విజయ్ దేవరకొండ ,పరుశురాం,దిల్ రాజు కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఫ్యామిలీ స్టార్.షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.రీసెంట్ గా ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకొని హైప్ పెంచేసింది.ఇక ఈసినిమా కు ఫ్యామిలీ స్టార్ టైటిల్ ఎందుకో పెట్టామో దిల్ రాజు చెప్పారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
#TFNReels: కుటుంబాన్ని పైకి తీసుకొచ్చే ప్రతీ ఒక్కరి కథ ఫ్యామిలీ స్టార్… 🌟
Ace Producer #DilRaju about #FamilyStar movie story at TFJA Event!! 🤩#VijayDeverakonda #MrunalThakur #TeluguFilmNagar pic.twitter.com/LhOnZV03qE— Telugu FilmNagar (@telugufilmnagar) March 23, 2024
నిన్న ఓ ఈవెంట్ కు హాజరైన దిల్ రాజు…ఫ్యామిలీ స్టార్ గురించి మాట్లాడుతూ విజయ్ దేవరకొండ ను స్టార్ గా చూపెట్టడానికి ఈ టైటిల్ పెట్టలేదు.టైటిల్ అనౌన్స్ చేసినప్పుడు అందరు అదే అనుకున్నారు కానీ ఫ్యామిలీ ని పైకి తీసుకొచ్చే వాళ్ళందరూ ఫ్యామిలీ స్టార్ లే.ఈసినిమా కంటెంట్ కూడా అదే అందుకే ఆ టైటిల్ పెట్టామని అన్నారు.
ఈసినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించగా గోపిసుందర్ సంగీతం అందిస్తున్నాడు. అతి త్వరలోనే ఈసినిమా నుండి ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. వచ్చే నెల 5న ఈసినిమా థియేటర్లలోకి రానుంది. ఇక ఫ్యామిలీ స్టార్ వరస సెలవలను క్యాష్ చేసుకోనుంది.ఉగాది తోపాటు రంజాన్ రూపంలో హాలిడేలు రావడం ఈసినిమాకు కలిసి రానుంది.జస్ట్ హిట్ టాక్ వస్తే చాలు గీత గోవిందం రికార్డులను బ్రేక్ చేయడం పెద్ద కష్టమేమి కాదు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: