ట్యాగ్ · 366 కథనాలు · పేజీ 13
లాక్ డౌన్ లో రామ్ చరణ్ ఫీలింగ్స్
పూజాహెగ్డే కలల హీరో ?
షూటింగ్ లకు అనుమతి.. షరతులకు భయపడుతున్న నిర్మాతలు..!
లాక్ డౌన్ ఒక కొత్త అనుభవం - రమ్యకృష్ణ
నిధి అగర్వాల్ పర్సనల్ స్పేస్ గ్లింప్స్
పొలిటికల్ థ్రిల్లర్‌లో నిత్యా మీనన్?
మరోసారి లక్కీ సీజన్‌లో సుకుమార్?
జనవరి 14న రజినీకాంత్ 'అణ్ణాత్త'?
శోభన్‌బాబు, వాణిశ్రీ ‘జీవనజ్యోతి’కి 45 ఏళ్ళు
ఇస్తా.. మొత్తం తిరిగిచ్చేస్తా..!

నీ మరణం నన్ను కలిచివేసింది..!
'రౌడీ హీరో' కూడా వెబ్ సిరీస్ ల వైపు..!

యదార్ధ సంఘటన ఆధారంగా విజయ్ 'మాస్టర్'..!

"తలైవి "మూవీ లో కీలక పాత్రలో భాగ్యశ్రీ

"సహజ సుందరి" రష్మిక
'KGF2' రిలీజ్ పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత..!
జూనియర్ ఎన్టీఆర్ ట్విట్టర్ రికార్డ్
సంగీత దర్శకుడు కీరవాణి రిటైర్ మెంట్ ?
"మనసు మమత"(1990) మూవీ తో టాలీవుడ్ కు సంగీత దర్శకుడిగా పరిచయం అయిన కీరవాణి 3 దశాబ్దాలుగా తెలుగు, తమిళ , కన్నడ , మలయాళ, హిందీ భాషలలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ కు సంగీతం అందించారు. గాయకుడిగా పలు హిట్ సాంగ్స్ ఆలపించారు. బ్లాక్ బస్టర్ "అన్నమయ్య " మూవీ కి అద్భుతమైన సంగీతం అందించి బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా కీరవాణి నేషనల్ అవార్డ్ అందుకున్నారు. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా 11 నంది, 8ఫిలిం ఫేర్ అవార్డ్స్ అందుకున్న కీరవాణి పలు ఇంటర్వూస్ లో త్వరలోనే రిటైర్ అవుతానని అభిమానులకు షాకిచ్చారు.
లాక్ డౌన్ లో రామ్ చరణ్ ఫీలింగ్స్
కరోనా వైరస్ కారణంగా అనేక పరిశ్రమలతో పాటు కోట్లాది రూపాయల టర్నోవర్ ఉండే చిత్ర పరిశ్రమ కూడా పలు ఇబ్బందులు గురి అయినవిషయం తెలిసిందే. మూవీ షూటింగ్స్, రిలీజ్ లు , ఓపెనింగ్స్, ప్రమోషన్స్, ఇంటర్వ్యూ లతో బిజీగా ఉండే సినీ సెలబ్రిటీస్ ఇళ్ళకే పరిమితం అయ్యారు. ఎప్పుడూ లేనిది సుమారు 2నెలలపాటు ఇంటికే అంకితం అయిన సెలబ్రిటీస్ లాక్ డౌన్ సమయం కంప్లీట్ కై , షూటింగ్స్ ప్రారంభానికై ఎదురు చూస్తున్నారు.
పూజాహెగ్డే కలల హీరో ?
సక్సెస్ ఫుల్ "ఒక లైలా కోసం "మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన పూజాహెగ్డే బ్లాక్ బస్టర్" DJ", "అరవింద సమేత వీర రాఘవ" , "మహర్షి", "గద్దల కొండ గణేష్ ", "అల .. వైకుంఠపురములో .." మూవీస్ లో తన అందం, అభినయం తో ప్రేక్షకులను అలరించారు. టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్న పూజాహెగ్డే, అఖిల్ అక్కినేని జంటగా రూపొందిన "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ "మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. "Prabhas 20 "మూవీలో ప్రభాస్ కు జోడీగా పూజాహెగ్డే నటిస్తున్నారు. బాలీవుడ్ మూవీ "హౌస్ ఫుల్4" ఘనవిజయం సాధించడంతో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ మూవీ "కభీ ఈద్ కభీ దివాలీ "మూవీలో పూజాహెగ్డే హీరోయిన్ గా ఎంపిక అయ్యారు.
షూటింగ్ లకు అనుమతి.. షరతులకు భయపడుతున్న నిర్మాతలు..!
ఈ కరోనా వల్ల సినీ పరిశ్రమకు పెద్ద కష్టాలే వచ్చిపడ్డాయి. ఒక సినిమాలో మనకు నటించే నటీ నటులు తక్కువ మంది కనిపించినా.. సినిమా పూర్తవ్వాలంటే మాత్రం దాని వెనుక కొన్ని వందల మంది ఉంటుంది. ప్రస్తుతం ఇప్పుడు ఇవే ఇబ్బందులు వారి ముందు ఉన్నాయి. చిన్న చిన్న పనులు అంటే ఏవో ఇళ్లల్లో ఉంటూ కానిచ్చేస్తున్నారు కానీ.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కానీ.. షూటింగ్ లు కానీ అలా కుదరని పని. లాక్ డౌన్ తీసేసి అనుమతులు షూటింగ్ లకు అనుమతులు ఇచ్చినా ఎలా పడితే అలా ఇవ్వరని.. కొద్దిమందికి మాత్రమే అనుమతులు ఇచ్చే అవకాశం ఉందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
లాక్ డౌన్ ఒక కొత్త అనుభవం - రమ్యకృష్ణ
దక్షిణాది భాషా చిత్రాలలో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా రాణించిన రమ్యకృష్ణ "కంటే కూతుర్నే కను " మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్ట్రెస్ గా నంది అవార్డ్ అందుకున్నారు. సూపర్ హిట్ "పడయప్పా " మూవీ లో హీరో రజనీకాంత్ కు ధీటుగా రమ్యకృష్ణ నీలాంబరి పాత్రలో పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు తెలుగు, తమిళ మూవీస్ లో నటించి బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ గా అవార్డ్స్ అందుకున్నారు. బ్లాక్ బస్టర్ "బాహుబలి " మూవీ లో శివగామి గా నటించిన రమ్యకృష్ణ పలు అవకాశాలు అందుకుంటున్నారు. రమ్యకృష్ణ ప్రస్తుతం "రంగ మార్తాండ", "ఫైటర్ ", సాయి తేజ్ మూవీ లో…
సితార కోసం మహేష్ పాట..!
లాక్ డౌన్ లో మహేష్ బాబు తన అభిమానులకు సూపర్ ఫన్ ఇస్తున్నారు. మహేష్ బాబు,సితార ల వీడియో లు రోజుకొకటి విడుదల చేస్తూ అభిమానులకు మహేష్ లో ఉన్న మరో యాంగిల్ ను చూపిస్తున్నారు. ఇప్పటికే ఎన్నో వీడియోలను సోషల్ మీడియాలో పంచుకోగా... తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు తన ముద్దుల తనయ సితారతో చిన్నపిల్లాడిలా మారిపోయి డెడ్డీ బెర్రీతో ఆడుకుంటున్న వీడియోను పోస్ట్ చేసింది నమ్రత. ఇక ఈ వీడియోతో పాటు నమ్రత మెసేజ్ పోస్టు చేస్తూ… ‘ప్రేమ, జీవితం మరియు నవ్వు.. మహేష్ – సితు పాప మధ్య చిన్న టెడ్డీ కచేరీ. ఇక సితార మాత్రమే మహేష్ లో ఉన్న చిన్నపిల్లాడిని బయటకు తీసుకురాగలదు’అని పోస్ట్ చేశారు. ఇక ఈ వీడియో లో మహేష్ సీతారాతో ఆడటమే…
నిధి అగర్వాల్ పర్సనల్ స్పేస్ గ్లింప్స్
యాక్షన్ థ్రిల్లర్ "సవ్యసాచి " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన నిధి అగర్వాల్ ఆ తరువాత రొమాంటిక్ కామెడీ డ్రామా "Mr. మజ్ను "మూవీ తో ప్రేక్షకులను అలరించారు. బ్లాక్ బస్టర్ "ఇస్మార్ట్ శంకర్ " మూవీ తో గుర్తింపు పొందారు. నిధి ప్రస్తుతం శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో అశోక్ గల్లా హీరోగా రూపొందుతున్న మూవీ లో హీరోయిన్ గా నటిస్తున్నారు. "భూమి " మూవీ తో కోలీవుడ్, "జేమ్స్ "మూవీ తో శాండల్ వుడ్ కు నిధి పరిచయం అవుతున్నారు.
