విక్రమ్ తో బ్లాక్ బాస్టర్ కొట్టి ట్రాక్ లో వచ్చాడు సీనియర్ హీరో కమల్ హాసన్. ఈసినిమా 500కోట్లకు పైనే వసూళ్లను రాబట్టింది.ఇక ఈసినిమా తరువాత కమల్ వరుస సినిమాలకు కమిట్ అయ్యాడు. అందులో ఇండియన్ 2,ఇండియన్ 3 అలాగే కల్కి 2898 ఏడి ,తగ్ లైఫ్ సినిమాలు వున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాల గురించి కమల్ తాజగా ఓ ఇంటర్వ్యూ లో స్పందించాడు.ఇండియన్ సినిమాకు సీక్వెల్ గా వస్తుంది ఇండియన్ 2.శంకర్ తెరకెక్కిస్తున్నాడు.ఈ లాంగ్ డిలే ప్రాజెక్ట్ షూటింగ్ పూర్తయిందట ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయట. అంతేకాదు దీనికి సీక్వెల్ గా రానున్న ఇండియన్ 3 షూటింగ్ కంప్లీట్ అయ్యిందట. పోస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ కావాల్సి ఉందని అన్నారు.
ఈసినిమాలు కాకుండా ప్రభాస్ కల్కి 2898 ఏ డి లో గెస్ట్ రోల్ లో కనిపించనున్నాడట కమల్.దీనికి సంబంధించిన షూటింగ్ ను కూడా పూర్తి చేశాడట.నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తుండగా భారీ బడ్జెట్ తో వైజయంతి మూవీస్ నిర్మిస్తుంది. ఇందులో కమల్ విలన్ పాత్ర చేస్తున్నాడని అప్పట్లో వార్తలు వచ్చాయి కానీ గెస్ట్ రోల్ అని కమల్ క్లారిటీ ఇచ్చేశాడు.
ఇక మణిరత్నం డైరెక్షన్ లో కమల్ తగ్ లైఫ్ లో నటించాల్సి వుంది. ఈసినిమా షూటింగ్ ఇంకా స్టార్ట్ కాలేదట. పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయాక సెట్స్ మీదకు వెళుతుందంటూ కమల్ చెప్పుకొచ్చారు. ఈసినిమాను కమల్ సొంత బ్యానర్ రాజ్ కమల్ ఇంటర్నేషనల్ నిర్మించనుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: