సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూసే సినిమాల్లో కె.జి.ఎఫ్ 2 ఒకటి అని కూడా చెప్పొచ్చు. ‘కె.జి.ఎఫ్’ బ్లాక్ బస్టర్ కొట్టడంతో ఈ సినిమాపై కూడా అదే రేంజ్ లో అంచానాలు పెంచుకున్నారు అభిమానులు. ఇక అభిమానులను ఎట్టి పరిస్థితుల్లోనూ నిరాశ పెట్టకూడదన్న నేపథ్యంలో ఈ సినిమా అవుట్ ఫుట్ కోసం కోసం చిత్ర యూనిట్ అదే రేంజ్ లో కష్టపడుతున్నట్టు తెలుస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో అప్ డేట్ ఇచ్చారు. ప్రస్తుతం కె.జి.ఎఫ్2 సినిమా మ్యూజిక్ పనుల్లో బిజీ గా ఉన్నట్టు తెలిపారు. ఈ సినిమా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అయిన కార్తీక్ గౌడ..తన ట్విట్టర్ ద్వారా ఒక ఫొటోను షేర్ చేశాడు. ఈ ఫొటోలో ప్రశాంత్ నీల్.. మ్యూజిక్ డైరెక్టర్ రవి మ్యూజిక్ సెషన్స్ లో బిజీ గా ఉన్నట్టు తెలుస్తుంది.
మరోవైపు ‘కె.జి.ఎఫ్ 2’ సినిమా రిలీజ్ విషయంలో కూడా నిర్మాత కార్తీక్ గౌడ క్లారిటీ ఇచ్చారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే అక్టోబర్ 23న విడుదల చేస్తామని అన్నారు. ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా… సంజయ్ దత్, రవీనా టాండన్ వంటి బాలీవుడ్ స్టార్లతో పాటు తెలుగు నటుడు రావు రమేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. హోంబలే ఫిలింస్, ఎక్సెల్ మూవీస్, వారాహి చలన చిత్రం బ్యానర్స్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
మరి చూద్దాం ఇది ఎంత వరకూ వర్క్ అవుట్ అవుతుందో.మరి చాప్టర్ 1 సూపర్ హిట్ అవడంతో కె.జి.ఎఫ్ చాప్టర్ 2 మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా ఎన్ని సంచలనాలు క్రియేట్ చేస్తుందో చుద్దాం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: