థియేటర్ లో ఆల్కహాల్ అమ్మితే ఏలా ఉంటది. కూల్ డైరెక్టర్ తన ఐడియా ను సోషల్ మీడియాలో షేర్ చేసుకొని.. ఒక్కసారిగా సంచలనం సృష్టించాడు. ఇక ఇంత సైలెంట్ గా ఉన్న డైరెక్టర్… మైండ్ లో ఇంత వైలెంట్ ఐడియా వుందా అంటూ పలు విమర్శలే వచ్చాయి. ఇక ఇప్పుడు మరో ఐడియా తో వచ్చేశాడు. అదే ‘డ్రైవ్-ఇన్ థియేటర్’ ఆలోచన. ‘డ్రైవ్ – ఇన్ థియేటర్.. పాత రోజుల్లో టూరింగ్ టాకీలలాగా, దీని గురించి మీరు ఏమనుకుంటున్నారూ..?’ అని మరోసారి నెటిజన్ల అభిప్రాయాన్ని అడిగారు. ఇక ఈ ఐడియా పై కూడా భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. ఒక నెటిజెన్ అయితే ‘‘సంతోషంగా ఇంట్లో కూర్చుని, కావలసింది చేసుకొని తింటూ నచ్చిన సినిమాను 55 అంగుళాల టీవీలో చూస్తాం కానీ పని కట్టుకొని డ్రైవ్-ఇన్ వరకూ వచ్చి డబ్బులు ఖర్చు పెట్టుకొని ఎందుకు చూస్తాం సార్?!’’ అని అనగా ‘‘ఎక్స్‌పీరియన్స్ కోసం? సేమ్… రెస్టారెంట్ కాన్సెప్ట్ కదా’’ అని నాగ్ అశ్విన్ బదులిచ్చారు. మరి ముందు ముందు ఇంకెన్ని ఐడియాలు వస్తాయో ఈ డైరెక్టర్ కి..
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
What do you think about drive-in theaters…outdoor car/bike park chesukoni cinema choodadam, paata kaalam touring talkies laga?
— Nag Ashwin (@nagashwin7) May 17, 2020




కాగా నాగ్ అశ్విన్ తో తన తర్వాత సినిమా ప్రభాస్ తో చేస్తున్న సంగతి తెలిసిందే. అత్యంత భారీ బడ్జెట్‌తో సైన్ ఫిక్షన్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ మూవీ అక్టోబర్ నుండి సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ నిర్మించనున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: