‘అందాల రాక్షసి’, ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’, ‘లై’, ‘పడి పడి లేచె మనసు’.. ఇలా ఒకదానితో ఒకటి సంబంధం లేని సినిమాలను రూపొందించాడు హను రాఘవపూడి. త్వరలో ఈ టాలెంటెడ్ డైరెక్టర్.. స్వప్న సినిమా సంస్థలో ఓ చిత్రం చేయనున్నాడు. మలయాళ యువ కథానాయకుడు దుల్కర్ సల్మాన్ ఇందులో హీరోగా నటించబోతున్నాడు. లాక్ డౌన్ పిరియడ్ అనంతరం ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్




కాగా, ఈ చిత్రం తర్వాత హను ఓ బాలీవుడ్ ప్రాజెక్ట్‌ని టేకప్ చేయనున్నట్టు సమాచారం. ప్రముఖ హిందీ నటుడు సన్నీ డియోల్ హీరోగా నటించబోతున్న ఈ యాక్షన్ ఎమోషనల్ డ్రామాని బాలీవుడ్ ప్రొడ్యూసర్ అంజు శర్మ నిర్మించనున్నాడు. ఉత్తరప్రదేశ్ నేపథ్యంలో సాగే ఈ చిత్రం.. సహజత్వానికి దగ్గరగా ఉంటుందని టాక్. అలాగే ఇప్పటి వరకు హను రూపొందించిన చిత్రాలకు భిన్నంగా ఈ సినిమా తెరకెక్కుతుందని వినికిడి.
త్వరలోనే సన్నీ, హను కాంబినేషన్ మూవీపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























