మాస్ మహారాజా రవితేజ వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఒకవైపు తన తాజా చిత్రం ‘క్రాక్’ చిత్రీకరణ తుది దశలో ఉండగా.. మరోవైపు ‘రాక్షసుడు’ దర్శకుడు రమేష్ వర్మ కాంబినేషన్ లో ఓ యాక్షన్ థ్రిల్లర్ చేయనున్నాడు రవితేజ. లాక్ డౌన్ పీరియడ్ అనంతరం ఈ క్రేజీ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అలాగే టాలెంటెడ్ డైరెక్టర్ త్రినాథరావు నక్కిన దర్శకత్వంలోనూ ఓ సినిమా చేయనున్నాడు రవితేజ. కాప్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఓ మెగా హీరో కీలక పాత్రలో దర్శనం ఇవ్వనున్నాడని సమాచారం. ఆ హీరో మరెవరో కాదు.. ‘సుప్రీం’ స్టార్ సాయి తేజ్. దాదాపు 20 నిమిషాల పాటు సాగే పాత్రలో సాయి తేజ్ కనిపిస్తాడని ప్రచారం సాగుతోంది. త్వరలోనే సాయి తేజ్ ఎంట్రీపై క్లారిటీ రానుంది.
సాయి తేజ్ కీలక పాత్రలో నటించడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ రూపొందించిన కాప్ డ్రామా ‘నక్షత్రం’ (2017)లో ముఖ్య పాత్ర పోషించాడు తేజ్.
మరి.. రవితేజతో సాయి తేజ్ చేయనున్న సందడి ఎలా ఉంటుందో తెలియాలంటే కొన్నాళ్లు వేచి చూడాల్సిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: