నటసింహ నందమూరి బాలకృష్ణకి.. సంక్రాంతి సీజన్‌తో మంచి అనుబంధమే ఉంది. తన కెరీర్‌లో పలు ఘనవిజయాలు ఈ సీజన్‌లోనే నమోదయ్యాయి. ఈ నేపథ్యంలోనే.. బాలయ్య తదుపరి చిత్రం కూడా ముగ్గుల పండగని టార్గెట్ చేసుకుందని టాక్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే.. ‘సింహా’ (2010), ‘లెజెండ్’ (2014) వంటి బ్లాక్‌బస్టర్స్ తర్వాత తన లక్కీ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో బాలకృష్ణ ఓ క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. సెకండ్ షెడ్యూల్‌ని లాక్ డౌన్ పిరియడ్ అనంతరం ప్రారంభించనున్నారు.
కాగా, కరోనా కారణంగా షూటింగ్ షెడ్యూల్స్‌లో అవాంతరాలు చోటు చేసుకోవడంతో.. ‘ఎన్.బి.కె 106’ని ముందుగా అనుకున్నట్లుగా ఈ ఏడాదిలోనే విడుదల చేసే అవకాశం లేదనే వినిపిస్తోంది. అంతే కాదు.. బాలయ్య లక్కీ సీజన్ సంక్రాంతికి విడుదల చేస్తే ఎలా ఉంటుందనే దిశగా కూడా యూనిట్ ఆలోచన చేస్తోందట. త్వరలోనే బాలయ్య, బోయపాటి కొత్త చిత్రం విడుదల తేదీపై స్పష్టత వస్తుంది.
మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ పేరు నిర్ణయించని చిత్రానికి యువ సంగీత సంచలనం థమన్ బాణీలను అందిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: