కొత్త లుక్‌లో విజయ్ దేవరకొండ?

Tollywood Crazy Actor Vijay Deverakonda To Wow His Fans With His New Look In His Upcoming Movie

యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ త్వరలో ఓ స్పోర్ట్స్ డ్రామాలో సందడి చేయనున్న సంగతి తెలిసిందే. ‘ఇస్మార్ట్’ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. ఇప్పటికే కొంతమేర చిత్రీకరణ పూర్తి చేసుకుంది. లాక్‌డౌన్ పిరియడ్ ముగిసిన తరువాత ఈ చిత్రానికి సంబంధించిన నెక్స్ట్ షెడ్యూల్ ప్రారంభం కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంటే.. ‘ఫైటర్’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్న ఈ పాన్ ఇండియా మూవీ కోసం విజయ్.. రెండు విభిన్న కోణాలు ఉన్న పాత్రలో కనిపిస్తాడని సమాచారం. మరీ ముఖ్యంగా.. ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే ఎపిసోడ్స్‌లో ఇదివరకెన్నడూ కనిపించని లుక్‌లో విజయ్ దర్శనమిస్తాడని వినిపిస్తోంది. మరి.. ఆ వార్తల్లో నిజానిజాలు ఏంటో తెలియాలంటే మరి కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.

అనన్య పాండే కథానాయికగా నటిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీని పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 2021 ప్రథమార్థంలో ఈ క్రేజీ ప్రాజెక్ట్ విడుదల కానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − eight =