ్యం లో రూపొందే మరో బాలీవుడ్ మూవీ"లవ్ హ్యాకర్స్ " కి ప్రియా ప్రకాష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. "విష్ణు ప్రియ" మూవీ తో కన్నడ, "చెక్ "మూవీ తో తెలుగు చిత్ర పరిశ్రమలకు ప్రియా ప్రకాష్ పరిచయం అవుతున్నారు.
వరుణ్ తేజ్ చిత్రానికి నదియా సెంటిమెంట్
'ఎఫ్ 2', 'గద్దలకొండ గణేష్'.. ఇలా వరుస విజయాలతో ముందుకు సాగుతున్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. ప్రస్తుతం ఈ టాలెంటెడ్ స్టార్ చేతిలో ఓ స్పోర్ట్స్ డ్రామా ఉంది. నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి రూపొందిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కొంతమేర చిత్రీకరణ పూర్తి చేసుకుంది. లాక్ డౌన్ పిరియడ్ అనంతరం తదుపరి షెడ్యూల్‌ను ప్రారంభించనున్నారు.
స్క్రిప్ట్ వర్క్ లో బిజీ
"కేడి " మూవీ కి అసిస్టెంట్ డైరెక్టర్ గా సినీ కెరీర్ ప్రారంభించిన సందీప్ రెడ్డి వంగ సక్సెస్ ఫుల్ "మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు" మూవీ కి అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేశారు. విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన సెన్సేషనల్ హిట్ "అర్జున్ రెడ్డి " మూవీ తో సందీప్ దర్శకుడిగా మారారు. స్టార్ హీరో షాహిద్ కపూర్ కథానాయకుడు గా "అర్జున్ రెడ్డి "మూవీ ని "కబీర్ సింగ్ "గా సందీప్ హిందీలో రీమేక్ చేశారు. ఆ మూవీ రికార్డ్ కలెక్షన్స్ తో బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ మూవీ గా నిలిచింది. "అర్జున్ రెడ్డి "తమిళ రీమేక్ "ఆదిత్య వర్మ" మూవీకి స్టోరీ ,స్క్రీన్ ప్లే సందీప్ అందించారు.

తుది మెరుగుల్లో 'యన్టీఆర్ 30' స్క్రిప్ట్ వర్క్
'అరవింద సమేత' వంటి విజయవంతమైన చిత్రం తర్వాత యంగ్ టైగర్ యన్టీఆర్, సెల్యులాయిడ్ తాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, యన్టీఆర్ ఆర్ట్స్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించనున్నాయి. 'ఆర్ ఆర్ ఆర్' చిత్రానికి సంబంధించి తన షూటింగ్ పార్ట్ పూర్తయిన వెంటనే తారక్ ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు. యన్టీఆర్ కెరీర్‌లో 30వ చిత్రంగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ రూపొందుతోంది.
‘కార్తికేయ’ సీక్వెల్ కోసం నిఖిల్ పెద్ద సాహసం
యువ కథానాయకుడు నిఖిల్ కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచిన చిత్రాల్లో ‘కార్తికేయ’ ఒకటి. 2014లో విడుదలైన ఈ థ్రిల్లర్ మూవీతో చందు మొండేటి దర్శకుడిగా తొలి అడుగు వేశాడు. కట్ చేస్తే.. ఆరేళ్ళ సుదీర్ఘ విరామం తరువాత నిఖిల్, చందు కాంబినేషన్‌లో మరో చిత్రం రాబోతోంది. ‘కార్తికేయ’కి సీక్వెల్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది.
పరశురామ్.. ఫీమేల్ సెంట్రిక్ మూవీ
2018 పంద్రాగస్టుకి విడుదలైన ‘గీత గోవిందం’తో కెరీర్ బెస్ట్ హిట్‌ను అందుకున్నాడు టాలెంటెడ్ డైరెక్టర్ పరశురామ్. కాగా, తన తదుపరి చిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో చేయబోతున్నాడు. లాక్ డౌన్ పిరియడ్ అనంతరం ఈ సినిమా పట్టాలెక్కనుంది. అలాగే, యువసామ్రాట్ నాగచైతన్యతోనూ ‘నాగేశ్వరరావు’ పేరుతో ఓ సినిమా చేయబోతున్నాడు పరశురామ్. మహేష్ సినిమా పూర్తయ్యాక చైతు సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

ముగ్గురు నాయికలతో రవితేజ సందడి
ఈ ఏడాది ఆరంభంలో విడుదలైన సైన్స్ ఫిక్షన్ మూవీ 'డిస్కో రాజా'లో ముగ్గురు కథానాయికలతో సందడి చేశాడు మాస్ మహరాజా రవితేజ. కట్ చేస్తే.. త్వరలో మరో సినిమా కోసం ఇదే బాటలో వెళ్లనున్నాడట ఈ టాలెంటెడ్ స్టార్.
అరుణ్ విజయ్ హీరోగా మిస్కిన్ చిత్రం
'పిశాచి', 'డిటెక్టివ్' వంటి అనువాద చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన దర్శకుడు మిస్కిన్. ఇటీవల ఈ 'థ్రిల్లర్ సినిమాల స్పెషలిస్ట్' రూపొందించిన తమిళ చిత్రం 'సైకో' కూడా ప్రజాదరణ పొందింది. ఉదయనిధి స్టాలిన్, అదితిరావ్ హైదరి, నిత్యా మీనన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్.. దర్శకుడిగా మిస్కిన్ స్థాయిని మరింత పెంచింది.

యన్టీఆర్ ‘శ్రీకృష్ణాంజనేయ యుధ్ధం’కు 48 ఏళ్ళు
నటరత్న స్వర్గీయ నందమూరి తారక రామారావుకు బాగా కలిసొచ్చిన దిగ్గజ దర్శకుల్లో సి.యస్.రావు ఒకరు. వీరిద్దరి కలయికలో పలు పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలు తెరకెక్కగా వాటిలో సింహభాగం విజయం సాధించాయి. అలాంటి అలనాటి అపురూప చిత్రాల్లో ‘శ్రీకృష్ణాంజనేయ యుధ్ధం’ ఒకటి. “అహంకారంతో బలరాముడు, అజ్ఞానంతో సత్యభామ, పదవీవ్యామోహంతో గరుత్మంతుడు పెంచుకున్న దర్పాన్ని అణచి, ఆంజనేయుని భక్తికి గల శక్తిని నిరూపించిన” సినిమా ఇది. ఇందులో యన్టీఆర్ శ్రీకృష్ణుడిగా నటించగా, రాజనాల ఆంజనేయుడిగా దర్శనమిచ్చారు. యన్టీఆర్ సరసన దేవిక, వాణిశ్రీ కథానాయికలుగా నటించారు. యస్.వి.రంగారావు, కాంతారావు, రాజనాల, ఆర్జా జనార్ధన్‌రావు…

సూపర్ స్టార్ కృష్ణ ‘డియర్ బ్రదర్’కి 25 ఏళ్ళు
సూపర్ స్టార్ కృష్ణ నటించిన పలు మాస్ ఎంటర్‌టైనర్స్ ప్రేక్షకులను అలరించాయి. వాటిలో ‘డియర్ బ్రదర్’ ఒకటి. టి.ప్రభాకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కృష్ణకి జోడిగా గౌతమి నటించింది. రఘువరన్, ‘మహర్షి’ రాఘవ, యమున, డిస్కో శాంతి, బ్రహ్మానందం, అలీ, బాబుమోహన్, సారథి ముఖ్య పాత్రలు పోషించగా సురభి ప్రత్యేక గీతంలో మెరిసింది.

శోభన్‌బాబు ‘చట్టంతో చదరంగం’కు 32 ఏళ్ళు
నటభూషణ్ శోభన్‌బాబుకు బాగా అచ్చొచ్చిన కథానాయికల్లో సుహాసిని ఒకరు. వీరిద్దరి కలయికలో వచ్చిన పలు సినిమాలు ప్రేక్షకులను అలరించాయి. వాటిలో ‘చట్టంతో చదరంగం’ ఒకటి. టాలెంటెడ్ డైరెక్టర్ కె.మురళీమోహన్‌రావు రూపొందించిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో ‘ఊర్వశి’ శారద, అర్జున్, శరత్‌బాబు, కల్పన ముఖ్య పాత్రలు పోషించారు. శ్రీ కృష్ణ ప్రసన్న ఎంటర్‌ప్రైజెస్ పతాకంపై బి.వి.యస్.యన్.ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

వెంకటేష్ ‘ఒంటరి పోరాటం’కు 31 ఏళ్ళు
‘విక్టరీ’ వెంకటేష్, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావుది సక్సెస్‌ఫుల్ కాంబినేషన్. వీరిద్దరి కలయికలో వచ్చిన పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపించాయి. వాటిలో ‘ఒంటరి పోరాటం’ ఒకటి. ‘కలియుగ పాండవులు’, ‘భారతంలో అర్జునుడు’ వంటి సినిమాల తరువాత వెంకీ, రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో వచ్చిన మూడో చిత్రం ‘ఒంటరి పోరాటం’. ఇందులో వెంకీకి జోడిగా ఉత్తరాది భామ ఫరా నటించగా.. రూపిణి మరో నాయికపాత్రలో కనిపించింది. కైకాల సత్యనారాయణ, మోహన్‌బాబు, బ్రహ్మానందం, సుధాకర్, ఆనంద్‌రాజ్, శివాజీరాజా, చిట్టిబాబు, చిడతల అప్పారావు, పి.జె.శర్మ, అన్నపూర్ణ, శుభ, మమత, ‘డబ్బింగ్’ జానకి ముఖ్య భూమికలు పోషించగా.. ‘సహజనటి’ జయసుధ…
హెబ్బా పటేల్ రిపీట్ చేస్తుందా?
‘అలా ఎలా’తో తెలుగుతెరకు కథానాయికగా పరిచయమైంది హెబ్బా పటేల్. మొదటి సినిమాతోనే తన ఖాతాలో విజయాన్ని నమోదు చేసుకున్న ఈ టాలెంటెడ్ బ్యూటీ.. ‘కుమారి 21 ఎఫ్’ రూపంలో తొలి బ్లాక్‌బస్టర్ జమ చేసుకుంది. ఆపై ‘ఈడో రకం ఆడో రకం’, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’తో ఆ పరంపరని కొనసాగించింది. అయితే, ఆ తరువాత వచ్చిన సినిమాలేవీ ఆ స్థాయి విజయాలు సాధించకపోవడంతో హెబ్బా కెరీర్ కాస్త ట్రాక్ తప్పినట్టు అయింది. అయితే, ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలైన ‘భీష్మ’తో మళ్ళీ ఓ విజయాన్ని అందుకుంది. కాకపోతే ఇందులో కథానాయికగా కాకుండా.. అతిథి పాత్రలో మెరిసింది హెబ్బా. తన కెరీర్‌లో ఫస్ట్ టైమ్ చేసిన అతిథి పాత్ర ఇదే కావడం విశేషం.