ప్రభాస్ 21 పై అప్ డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్..!

నాగ్ అశ్విన్ తో ప్రభాస్ 21 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అత్యంత భారీ బడ్జెట్‌తో సైన్ ఫిక్షన్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. పాన్ వరల్డ్ లెవెల్ సినిమా కాబట్టి ఈ సినిమాలో భారీ కాస్టింగ్ నే తీసుకోనున్నట్టు తెలుస్తుంది. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా అప్ డేట్ కోసం మరో పక్క అభిమానులు ఎదురు చేస్తున్నారు. ఈనేపథ్యంలో ఒక ప్రభాస్ అభిమాని తన ట్విట్టర్ ద్వారా ఈ సినిమా కాస్టింగ్ పూర్తయిందా ఏదో ఒకటి రిప్లై ఇవ్వండి అని నాగ్ అశ్విన్ ను కోరగా దానికి నాగ్ అశ్విన్ కూడా స్పందించి రిప్లై ఇచ్చాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

‘ప్రస్తుతం స్క్రిప్ట్ మరియు ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని, అయితే కరోనా కారణంగా కొన్ని పనులు లేట్ అయ్యాయి, అయితే స్క్రిప్ట్ కి టైం దొరకినందుకు హ్యాపీ, ఇక ఈ చిత్రంలోని కీలక పాత్రల కోసం క్యాస్టింగ్ గా ఎవర్ని తీసుకోవాలో అని కొన్ని ఐడియాలు ఉన్నాయి, కానీ ఇప్పటివరకూ ఎవర్ని ఫైనల్ చెయ్యలేదు. ఇంకా టైం పడుతుంది’ అంటూ నాగ్ అశ్విన్ పోస్ట్ చేశాడు.

కాగా పాన్ వరల్డ్ సినిమా కాబట్టి ఈ సినిమా అన్ని ప్రధాన భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ నిర్మించనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 + 18 =