పొలిటికల్ థ్రిల్లర్‌లో నిత్యా మీనన్?
ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోయే నటీమణుల్లో కేరళకుట్టి నిత్యా మీనన్ ఒకరు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ.. ఇలా పలు భాషల్లో నటిగా తనదైన ముద్ర వేసిన నిత్య.. త్వరలో ఓ పొలిటికల్ థ్రిల్లర్ మూవీతో సందడి చేయనుందని సమాచారం.
థియేటర్ల లో ఆల్కహాల్.. సైలెంట్ డైరెక్టర్ వైలెంట్ ఐడియా..!
డైరెక్టర్ నాగ్ అశ్విన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇటీవలే 'మహానటి' సినిమాతో జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నాడు. ఇక చూడటానికి చాలా సైలెంట్ గా కూల్ గా కనిపించే నాగ్ అశ్విన్ చేసిన ఇప్పుడు వైరల్ గా మారింది. సైలెంట్ గా వుండే ఈ డైరెక్టర్ మైండ్ లో ఇంత వైలెంట్ ఐడియా వుందా అని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ నాగ్ అశ్విన్ కు వచ్చిన ఐడియా ఏంటంటారా..? థియేటర్ లో ఆల్కహాల్ అమ్మితే ఏలా ఉంటది. అవును ఇదే ఐడియా ను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ఒకరోజు సురేష్ బాబు, రానా తో మాట్లాడుతుండగా మన థియేటర్లలోనే బీర్ లు.. బ్రీజర్లు అమ్మితే ఎలా ఉంటుంది? అని అనుకున్నాం.. అప్పుడు మన థియేటర్ల…
మరోసారి లక్కీ సీజన్‌లో సుకుమార్?
ఇన్నోవేటివ్ థాట్స్‌కి కేరాఫ్ అడ్రస్.. బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్. తన మొదటి సినిమా `ఆర్య` నుంచి గత చిత్రం ‘రంగస్థలం’ వరకు నవ్యతకే పెద్ద పీట వేశాడు సుక్కు. ప్రస్తుతం తన లక్కీ హీరో, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా ‘పుష్ప’ను తెరకెక్కిస్తున్నాడీ టాలెంటెడ్ డైరెక్టర్. ఇప్పటికే తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న ఈ యాక్షన్ థ్రిల్లర్.. లాక్ డౌన్ అనంతరం మలి దశ చిత్రీకరణ జరుపుకోనుంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాని తనకి అచ్చొచ్చిన సీజన్‌లోనే విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాడట సుక్కు.
జనవరి 14న రజినీకాంత్ 'అణ్ణాత్త'?
సూపర్ స్టార్ రజినీకాంత్ కథానాయకుడిగా ‘శౌర్యం’ ఫేమ్ శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'అణ్ణాత్త’. ఖుష్బూ, మీనా, నయనతార, కీర్తి సురేష్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది.
