టాలీవుడ్ హీరోల ఘనతపై పై విష్ణు ఇంట్రెస్టింగ్ కామెంట్స్

manchu vishnu interesting comments on tollywood heroes

ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వంలో విష్ణు మంచు ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా కన్నప్ప. మహాశివుడి పరమ భక్తుడు భక్తు కన్నప్ప జీవిత నేపథ్యంలో ఈసినిమాను రూపొందిస్తున్నారు. భారీ బడ్జెట్ తో ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇప్పటికే ఈసినిమా ఫస్ట్ షెడ్యూల్ ను కంప్లీట్ చేసుకుంది. ప్రస్తుతం సెకండ్ షెడ్యూల్ తో బిజీగా ఉన్నారు. ఈసినిమాను అవా ఎంటర్టైన్మెంట్‌ ఇంకా 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ బ్యానర్స్ పై మంచు విష్ణు తండ్రి, సీనియర్ నటుడు మంచు మోహన్‌ బాబు నిర్మిస్తున్నారు. మణిశర్మ, స్టీఫెన్‌ దేవాసి సంయుక్తంగా ఈసినిమాకు సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా మంచు విష్ణు మా ప్రెసిడెంట్ గా కూడా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా తెలుగు సినిమా 90 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దీనిపై మాట్లాడారు. ఈసారి ఈవేడుకను మలేసియాలో నిర్వహిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా విష్ణు తెలుగు సినిమాల గురించి హీరోల గురించి పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు. చిరంజీవి గారికి పద్మవిభూషణ్ అవార్డు దక్కడం, అది కూడా ఒక తెలుగు యాక్టర్‌కి మొదటిసారి రావడం చాలా ఆనందం. ముంబైలో కూడా ఏదైనా మ్యూజిక్ పార్టీలకి వెళితే అక్కడ జై బాలయ్య అనే స్లోగన్‌తోనే పార్టీ ముగుస్తుంది. అలానే అల్లు అర్జున్ నేషనల్ అవార్డు సాధించిన తొలి తెలుగు హీరో.. మన తెలుగులోనే కాదు కేరళలో కూడా బన్నీకి చాలా క్రేజ్ ఉంది. ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. హయ్యెస్ట్ పెయిడ్ ఇండియన్ యాక్టర్. ఇంకా మహేష్-రాజమౌళి గారి కాంబోలో వస్తున్న సినిమా ఇండియన్ సినిమా చరిత్రలోనే హయ్యెస్ట్ బడ్డెట్ మూవీ కాబోతుంది. తెలుగు సినిమాను ప్రపంచస్థాయికి తీసుకెళ్లారు రాజమౌళి గారు. ఇక ఏకంగా ఆస్కార్ అవార్డును తెచ్చిపెట్టారు కీరవాణి గారు అంటూ పొగడ్తలు కురిపించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × five =