ఓజీ.. వైరల్‍ అవుతోన్న ఇమ్రాన్ హష్మీ ఫ‌స్ట్ లుక్‌

Emraan Hashmi First Look Poster From OG Goes Viral

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు ఏపీ రాజకీయాలు.. మరోవైపు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన కథానాయకుడిగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’, ‘హరి హరవీరమల్లు’, ‘ఓజీ’ సినిమాలు రూపొందుతోన్న విషయం తెలిసిందే. వీటితోపాటు త్వరలోనే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మరో సినిమా కూడా చేయనున్నారు పవన్ కళ్యాణ్. దీంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆయన సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయా చిత్రాలను నిర్మిస్తున్న నిర్మాతలు, దర్శకులు అప్పుడప్పుడు పలు అప్‌డేట్స్ అందిస్తూ ఫ్యాన్స్‌ని ఖుషీ చేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ క్రమంలో తాజాగా ముంబై బ్యాక్‌డ్రాప్‌లో గ్యాంగ్‌స్టర్‌ డ్రామాగా తెరకెక్కుతోన్న ‘ఓజీ’ సినిమా నుంచి ఆదివారం ప్రతినాయకుడి పాత్రను పోషిస్తోన్న ఇమ్రాన్ హష్మీ ఫ‌స్ట్ లుక్‌ పోస్టర్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. నిన్న ఆయన జన్మదినం సందర్భంగా ఇమ్రాన్ ఫ‌స్ట్ లుక్‌ను రిలీజ్ చేయగా అది ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ పోస్టర్‌లో ఇమ్రాన్ హష్మీ సిగార్ వెలిగించుకుంటుండగా.. చేతికి కడియంతో, హాఫ్ బియర్డ్‌తో రఫ్ లుక్‌లో కనిపిస్తున్నారు. మొత్తానికి పవర్ స్టార్ విలన్ ఎంత పవర్‌ ఫుల్‍గా ఉంటాడో ఈ ఒక్క పోస్టర్‌తో మేకర్స్ క్లారిటీ ఇచ్చేసారు. భారీ అంచనాలున్న ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అగ్ర నిర్మాత దానయ్య నిర్మిస్తున్నారు.

కాగా గతేడాది సెప్టెంబర్‌ 2న పవర్ స్టార్ బర్త్‌ డే సందర్భంగా రిలీజైన ఓజీ గ్లింప్స్ సోషల్ మీడియాను షేక్ చేసింది. సినిమా ఏ రేంజ్‌లో ఉండనుందో ఈ గ్లింప్స్‌తో అందరికీ అర్ధమైంది. అందులో అర్జున్ దాస్ వాయిస్ ఓవర్ హైలైట్ గా నిలిచింది. పవన్ కళ్యాణ్ రూత్ లెస్ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించి అభిమానులకు సర్‌ప్రైజ్‌ ఇవ్వగా.. ఎస్.తమన్ తనదైన బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌తో నెక్స్ట్ లెవెల్‍కు తీసుకెళ్లాడు. ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా, బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటిస్తుండగా.. అర్జున్ దాస్, శ్రీయా రెడ్డి ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా ఈ సినిమాను సెప్టెంబర్ 27న గ్రాండ్‌గా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 1 =