
ట్యాగ్ · 3668 కథనాలు · పేజీ 145


శర్వానంద్ మనమే మూవీ ఫస్ట్ సింగిల్ అప్ డేట్

ఆర్ సి 17 అప్డేట్ వచ్చేసింది

ఓం భీమ్ బుష్ 3 డేస్ కలెక్షన్స్

ఫ్యామిలీ స్టార్ థర్డ్ సింగిల్ రిలీజ్

లవ్ మీ.. వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ ఆ రోజే!

ఓం భీమ్ బుష్ ఫస్ట్ డే కలెక్షన్స్

లోకేషన్స్ వేటలో బిజీగా సుజీత్

ఫ్యామిలీ స్టార్ మీనింగ్ చెప్పిన దిల్ రాజు

మగధీర రీ రిలీజ్

యాక్షన్ షెడ్యూల్ లో సరిపోదా శనివారం

చరణ్ బర్త్ డే ట్రీట్ పై ఇంట్రెస్టింగ్ అప్ డేట్

దేవర- గోవా షూట్ లో జాయిన్ అయిన తంగం
యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న సినిమా దేవర. క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక రెండు పార్ట్ లుగా వస్తున్న ఈసినిమాలో మొదటి పార్ట్ ను ఈ ఏడాది అక్టోబర్ 10వ తేదీన రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే ఈ ఈసినిమా నుండి గ్లింప్స్ ను రిలీజ్ చేయగా గ్లింప్స్ అయితే మంచి రెస్పాన్సే సొంతం చేసుకుంది.

గేమ్ ఛేంజర్ నుండి జరగండి సాంగ్ రిలీజ్ టైమ్ ఫిక్స్
గ్లోబల్ స్టార్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నుండి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సినిమా గేమ్ ఛేంజర్. ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత ఈసినిమా.. దానికి తోడు లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఈసినిమా వస్తుండటంతో ఆ అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. అంతేకాదు సినిమా షూటింగ్ దాదాపు తుది దశకు చేరుకున్నట్టే తెలుస్తుంది. ఇటీవలే విశాఖపట్టణంలో ఈ చిత్రం షూటింగ్ జరిగింది.

దుబాయ్‌లో అల్లు అర్జున్ విగ్రహావిష్కరణ, తొలి దక్షిణాది హీరోగా రికార్డ్
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. 'పుష్ప' చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందిన ఆయన.. ఆ సినిమాలోని నటనకు గానూ నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డ్ అందుకున్న తొలి తెలుగు నటుడిగా రికార్డ్ సృష్టించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా అల్లు అర్జున్ మరో ఘనతను అందుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. దుబాయ్‌లోని ప్రతిష్టాత్మక 'మేడమ్ టుస్సాడ్స్' మ్యూజియంలో ఆయన మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. త్వరలోనే.. అంటే, మార్చి 28వ తేదీన ఈ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.

శర్వానంద్ మనమే మూవీ ఫస్ట్ సింగిల్ అప్ డేట్
కెరీర్ మొదటినుండీ విభిన్నమైన సినిమాలు చేస్తూ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో శర్వానంద్. 2022 లో ఒకే ఒక జీవితం సినిమాతో డీసెంట్ హిట్ ను అందుకున్న శర్వా 2023లో ఎలాంటి సినిమా రిలీజ్ చేయలేదు. ఇక ఇప్పుడు పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గానే శర్వా పుట్టిన రోజు సందర్భంగా ఈసినిమా టైటిల్ ను రిలీజ్ చేశారు. మనమే అనే టైటిల్ ను ఈసినిమాకు ఫిక్స్ చేశారు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది.

అప్ కమింగ్ మూవీస్ గురించి అప్డేట్స్ ఇచ్చిన కమల్ హాసన్
విక్రమ్ తో బ్లాక్ బాస్టర్ కొట్టి ట్రాక్ లో వచ్చాడు సీనియర్ హీరో కమల్ హాసన్. ఈసినిమా 500కోట్లకు పైనే వసూళ్లను రాబట్టింది.ఇక ఈసినిమా తరువాత కమల్ వరుస సినిమాలకు కమిట్ అయ్యాడు. అందులో ఇండియన్ 2,ఇండియన్ 3 అలాగే కల్కి 2898 ఏడి ,తగ్ లైఫ్ సినిమాలు వున్నాయి.

ఆర్ సి 17 అప్డేట్ వచ్చేసింది
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించనున్న 17వ సినిమా గురించి అఫిషియల్ గా అప్డేట్ వచ్చింది.గత కొన్ని రోజులు గా ఈసినిమాను సుకుమార్ డైరెక్షన్ లో చేయనున్నాడని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.ఇక ఈకాంబినేషన్ ఫిక్స్ అయ్యింది.రామ్ చరణ్ 17వ సినిమాను సుకుమార్ డైరెక్ట్ చేయనున్నాడు.ఈసినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు.మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనుంది.ఇంతకుముందు ఇదే కాంబినేషన్ లో ఇంతకుముందు రంగస్థలం వచ్చింది.ఈసినిమా హ్యుజ్ బ్లాక్ బాస్టర్ అనిపించుకుంది.

మోత సాంగ్ రిలీజ్
విశ్వక్ సేన్ గ్యాంగ్ ఆఫ్ గోదావరి నుండి విడుదలైన ఫస్ట్ సాంగ్ చుట్టంలా చూసి పోకలా ఎంత పెద్ద చార్ట్ బాస్టర్ అయ్యిందో చెప్పనక్కర్లేదు.ఈ ఒక్క సాంగ్ తో సినిమాకు కావాల్సినంత హైప్ వచ్చింది.ఇక ఈసినిమా నుండి రెండో పాటను రిలీజ్ చేశారు.మోత మోగిపోద్ది అంటూ వచ్చిన ఈసాంగ్ థియేటర్లలో మోత మోగించడం ఖాయం అనేలా వుంది.ఆస్కార్ అవార్డు విజేత చంద్ర బోస్ లిరిక్స్ అందించిన ఈ సాంగ్ ను మనసి పాడింది.యువన్ శంకర్ అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చాడు.ఈమాస్ బీట్ సాంగ్ లో అయేషా ఖాన్ గ్లామర్ షో యూత్ ను ఫిదా చేయనుంది.అలాగే ఈపాటలో విశ్వక్ తన డ్యాన్స్ విశ్వరూపాన్ని చూపించనున్నాడు.

ఓజీ.. వైరల్ అవుతోన్న ఇమ్రాన్ హష్మీ ఫస్ట్ లుక్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు ఏపీ రాజకీయాలు.. మరోవైపు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన కథానాయకుడిగా 'ఉస్తాద్ భగత్ సింగ్', 'హరి హరవీరమల్లు', 'ఓజీ' సినిమాలు రూపొందుతోన్న విషయం తెలిసిందే. వీటితోపాటు త్వరలోనే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మరో సినిమా కూడా చేయనున్నారు పవన్ కళ్యాణ్. దీంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆయన సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయా చిత్రాలను నిర్మిస్తున్న నిర్మాతలు, దర్శకులు అప్పుడప్పుడు పలు అప్‌డేట్స్ అందిస్తూ ఫ్యాన్స్‌ని ఖుషీ చేస్తున్నారు.

ఓం భీమ్ బుష్ 3 డేస్ కలెక్షన్స్
శ్రీ విష్ణు ,రాహుల్ రామకృష్ణ,ప్రియదర్శి ల ఓం భీమ్ బుష్ సూపర్ వీకెండ్ ను సొంతం చేసుకొంది. మొదటి రోజు కొంచెం స్లో గా స్టార్ట్ అవ్వగా మిగిలిన రెండు రోజులు మొదటి రోజు కన్నా ఎక్కువ రాబట్టి బ్రేక్ ఈవెన్ కు చేరువైంది.3రోజుల్లో ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 17కోట్లకు పైగా రాబట్టిందని మేకర్స్ పోస్టర్ ద్వారా తెలిపారు.ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద పోటీ లేకపోవడం కూడా కలిసొచ్చింది.

ఫ్యామిలీ స్టార్ థర్డ్ సింగిల్ రిలీజ్
రిలీజ్ కు రోజులు దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచింది ఫ్యామిలీ స్టార్ టీం.అందులో భాగంగా కొద్దీ సేపటి క్రితం ఈసినిమానుండి మూడో సాంగ్ ను రిలీజ్ చేశారు.ఇంతకుముందు రిలీజైన మొదటి రెండు పాటలు మంచి రెస్పాన్స్ తెచ్చుకోగా ఈమూడో సాంగ్ కూడా బాగుంది.మధురము కదా అనే ఈ సాంగ్ ను ప్రముఖ సింగర్ శ్రేయా ఘోషల్ పాడగా శ్రీ మణి లిరిక్స్ అందించాడు.ఈ పాటను ఫారెన్ లో షూట్ చేశారు.

లవ్ మీ.. వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ ఆ రోజే!
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన యంగ్ హీరో ఆశిష్ రెడ్డి నటుడిగా ఒక్కో సినిమాతో తానేంటో ప్రూవ్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో తన తొలి సినిమా 'రౌడీ బాయ్స్'తో యూత్‌ను ఆకట్టుకున్న ఆశిష్.. రెండో సినిమాగా 'సెల్ఫిష్' అనే చిత్రం చేశాడు. ఇక ఇటీవలే అద్వైతా రెడ్డిని వివాహం చేసుకుని ఒక ఇంటివాడైన ఆయన తాజాగా నటించిన మూడో సినిమా 'లవ్ మీ'. దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హన్షిత రెడ్డి మరియు హర్షిత్ రెడ్డి నిర్మిస్తున్నారు.

ఓం భీమ్ బుష్ ఫస్ట్ డే కలెక్షన్స్
కెరీర్ మొదటినుండి కాస్త డిఫరెంట్ సినిమాలు తీయడంలో ముందు ఉండేవాడు శ్రీ విష్ణు. అంతేకాదు కామెడీ ఎంటర్ టైనర్ లు కూడా తీసి బ్యాక్ టు బ్యాక్ హిట్లు అందుకుంటున్నాడు. గత ఏడాది సామజవరగమన సినిమాతో హిట్ అందుకున్న శ్రీవిష్ణు..ఇక ఇప్పుడు మరోసారి ఓం భీమ్ బుష్ హిట్ ను అందుకున్నాడు. హుషారు ఫైమ్ శ్రీహర్ష కనుగంటి దర్శకత్వంలో శ్రీవిష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో వచ్చిన సినిమా ఓం భీమ్ బుష్. ఈసినిమా అప్ డేట్లతోనే మంచి క్యూరియాసిటీని పెంచారు మేకర్స్. అలా ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా నిన్న రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

బబుల్ గమ్ ఖాతాలో 100M స్ట్రీమింగ్ మినిట్స్
బుల్లి తెర స్టార్ యాంకర్ సుమ తనయుడు రోషన్ హీరోగా బబుల్ గమ్ మూవీతో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే కదా. క్షణం, కృష్ణ అండ్ హిజ్ లీల సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రవికాంత్ పేరెపు దర్శకత్వంలో ఈసినిమా వచ్చింది. ఇక ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా డిసెంబర్ 31 వ తేదీన రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈసినిమా పాజిటివ్ టాక్ నే సొంతం చేసుకుంది. ముఖ్యంగా రోషన్ నటనకు మంచి అప్లాజ్ దక్కింది.

లోకేషన్స్ వేటలో బిజీగా సుజీత్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. మరికొద్ది రోజుల్లోనే ఎలక్షన్స్ ఉండటంతో తన ఫుల్ ఫోకస్ ను మొత్తం రాజకీయాలపైనే పెట్టాడు. దీంతో ప్రస్తుతం తన లిస్ట్ లో ఉన్న మూడు సినిమాల షూటింగ్ లు కూడా పెండింగ్ లో పడిపోయాయి. ఇక మూడు సినిమాల్లో సుజీత్ దర్శకత్వంలో వస్తున్న ఓజీ మాత్రం చాలా వరకూ షూటింగ్ ను పూర్తి చేసుకుంది. అంతేకాదు రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించారు. సెప్టెంబర్ 27వ తేదీన ఈసినిమా రిలీజ్ కానుంది.

ఫ్యామిలీ స్టార్ మీనింగ్ చెప్పిన దిల్ రాజు
విజయ్ దేవరకొండ ,పరుశురాం,దిల్ రాజు కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఫ్యామిలీ స్టార్.షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.రీసెంట్ గా ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకొని హైప్ పెంచేసింది.ఇక ఈసినిమా కు ఫ్యామిలీ స్టార్ టైటిల్ ఎందుకో పెట్టామో దిల్ రాజు చెప్పారు.

మగధీర రీ రిలీజ్
ఇండస్ట్రీ హిట్ మగధీర రీ రిలీజ్ కానుంది.టాప్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో 2009లో వచ్చిన ఈసినిమా థియేటర్లలో సెన్సేషన్ సృష్టించింది.ఇక ఇప్పుడు మళ్ళీ విడుదలవుతుంది.ఈనెల 27న రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ఈసినిమా రీ రిలీజ్ అవుతుంది.రామ్ చరణ్ నటించిన సినిమాలు రీ రిలీజ్ లు కొత్తేమి కాదు గత ఏడాది ఆరెంజ్,నాయక్ సినిమాలను మళ్లీ రిలీజ్ చేశారు.

టాలీవుడ్ హీరోల ఘనతపై పై విష్ణు ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో విష్ణు మంచు ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా కన్నప్ప. మహాశివుడి పరమ భక్తుడు భక్తు కన్నప్ప జీవిత నేపథ్యంలో ఈసినిమాను రూపొందిస్తున్నారు. భారీ బడ్జెట్ తో ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇప్పటికే ఈసినిమా ఫస్ట్ షెడ్యూల్ ను కంప్లీట్ చేసుకుంది. ప్రస్తుతం సెకండ్ షెడ్యూల్ తో బిజీగా ఉన్నారు. ఈసినిమాను అవా ఎంటర్టైన్మెంట్ ఇంకా 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్ పై మంచు విష్ణు తండ్రి, సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు నిర్మిస్తున్నారు. మణిశర్మ, స్టీఫెన్ దేవాసి సంయుక్తంగా ఈసినిమాకు సంగీతం అందిస్తున్నారు.

యాక్షన్ షెడ్యూల్ లో సరిపోదా శనివారం
హాయ్ నాన్న తరువాత నాని నటిస్తున్న సినిమా సరిపోదా శనివారం.సెట్స్ మీదకు వెళ్లినప్పటి నుండి మేజర్ బ్రేక్ లేకుండా షూటింగ్ జరుపుకుంటుంది.ప్రస్తుతం జరుగుతున్నషెడ్యూల్ లో పవర్ ఫుల్ మాస్ యాక్షన్ సీక్వెన్స్ ను తీస్తున్నారు.దీనికి సంబంధించిన ఓ స్టిల్ ను మేకర్స్ సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు.ఇక ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ హైప్ పెంచుతున్నారు మేకర్స్.రీసెంట్ గా ఈసినిమా నుండి గ్లిమ్స్ ను రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది.ఈసినిమాలో శనివారం మాత్రమే కోపాన్ని చూపెట్టే సూర్య పాత్రలో నాని కనిపించున్నాడు.

చరణ్ బర్త్ డే ట్రీట్ పై ఇంట్రెస్టింగ్ అప్ డేట్
రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. ఈసినిమాలో కియారా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది.. ఇంకా శ్రీకాంత్, జయరామ్, అంజలి, సునీల్, నవీన్ చంద్ర కూడా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈసినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈసినిమాను తమిళ్, తెలుగు, హిందీలో చిత్రీకరిస్తున్నారు. ఇంకా బుచ్చిబాబు తో తన 16వ సినిమా చేయబోతున్నాడను. రీసెంట్ గానే ఈసినిమాను గ్రాండ్ గా లాంచ్ చేశారు.

సహారా ఎడారి మధ్యలో షూట్ చేసిన తొలి ఇండియన్ సినిమా ఇది
మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన “ది గోట్ లైఫ్” (ఆడు జీవితం) సినిమా ఈ నెల 28న పాన్ ఇండియా స్థాయిలో మలయాళంతో పాటు హిందీ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సినిమాను బెన్యామిన్ రాసిన గోట్ డేస్ నవల ఆధారంగా అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ రూపొందించారు. విజువల్ రొమాన్స్ బ్యానర్ ఈ సినిమాను మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌గా భారీ బడ్జెట్‌తో నిర్మించింది. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ సంస్థ “ది గోట్ లైఫ్” (ఆడు జీవితం) సినిమాను తెలుగు స్టేట్స్‌లో రిలీజ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ ను హైదరాబాద్ లో…