మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన “ది గోట్ లైఫ్” (ఆడు జీవితం) సినిమా ఈ నెల 28న పాన్ ఇండియా స్థాయిలో మలయాళంతో పాటు హిందీ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సినిమాను బెన్యామిన్ రాసిన గోట్ డేస్ నవల ఆధారంగా అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ రూపొందించారు. విజువల్ రొమాన్స్ బ్యానర్ ఈ సినిమాను మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌గా భారీ బడ్జెట్‌తో నిర్మించింది. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ సంస్థ “ది గోట్ లైఫ్” (ఆడు జీవితం) సినిమాను తెలుగు స్టేట్స్‌లో రిలీజ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ కార్యక్రమంలో హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, డైరెక్టర్ బ్లెస్సీ, హాలీవుడ్ యాక్టర్ జిమ్మీ జీన్ లూయిస్, మైత్రీ నుంచి నిర్మాత వై రవి శంకర్, శశి పాల్గొన్నారు. ఈ సందర్భంగా హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ మాట్లాడుతూ.. “ఇటీవల వరదరాజ మన్నార్ అనే కింగ్ క్యారెక్టర్‌లో ‘సలార్’తో మీ ముందుకు వచ్చాను. ఇప్పుడు “ది గోట్ లైఫ్” (ఆడు జీవితం) సినిమాతో నజీబ్ అనే స్లేవ్ క్యారెక్టర్ తో తెరపైకి రాబోతున్నాను. వరదరాజ మన్నార్ పూర్తిగా ప్రశాంత్ నీల్ ఇమాజినేషన్. కానీ ఈ సినిమా వాస్తవంగా జరిగిన కథ. నజీబ్ మన మధ్యే సజీవంగా ఉన్నాడు. 90వ దశకంలో జీవనోపాధి కోసం గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన వ్యక్తి అతను. ఈ ప్రయాణంలో తను ఎదుర్కొన్న కష్టాలను వివరిస్తూ రాసిన పుస్తకమే గోట్ డేస్” అని తెలిపారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. “బెన్యామిన్ రాసిన ఈ నవల హక్కులను కేరళలోని ప్రతి దర్శకుడు, హీరో, ప్రొడ్యూసర్ తీసుకోవాలని ప్రయత్నించారు. చివరకు ఆ హక్కులను మా డైరెక్టర్ బ్లెస్సీ సాధించారు. అదృష్టవశాత్తూ ‘నజీబ్’గా నటించే అవకాశం నాకు దక్కింది. 2019లో షూటింగ్ ప్రారంభించాం. జోర్డాన్‌లో షెడ్యూల్ చేశాం. ఈ సినిమా కోసం నేను మొదట బరువు పెరిగి ఆ తర్వాత 31 కిలోలు తగ్గాను. బరువు తగ్గేందుకు ఒక షెడ్యూల్ తర్వాత 7 నెలల గ్యాప్ తీసుకున్నాం. మేము తిరిగి జోర్డాన్‌లో షూటింగ్ స్టార్ట్ చేసేప్పటికి కోవిడ్ లాక్ డౌన్ వచ్చింది. మూడు నెలలు పూర్తిగా షూటింగ్ ఆపేశాం. మేము భారత్ కు తిరిగి రావడం కూడా కష్టమైంది. వందే భారత్ స్పెషల్ ఫ్లైట్‌లో ఇండియా వచ్చాం” అని చెప్పారు.
“మళ్ళీ ఏడాదిన్నర తర్వాత అల్జీరియాలోని టిముమౌన్ అనే ప్లేస్‌లో షూటింగ్ స్టార్ట్ చేశాం. సహారా ఎడారి మధ్యలో ఉంటుందా లొకేషన్. అక్కడికి ఏ సినిమా యూనిట్ వెళ్లలేదు. మా బ్లెస్సీ సార్‌కు సినిమా పిచ్చి. ఆయన వల్లే మేమంతా అక్కడ షూటింగ్ చేయగలిగాం. అల్జీరియా తర్వాత జోర్డాన్ తిరిగొచ్చి మిగిలిన పార్ట్ షూట్ చేశాం. ఇంత కష్టపడిన ఈ సినిమాను పర్పెక్ట్‌గా రిలీజ్ చేయాలని అనుకున్నాం. అదృష్టవశాత్తూ తెలుగులో మైత్రీ మూవీ సంస్థ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. ఇది నా కెరీర్‌లో ఎంతో ముఖ్యమైన సినిమా అని రవి గారికి మెసేజ్ పంపాను. ఆయన డన్ సార్ అంటూ రిప్లై ఇచ్చారు. తమిళంలో రెడ్ జయింట్, కన్నడలో హోంబలే ఫిలింస్, నార్త్‌లో నా ఫ్రెండ్ అనిల్ రిలీజ్ చేస్తున్నారు. రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్‌తో చేసిన ఈ సినిమా చూస్తున్నంతసేపూ ప్రతి ఒక్కరూ ఆ ఎమోషన్స్ ఫీల్ అవుతారు. మీ అందరికీ “ది గోట్ లైఫ్” (ఆడు జీవితం) సినిమా నచ్చుతుందని ఆశిస్తున్నా” అని అన్నారు పృథ్వీరాజ్ సుకుమారన్.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: