కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో తెరకెక్కిన కన్నడ చిత్రం ‘కేజీఎఫ్ – చాప్టర్ 1’ (2018).. పాన్ ఇండియా మూవీగా రిలీజై సంచలన విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. యష్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమాని ప్రశాంత్ నీల్ తెరకెక్కించాడు. రెండు భాగాల కథ అయిన ‘కేజీఎఫ్’కి సంబంధించిన రెండో చాప్టర్ ‘కేజీఎఫ్ – చాప్టర్ 2’ ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్




ఇందులో సంజయ్ దత్, రవీనా టాండన్ వంటి ప్రముఖ బాలీవుడ్ నటులు కీలక పాత్రల్లో నటిస్తుండటంతో.. సెకండ్ పార్ట్‌పై ఎనలేని క్రేజ్ నెలకొంది. వినిపిస్తున్న కథనాల ప్రకారం.. అధీరా పాత్రలో నటిస్తున్న సంజయ్ అభినయం సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలవనుందని తెలిసింది.
కాగా.. విజయదశమి సందర్భంగా అక్టోబర్ 23న ‘కేజీఎఫ్ – చాప్టర్ 2’ దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ రిలీజ్ కానుంది. మరి.. మొదటి భాగంలాగే సెకండ్ పార్ట్ కూడా సెన్సేషన్ క్రియేట్ చేస్తుందేమో చూడాలి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























