చరణ్ బర్త్ డే ట్రీట్ పై ఇంట్రెస్టింగ్ అప్ డేట్

ram charan birthday treat update

రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. ఈసినిమాలో కియారా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది.. ఇంకా శ్రీకాంత్, జయరామ్, అంజలి, సునీల్, నవీన్ చంద్ర కూడా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈసినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈసినిమాను తమిళ్, తెలుగు, హిందీలో చిత్రీకరిస్తున్నారు. ఇంకా బుచ్చిబాబు తో తన 16వ సినిమా చేయబోతున్నాడను. రీసెంట్ గానే ఈసినిమాను గ్రాండ్ గా లాంచ్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక రామ్ చరణ్ పుట్టిన రోజు మార్చి 27వ తేదీన అన్న సంగతి తెలిసిందే కదా. చరణ్ బర్త్ డే కోసం ఫ్యాన్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా చరణ్ సినిమాల నుండి రాబోయే అప్ డేట్ల కోసం ఇప్పటినుండే చూస్తున్నారు. అయితే గేమ్ ఛేంజర్ నుండి కూడా సాలిడ్ అప్ డేట్ ఉండబోతుందని ఇప్పటికే దిల్ రాజు కూడా చెప్పాడు. అంతేకాదు బర్త్ డే సందర్భంగా జరగండి పాటను రిలీజ్ చేయబోతున్నట్టు కూడా ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు తాజాగా మరో అప్ డేట్ వినిపిస్తుంది. ఈ పాటకు సంబంధించి సరికొత్త పోస్టర్ తో ఈ రెండు రోజుల్లోనే అదిరే అప్డేట్ రావచ్చని తెలుస్తుంది. దీనితో పాటు ఆర్సీ 16 మూవీ నుండి కూడా సాలిడ్ అప్ డేట్ రాబోతున్నట్టు తెలుస్తుంది. ఈసినిమా టైటిల్ ను రిలీజ్ చేయబోతున్నారట. చూద్దాం మరి ఇందులో ఎంత నిజముందో..

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 1 =