ఫ్యామిలీ స్టార్ థర్డ్ సింగిల్ రిలీజ్ 

Family Star Third Single out now

రిలీజ్ కు రోజులు దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచింది ఫ్యామిలీ స్టార్ టీం.అందులో భాగంగా కొద్దీ సేపటి క్రితం ఈసినిమానుండి మూడో సాంగ్ ను రిలీజ్ చేశారు.ఇంతకుముందు రిలీజైన మొదటి రెండు పాటలు మంచి రెస్పాన్స్ తెచ్చుకోగా ఈమూడో సాంగ్ కూడా బాగుంది.మధురము కదా అనే ఈ సాంగ్ ను ప్రముఖ సింగర్ శ్రేయా ఘోషల్ పాడగా శ్రీ మణి లిరిక్స్ అందించాడు.ఈ పాటను ఫారెన్ లో షూట్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా ట్రైలర్ కోసం విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.టీజర్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకొని  హైప్ పెంచేసింది.ట్రైలర్ కూడా అంచనాలకు తగ్గట్టు ఉంటే భారీ ఓపెనింగ్స్ ఖాయం.ఈ నెల 28 న ఈ ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు.

పరుశురాం డైరెక్ట్ చేసిన ఈసినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించగా విజయ్ దేవరకొండ మిడికల్ క్లాస్ కుర్రాడి గా కనిపించనున్నాడు.గోపి సుందర్ సంగీతం అందిస్తున్నాడు.దిల్ రాజు నిర్మిస్తున్నారు.వచ్చే నెల 5న ఈసినిమా తెలుగుతోపాటు తమిళంలో విడుదలకానుంది.థియేట్రికల్ రిలీజ్ తరువాత ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ లోకి రానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − 3 =