షార్ట్ ఫిల్మ్ లో పాయల్ రాజ్ పుత్

RX 100 Actress Payal Rajput To Feature In A Short Film

సెన్సేషనల్ హిట్ “RX 100 ” మూవీ తో టాలీవుడ్ కు ఎంటర్ అయిన పంజాబీ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు. “వెంకీ మామ “, “డిస్కో రాజా ” మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. పాయల్ ప్రస్తుతం జయంత్ C పరాన్జీ దర్శకత్వంలో రూపొందుతున్న “నరేంద్ర” మూవీ లో ఫైటర్ పైలట్ గా నటిస్తున్నారు. “ఏంజెల్ ” మూవీ తో కోలీవుడ్ లో ఎంటర్ కానున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కరోనా వైరస్ లాక్ డౌన్ తో ఇంటికే పరిమితం అయిన పాయల్ ఒక షార్ట్ ఫిల్మ్ లో నటించారు. సురభ్ ధింగ్ర దర్శకత్వంలో గృహ హింస కాన్సెప్ట్ తో “ఎ రైటర్ “షార్ట్ ఫిల్మ్ రూపొందింది. ఈ షార్ట్ ఫిల్మ్ లో రచయిత్రి గా నటించిన పాయల్ మాట్లాడుతూ .. లాక్ డౌన్ కారణంగా కెమెరా ముందుకు వెళ్ళడం కుదరలేదని, ఈ షార్ట్ ఫిల్మ్ లో నటించడం ఆ బాధను తగ్గించిందని, తన అభిమానులకు ఈ షార్ట్ ఫిల్మ్ ను అంకితం చేస్తున్నానని చెప్పారు. “ఎ రైటర్ “షార్ట్ ఫిల్మ్ 24గంటలలో చిత్రీకరణ జరుపుకొనడం విశేషం. 16 నిమిషాల ఈ షార్ట్ ఫిల్మ్ యూట్యూబ్ లో తిలకించవచ్చు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 1 =