శోభన్‌బాబు, వాణిశ్రీ ‘జీవనజ్యోతి’కి 45 ఏళ్ళు
నటభూషణ్ శోభన్‌బాబు, కళాభినేత్రి వాణిశ్రీ.. టాలీవుడ్ ఎవర్‌గ్రీన్ హిట్ పెయిర్. వీరిద్దరు జంటగా నటించిన పలు చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి. వాటిలో ‘జీవనజ్యోతి’ ఒకటి. “కళాతపస్వి” కె.విశ్వనాథ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ‘నిండు హృదయాలు’, ‘చిన్ననాటి స్నేహితులు’, ‘చెల్లెలి కాపురం’ వంటి విజయవంతమైన చిత్రాల తరువాత కె.విశ్వనాథ్, శోభన్‌బాబు, వాణిశ్రీ కలయికలో వచ్చిన ‘జీవనజ్యోతి’ కూడా అదే బాట పట్టడం విశేషం. ఇందులో వాణిశ్రీ తల్లీకూతుళ్ళుగా ద్విపాత్రాభినయం పోషించగా కైకాల సత్యనారాయణ, రాజబాబు, అల్లు రామలింగయ్య, భీమరాజు, ముక్కామల, శుభ, రమాప్రభ, నిర్మల, బేబీ వరలక్ష్మి ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు.
ఇస్తా.. మొత్తం తిరిగిచ్చేస్తా..!
గతేడాది వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్' హిట్ తో మళ్ళీ సూపర్ ఫామ్ లోకి వచ్చాడు రామ్. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో పాటు రామ్ కెరీర్లోనే హైయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా నిలిచింది. ఇక ఈ సినిమా ఇచ్చిన కిక్ తో వెంటనే మరో క్రైమ్ థ్రిల్లర్ 'రెడ్' సినిమాను లైన్ లో పెట్టేశాడు. కిశోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నిజానికి ఏప్రిల్ లో రిలీజ్ కావాల్సి ఉంది. కానీ లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది.

నీ మరణం నన్ను కలిచివేసింది..!
తమిళ్ నాడు యువ దర్శకుడు అరుణ్ ప్రసాత్ ఈ రోజు ప్రమాదంలో మృతిచెందారు. బైక్‌పై వెళ్తున్న అరుణ్‌ను.. లారీ ఢీ కొట్టడంతో ఆయన ప్రాణాలు విడిచారు. కోయంబత్తూరులోని మెట్టుపాలయం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఈయన ప్రముఖ దర్శకుడు శంకర్ వద్ద అసిస్టెంట్‌గా అనేక సినిమాలకు పనిచేశాడు. పలువురు తమిళ సినీ ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం ప్రకటిస్తున్నారు.
'రౌడీ హీరో' కూడా వెబ్ సిరీస్ ల వైపు..!
హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రౌడీ హీరో విజయ్ దేవరకొండ తక్కువ టైం లోనే నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. కింగ్ ఆఫ్ హిల్స్ అనే పేరుతో ఓ నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి సినిమాలు కూడా నిర్మిస్తున్నాడు. రీసెంట్ గా తరుణ్ భాస్కర్ హీరోను హీరోగా పెట్టి 'మీకు మాత్రమే చెప్తా' అనే సినిమా కూడా నిర్మించాడు. అయితే అది అంత విజయం దక్కించుకోలేకపోయింది. ఇక ఒక పక్క సినిమా నిర్మిస్తూనే మరో వైపు వెబ్ సిరీస్ ల వైపు కూడా విజయ్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు తెలుస్తుంది.

యదార్ధ సంఘటన ఆధారంగా విజయ్ 'మాస్టర్'..!
లోకేష్ కనగరాజు దర్శకత్వంలో విజయ్ 'మాస్టర్' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తవ్వగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. లాక్ డౌన్ వల్ల ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా వాయిదా పడింది. అయితే లాక్ డౌన్ లో కూడా సినిమా అప్ డేట్స్ ఇస్తూ అభిమానులకు కాస్త ఊరటనిస్తున్నారు.

"తలైవి "మూవీ లో కీలక పాత్రలో భాగ్యశ్రీ
విబ్రి మీడియా, కర్మ మీడియా ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై ఏ ఎల్ విజయ్ దర్శకత్వంలో లెజెండరీ యాక్ట్రెస్, పొలిటికల్ లీడర్ జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా "తలైవి " తమిళ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. జయలలిత సినీ, రాజకీయ జీవితంలో జరిగిన ముఖ్య సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మూవీ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ జయలలితగా నటిస్తున్నారు. అరవింద్ స్వామి, ప్రకాష్ రాజ్, పూర్ణ, సముద్ర ఖని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. జి వి ప్రకాష్ కుమార్, రచిత అరోరా సంగీతం అందించారు.

"సహజ సుందరి" రష్మిక
బ్లాక్ బస్టర్ "ఛలో " మూవీ తో టాలీవుడ్ కు ఎంటర్ అయిన కన్నడ బ్యూటీ రష్మిక "గీత గోవిందం ", "సరిలేరు నీకెవ్వరు", "భీష్మ" వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం, అభినయం తో ప్రేక్షకులను అలరించారు. కన్నడ మూవీస్ లో కూడా నటిస్తున్న రష్మిక "సుల్తాన్"మూవీ తో కోలీవుడ్ కు ఎంటర్ అవుతున్నారు. టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్న రష్మిక ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న "పుష్ప "మూవీలో నటిస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా "పుష్ప "మూవీ షూటింగ్ నిలిచిపోయింది.
'KGF2' రిలీజ్ పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత..!
లాక్ డౌన్ వల్ల చాలా సినిమాల రిలీజ్ విషయాల్లో చాలా మార్పులు వచ్చాయి. ఇక చిన్న సినిమాల సంగతేమో కానీ.. పెద్ద సినిమాల రిలీజ్ విషయంలో మాత్రం రోజుకో వార్త వస్తూనే వుంది. ఇక 'కె.జి.ఎఫ్2' సినిమా రిలీజ్ విషయంలో కూడా గత కొద్ది రోజులుగా ఈ కన్ఫ్యూజన్ నెలకొంది. ఇక ఈ విషయంపై ఎన్నో సార్లు క్లారిటీ ఇచ్చినా... ఏదో ఒక రూమర్ అయితే వస్తూనే ఉంది. ఇక తాజాగా వచ్చిన రూమర్స్ పై 'కె.జి.ఎఫ్2' నిర్మాత కార్తీక్ గౌడ స్పందించి..30 రోజుల షూటింగ్ మిగిలి ఉందని, రెండు ఫైట్స్ మినహా షూటింగ్ పూర్తయ్యిందన్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని, జూలైలో ప్రభుత్వం షూటింగ్‌కి అనుమతిచ్చినా అక్టోబర్ 23నే సినిమాను…
జూనియర్ ఎన్టీఆర్ ట్విట్టర్ రికార్డ్
సక్సెస్ ఫుల్ "నిన్ను చూడాలని " మూవీ తో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. "స్టూడెంట్ నెం 1", "ఆది ", "సింహాద్రి", "యమదొంగ ", "బృందావనం", "టెంపర్ ", "నాన్నకు ప్రేమతో ", "జనతా గ్యారేజ్ ", "జై లవకుశ ", "అరవింద సమేత వీర రాఘవ "వంటి సూపర్ హిట్ మూవీస్ లో తనదైన స్టైల్ ఆఫ్ యాక్టింగ్, డ్యాన్స్ లతో ప్రేక్షక , అభిమానులను అలరించారు. "యమదొంగ "మూవీ కి బెస్ట్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ , "నాన్నకు ప్రేమతో " మూవీ లో అద్భుతం గా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్టర్ గా నంది , ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ ఎన్టీఆర్ అందుకున్నారు.