హాయ్ నాన్న తరువాత నాని నటిస్తున్న సినిమా సరిపోదా శనివారం.సెట్స్ మీదకు వెళ్లినప్పటి నుండి మేజర్ బ్రేక్ లేకుండా షూటింగ్ జరుపుకుంటుంది.ప్రస్తుతం జరుగుతున్నషెడ్యూల్ లో పవర్ ఫుల్ మాస్ యాక్షన్ సీక్వెన్స్ ను తీస్తున్నారు.దీనికి సంబంధించిన ఓ స్టిల్ ను మేకర్స్ సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు.ఇక ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ హైప్ పెంచుతున్నారు మేకర్స్.రీసెంట్ గా ఈసినిమా నుండి గ్లిమ్స్ ను రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది.ఈసినిమాలో శనివారం మాత్రమే కోపాన్ని చూపెట్టే సూర్య పాత్రలో నాని కనిపించున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
స్థిర శనివారం సమవర్తి…🔥
The moments of Fiery Breathing sequences ❤️🔥#SaripodhaaSanivaaram #SuryasSaturday
Natural🌟 @NameIsNani @iam_SJSuryah @priyankaamohan #VivekAthreya @JxBe @muraligdop @karthikaSriniva @SVR4446 @IamKalyanDasari @DVVMovies @SVC_Official @SonyMusicSouth pic.twitter.com/B4D3FdVYeF
— DVV Entertainment (@DVVMovies) March 23, 2024
వివేక్ ఆత్రేయ డైరెక్ట్ చేస్తుండగా ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది.ప్రముఖ నటుడు ,డైరెక్టర్ ఎస్ జె సూర్య విలన్ పాత్ర పోషిస్తున్నాడు.జేక్స్ బీజాయ్ సంగీతం అందిస్తుండగా డివివి ఎంటెర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది.ఆగస్టు 28న ఈసినిమా విడుదలకానుంది.ఈసినిమా కూడా హిట్ అయితే నాని హ్యాట్రిక్ కొట్టనున్నాడు. గత ఏడాది దసరా,హాయ్ నాన్న బ్లాక్ బాస్టర్ అయ్యాయి.
ఇక సరిపోదా శనివారం తరువాత నాని డివివి బ్యానర్ లోనే మరో సినిమా చేయనున్నాడు.ఈసినిమాను సుజీత్ డైరెక్ట్ చేయనుండగా గ్యాంగ్ స్టార్ బ్యాక్ డ్రాప్ తో రానుంది.జూన్ లేదా జూలై నుండి సెట్స్ మీదకు వెళ్లనుంది. వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: