విశ్వక్ సేన్ గ్యాంగ్ ఆఫ్ గోదావరి నుండి విడుదలైన ఫస్ట్ సాంగ్ చుట్టంలా చూసి పోకలా ఎంత పెద్ద చార్ట్ బాస్టర్ అయ్యిందో చెప్పనక్కర్లేదు.ఈ ఒక్క సాంగ్ తో సినిమాకు కావాల్సినంత హైప్ వచ్చింది.ఇక ఈసినిమా నుండి రెండో పాటను రిలీజ్ చేశారు.మోత మోగిపోద్ది అంటూ వచ్చిన ఈసాంగ్ థియేటర్లలో మోత మోగించడం ఖాయం అనేలా వుంది.ఆస్కార్ అవార్డు విజేత చంద్ర బోస్ లిరిక్స్ అందించిన ఈ సాంగ్ ను మనసి పాడింది.యువన్ శంకర్ అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చాడు.ఈమాస్ బీట్ సాంగ్ లో అయేషా ఖాన్ గ్లామర్ షో యూత్ ను ఫిదా చేయనుంది.అలాగే ఈపాటలో విశ్వక్ తన డ్యాన్స్ విశ్వరూపాన్ని చూపించనున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Here’s the Electrifying MASS BEAT of the YEAR ~ #Motha 🔥 ft. Mass Ka Das @VishwakSenActor & #AyeshaaKhan 🕺💃
Full Song Out Now 🎧 – https://t.co/pgA4exoCyw
A @thisisysr Musical 🎹🥁
Lyrics ✍️ by Academy Award Winner @boselyricist
🎤 @manasimm #GangsOfGodavari WW Grand… pic.twitter.com/XJrppj6HMb— Sithara Entertainments (@SitharaEnts) March 25, 2024
ఓవరాల్ గా సాంగ్స్ తోనే హైప్ తెచ్చుకుంటున్న ఈసినిమాలో కంటెంట్ కూడా క్లిక్ అయితే విశ్వక్ కెరీర్ లో పెద్ద హిట్ పడనుంది.షూటింగ్ కూడా తుది దశకు చేరుకుంది.కృష్ణ చైతన్య డైరెక్ట్ చేస్తున్న ఈసినిమాలో నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా అంజలి కీలక పాత్రలో కనిపించనుంది.నాగవంశీ,సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.మే 17న ఈసినిమా థియేటర్లోకి రానుంది.
ఇక రీసెంట్ గా గామితో వచ్చి హిట్ కొట్టాడు విశ్వక్ సేన్.ఇప్పుడు సరిగ్గా మూడు నెలల గ్యాప్ లో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి తో వస్తున్న విశ్వక్ మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంటాడో లేదో చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: