నిధి అగర్వాల్.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయనక్కర్లేని పేరు. ‘సవ్యసాచి’తో తెలుగు తెరకు పరిచయమైన నిధి.. ఆపై ‘మిస్టర్ మజ్ను’, ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రాల్లో సందడి చేసింది. వీటిలో ‘ఇస్మార్ట్ శంకర్’ నిధికి తొలి బ్లాక్‌బస్టర్‌ని అందించింది. త్వరలో ఈ టాలెంటెడ్ బ్యూటీ.. మాస్ మహారాజా రవితేజ సరసన కనువిందు చేయనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్



ఇదిలా ఉంటే.. తాజాగా ఓ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి చెప్పుకొచ్చింది నిధి అగర్వాల్. తనకు చారిత్రక నేపథ్య సినిమాలంటే చాలా ఇష్టం అని.. నిర్దేశితమైన కాలంలో సాగే ఆ కథల్లో సెట్లు, ఆ గెటప్పులు తనను బాగా ఆకట్టుకుంటాయని.. అందుకే ఆ తరహా చిత్రాల్లో నటించే అవకాశం కోసం ఎదురు చూస్తున్నానని నిధి వెల్లడించింది. అలాగే ఓ యాక్షన్ రోల్ కూడా చేయాలని ఉందని ముక్తాయించింది ఈ బ్యూటీ.
మరి.. నిధి అగర్వాల్ డ్రీమ్ ఎప్పటికి నెరవేరుతుందో చూడాలి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























