ఇండస్ట్రీ హిట్ మగధీర రీ రిలీజ్ కానుంది.టాప్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో 2009లో వచ్చిన ఈసినిమా థియేటర్లలో సెన్సేషన్ సృష్టించింది.ఇక ఇప్పుడు మళ్ళీ విడుదలవుతుంది.ఈనెల 27న రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ఈసినిమా రీ రిలీజ్ అవుతుంది.రామ్ చరణ్ నటించిన సినిమాలు రీ రిలీజ్ లు కొత్తేమి కాదు గత ఏడాది ఆరెంజ్,నాయక్ సినిమాలను మళ్లీ రిలీజ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇందులో ఆరెంజ్ 3కోట్ల కు పైగా గ్రాస్ ను రాబట్టి అదుర్స్ అనిపించింది.మరి మగధీర ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.రేపటి నుండి అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ కానున్నాయి.భారీ బడ్జెట్ తో గీతా ఆర్ట్స్ నిర్మించిన ఈసినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించగా ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం అందించాడు.
ఇదిలావుంటే చరణ్ బర్త్ డే రోజున అప్డేట్స్ డేట్స్ రానున్నాయి.ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ లో నటిస్తున్నాడు.షూటింగ్ కూడా తుది దశకు వచ్చింది.ఈసినిమా నుండి జరగండి అనే సాంగ్ ను రిలీజ్ చేయనున్నారట అయితే ఇప్పటివరకు అధికారకంగా ఎలాంటి ప్రకటన రాలేదు.ఇక గేమ్ ఛేంజర్ తరువాత రామ్ చరణ్, బుచ్చి బాబు తో సినిమా చేయనున్నాడు.అదే రోజున ఈసినిమా నుండి కూడా అప్డేట్ ఇచ్చే ఛాన్స్ వుందట.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: