
ట్యాగ్ · 3668 కథనాలు · పేజీ 144


ఫ్యామిలీ స్టార్ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

టిల్లు స్క్వేర్ యూఎస్ ప్రీ సేల్స్ లో దూకుడు

చరణ్ కు బన్నీ స్వీట్ బర్త్ డే విషెస్

మంజుమ్మల్ బాయ్స్.. తెలుగు రిలీజ్ డేట్ ఫిక్స్


ఆసినిమా చిరంజీవి-చరణ్ రీమేక్ చేస్తే బాగుంటుంది

హ్యాపీడేస్ రీ రిలీజ్ డేట్ ఫిక్స్

జూనియర్ షూటింగ్ లో శ్రీ లీల

మిస్టర్ బచ్చన్ యాక్షన్ షురూ

టిల్లు స్క్వేర్ సెకండ్ ట్రైలర్ డేట్ ఫిక్స్

తలైవా 171 పై లోకేష్ కనగరాజ్ అప్ డేట్

ఓం భీమ్ బుష్ 4డేస్ కలెక్షన్స్

గోపిచంద్ 32కి లైన్ క్లియర్
మ్యాచో హీరో గోపిచంద్ ,డైరెక్టర్ శ్రీను వైట్ల తో తన 32వ సినిమాను చేస్తున్నాడని తెలిసిందే.ఇటీవలే ఇటలీ లో కీలకమైన షెడ్యూల్ ను కూడా పూర్తి చేసుకుంది.చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్ ఫై వేణు దోనేపూడి నిర్మాణంలో ఈసీనిమా స్టార్ట్ అయ్యింది.అయితే బడ్జెట్ సమస్యల వల్ల మధ్యలో షూటింగ్ కొద్దీ రోజులు హోల్డ్ లో పెట్టారు.ఇక ఇప్పుడు లైన్ క్లియర్ అయ్యింది.ప్రముఖ బ్యానర్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాతల్లో ఒకరైన టిజి విశ్వ ప్రసాద్ ఈసినిమా నిర్మాణంలో భాగస్వామి కావడానికి ముందుకు రావడంతో ఆర్థిక పరమైన సమస్యలు తీరిపోయాయి.దాంతో రేపటి నుండి కొత్త షెడ్యూల్ స్టార్ట్ కానుంది.ఈషెడ్యూల్ లో లాస్ట్ టాకీ పార్ట్ ను షూట్ చేయనున్నారు.

ఫ్యామిలీ స్టార్ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్
గీత గోవిందం తరువాత విజయ్ దేవరకొండ ,డైరెక్టర్ పరుశురాం కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఫ్యామిలీ స్టార్.ఏప్రిల్ 5న విడుదలకానుంది.ప్రస్తుతం టీం ప్రమోషన్స్ లో బిజీ గా వుంది అందులో భాగంగా రేపు కీలక మైన ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు.రెండు చోట్ల ఈ ఈవెంట్ ను జరుపనున్నారు. మొదట 11 గంటలకు మూసపేట లోని శ్రీ రాములు థియేటర్లో విడుదలచేసి ఆ తరువాత తిరుపతి లో పీజిఆర్ సినిమాస్ లో సాయంత్రం 6గంటలకు విడుదలచేయనున్నారు.ఇప్పటివరకు రిలీజైనా టీజర్ ,సాంగ్స్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.

టిల్లు స్క్వేర్ యూఎస్ ప్రీ సేల్స్ లో దూకుడు
మల్లిక్ రామ్ దర్శకత్వంలో సిద్దు జొన్నలగడ్డ హీరోగా రాబోతున్న సినిమా టిల్లు స్క్వేర్. డీజే టిల్లు సినిమాకు ఈసినిమా సీక్వెల్ అన్నసంగతి తెలిసిందే కదా. ఈసినిమా పలుమార్లు రిలీజ్ డేట్ ను మార్చుకున్నా ఫైనల్ గా మార్చి 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ ను ట్రైలర్ ను రిలీజ్ చేయగా అవి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి.

చరణ్ కు బన్నీ స్వీట్ బర్త్ డే విషెస్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నేడు తన పుట్టినరోజును జరుపుకుంటున్న సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలో రామ్ చరణ్ కు మెగా ఫ్యాన్స్ నుండి, సెలబ్రిటీల నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు అందుతున్నాయి. అంతేకాదు రామ్ చరణ్ కొత్త సినిమాల నుండి అప్ డేట్లు వచ్చేస్తున్నాయి. దీనిలో భాగంగానే గేమ్ ఛేంజర్ నుండి ఇప్పటికే జరగండి అంటూ వచ్చే కలర్ ఫుల్ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్.

మంజుమ్మల్ బాయ్స్.. తెలుగు రిలీజ్ డేట్ ఫిక్స్
లేటెస్ట్ బాక్సాఫీస్ సెన్సేషన్ 'మంజుమ్మల్ బాయ్స్' త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఒక యదార్థ సంఘటన స్ఫూర్తితో, కొచ్చికి చెందిన కొంతమంది స్నేహితుల కథను వెండితెరపై అద్భుతంగా చూపించిన సినిమాయే ఈ 'మంజుమ్మల్ బాయ్స్'. ప్రపంచ మార్కెట్‌లో రూ. 200 కోట్లను సంపాదించిన మొదటి మలయాళ చిత్రంగా చరిత్ర సృష్టించింది ఈ బెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్. చిదంబరం ఎస్ పొదువల్ దర్శకత్వంలో సౌబిన్ షాహిర్, గణపతి, ఖలీద్ రెహమాన్, శ్రీనాథ్ భాసి ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం మలయాళీ ప్రేక్షకులని అలరించి ఘన విజయాన్ని సాధించింది.

రామ్ చరణ్ బర్త్ డే.. విషెస్ తెలిపిన పవన్ కళ్యాణ్, జూ.ఎన్టీఆర్, అల్లు అర్జున్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నేడు జన్మదినం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా టాలీవుడ్‌కు చెందిన పలువురు సినీ ప్రముఖులు ఆయనకు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. వీరిలో చరణ్ బాబాయి, పవర్ స్టార్ మరియు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, కజిన్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు క్లోజ్ ఫ్రెండ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ తదితరులున్నారు. ఈ మేరకు వీరు సోషల్ మీడియా వేదికగా చరణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే 'కేజీఎఫ్' మరియు 'సలార్' ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, హీరోలు శర్వానంద్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ సహా పలు ప్రొడక్షన్ హౌజ్‌లు రామ్ చరణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు…

ఆసినిమా చిరంజీవి-చరణ్ రీమేక్ చేస్తే బాగుంటుంది
మలయాళం సినిమాలకు ఇప్పుడు తెలుగులో మంచి డిమాండ్ ఏర్పడిన సంగతి తెలిసిందే కదా. అందుకే అక్కడి సినిమాలను ఇక్కడ రిలీజ్ చేయడమే కాదు రీమేక్ లు కూడా చేస్తూ వస్తున్నారు. ఇక ఇక్కడ కూడా ఆ సినిమాలు మంచి విజయాలనే అందుకుంటున్నాయి. ఈనేపథ్యంలో ఓ మలయాళం సినిమాను చిరంజీవి-చరణ్ రీమేక్ చేస్తే బావుంటుంది అని అంటున్నాడు మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్.

ఓం భీమ్ బుష్ 5 డేస్ సాలిడ్ కలెక్షన్స్
మొత్తానికి శ్రీవిష్ణు బ్యాక్ టు బ్యాక్ హిట్లను అందుకున్నాడు. గత ఏడాది సామజవరగమన సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్న శ్రీవిష్ణు ఇప్పుడు ఓం భీమ్ బుష్ సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. హుషారు ఫైమ్ శ్రీహర్ష కనుగంటి దర్శకత్వంలో శ్రీవిష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో వచ్చిన సినిమా ఓం భీమ్ బుష్. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈసినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.

తిరుమల శ్రీవారి సన్నిధిలో రామ్ చరణ్ దంపతులు.. మెగా ప్రిన్సెస్ ఫేస్ రివీల్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ రోజు ఆయన జన్మదినం సందర్భంగా సతీమణి ఉపాసనతో కలిసి శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. బుధవారం ఉదయం ఆలయానికి చేరుకున్న రామ్ చరణ్, ఉపాసనలకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చరణ్ దంపతులు కుమార్తె క్లీన్ కారాతో కలిసి స్వామివారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు.

గుంటూరు కారం ఓటీటీ రెస్పాన్స్ పై నాగవంశీ కామెంట్స్
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వచ్చిన సినిమా గుంటూరు కారం. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఫుల్ మాస్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా తెరకెక్కింది. ఇక ఈసినిమా జనవరి 12వ తేదీన రిలీజ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈసినిమా హిట్ టాక్ ను అయితే సొంతం చేసుకుంది. ముఖ్యంగా మహేష్ మాస్ నటనకు అందరూ ఫిదా అయ్యారు. కలెక్షన్స్ పరంగా కూడా ఈసినిమా సాలిడ్ కలెక్షన్స్ ను అందుకుంది.

ఆపరేషన్ వాలెంటైన్- ఓటీటీలో మరో రెండు భాషల్లో అందుబాటులోకి
శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన సినిమా ఆపరేషన్ వాలెంటైన్. వాస్తవ సంఘటనల స్ఫూర్తితో, భారత వైమానిక దళ ధైర్య సాహసాలని చూపే ఈ మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమా మార్చి 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈసినిమా మంచి టాక్ నే సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఈసినిమాలోని యాక్షన్ సన్నివేశాలు, యుద్ధ సన్నివేశాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

గేమ్ ఛేంజర్ నుండి.. జరగండి లిరికల్ సాంగ్ రిలీజ్
'ఆర్ఆర్ఆర్' చిత్రంతో గ్లోబల్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ 'గేమ్ ఛేంజర్'. పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీకి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. చరణ్ 15వ చిత్రంగా రూపొందుతోన్న ఈ సినిమాలో ఆయన సరసన కియారా హీరోయిన్‌గా నటిస్తోంది. పాన్ ఇండియా సినిమాగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై టాలీవుడ్ అగ్ర నిర్మాతలు దిల్ రాజు, శిరీష్‌లు అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

నాని సినిమా ఏదైనా చెప్పండి, చూస్తాను - బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్
టాలీవుడ్ స్టార్ హీరోలలో నాని స్టయిలే వేరు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి సినిమా పరిశ్రమలో అందివచ్చిన అవకాశాలను ఒడిసిపట్టుకుని స్టార్ హీరో రేంజ్‌కి ఎదిగిన ఈ తరం నటుల్లో ఆయన ముందుంటారు. చూడటానికి పక్కింటి అబ్బాయిలా కనిపించే నాని.. తనదైన నటనతో నేచురల్ స్టార్ అనిపించుకున్నారు. ఎలాంటి పాత్రలోనైనా అవలీలగా ఒదిగిపోయే ఆయనకు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ఇతర రాష్ట్రాల్లో సైతం అభిమానులు ఉన్నారు. తాజాగా ఈ లిస్టులోకి బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ ఒకరు చేరారు.

హ్యాపీడేస్ రీ రిలీజ్ డేట్ ఫిక్స్
టాలీవుడ్ లో ఉన్న కూల్ డైరెక్టర్ ఎవరంటే శేఖర్ కమ్ముల పేరు ముందు వినిపిస్తుంది. ఫీల్ గుడ్ సినిమాలు తీస్తూ ప్రేక్షకులను అలరిస్తుంటాడు. ఇక శేఖర్ కమ్ముల నుండి వచ్చిన సినిమానే హ్యాపీడేస్. కళాశాల నేపథ్యంలో వచ్చిన ఈసినిమా 2007వ సంవత్సరంలో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. ఈసినిమాలో కాలేజీ లైఫ్‌తో పాటు... అందులోని స్నేహాలను, ప్రేమలను తనదైన శైలిలో చూపించాడు శేఖర్ కమ్ముల.

జూనియర్ షూటింగ్ లో శ్రీ లీల
గత ఏడాది లో వరుస సినిమాలతో ఫుల్ బిజీ అనిపించుకుంది యంగ్ హీరోయిన్ శ్రీ లీల.సెప్టెంబర్ నుండి ఈ జనవరి వరకు నెలకో సినిమా తో పలకరించింది. సెప్టెంబర్ లో స్కంద తో రాగ అక్టోబర్ లో భగవంత్ కేసరితో వచ్చింది అయితే ఇందులో హీరోయిన్ గా కాకుండా బాలయ్య కు కూతురిగా నటించింది.ఈసినిమా సూపర్ హిట్ అనిపించుకుంది.

మూడు ఓటీటీల్లో హనుమాన్
ఈ సంక్రాంతికి చిన్న సినిమాగా వచ్చి హనుమాన్ ఏ రేంజ్ లో సెన్సేషన్ సృష్టించిందో చెప్పనక్కర్లేదు.స్టార్ హీరోలకు కూడా సాధ్యం కానీ రికార్డులను అందుకుంది.ప్రపంచ వ్యాప్తంగా 300కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి ఆల్ టైం సంక్రాంతి గ్రాసర్ గా నిలిచింది.ఇక ఈసినిమా థియేటర్లలోనే కాదు ఓటీటీ లోనూ అదిరిపోయే రెస్సాన్స్ ను తెచ్చుకుంది.రీసెంట్ గా తెలుగు వెర్షన్ జీ 5లో స్ట్రీమింగ్ లోకి రాగ అతి తక్కువ సమయంలోనే రికార్డు వ్యూస్ ను రాబట్టింది.

మిస్టర్ బచ్చన్ యాక్షన్ షురూ
షాక్ ,మిరపకాయ్ తరువాత డైరెక్టర్ హరీష్ శంకర్,మాస్ రాజా రవితేజ కాంబినేషన్ లో వస్తున్న సినిమా మిస్టర్ బచ్చన్.ఇందులో రవితేజ ప్రభుత్వ ఉద్యోగి గా కనిపించనున్నాడు.సెట్స్ మీదకు వెళ్లినప్పటి నుండి పెద్దగా బ్రేక్ లేకుండా షూటింగ్ జరుపుకుంటుంది.సగానికి పైగా షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది.ప్రస్తుతం కీలకమైన యాక్షన్ సీక్వెన్క్ ను చిత్రీకరిస్తున్నారు.దానికి సంబంధించిన స్టిల్ ను సోషల్ మీడియా లో అప్లోడ్ చేశాడు హరీష్ శంకర్.

టిల్లు స్క్వేర్ సెకండ్ ట్రైలర్ డేట్ ఫిక్స్
మల్లిక్ రామ్ దర్శకత్వంలో సిద్దు జొన్నలగడ్డ హీరోగా రాబోతున్న సినిమా టిల్లు స్క్వేర్. డీజే టిల్లు సినిమాకు ఈసినిమా సీక్వెల్ అన్నసంగతి తెలిసిందే కదా. ఈ సినిమా మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ ను ట్రైలర్ ను రిలీజ్ చేయగా అవి మంచి రెస్పాన్స్ తో దూసుకుపోయాయి. అంతేకాదు సెన్సార్ కూడా పూర్తిచేసుకుంది. ఈసినిమాకు యూఏ సర్టిఫికెట్ వచ్చింది. ఇక ఇప్పుడు మరో ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి సిద్దమయ్యార. ఈనేపథ్యంలో తాజాగా సెకండ్ ట్రైలర్ కు సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు. రేపు ఈసినిమా సెకండ్ ట్రైలర్ ను రిలీజ్…

తలైవా 171 పై లోకేష్ కనగరాజ్ అప్ డేట్
ఈ వయసులో కూడా రజనీకాంత్ యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే లాల్ సలామ్ అనే చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టింది. ప్రస్తుతం అయితే రజనీకాంత్ జ్ఞానవేల్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వెట్టైయాన్ అనే టైటిల్ తో ఈసినిమా వస్తుంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. కాగా మంజు వారియర్, రితికా సింగ్ కూడా ఈసినిమాలో నటిస్తున్నారు. అమితాబ్ ఇంకా రానా కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుండగా.. అనిరుథ్…

ఓం భీమ్ బుష్ 4డేస్ కలెక్షన్స్
నిన్న హోలీ సందర్భంగా హాలిడే కావడతో ఓం భీమ్ బుష్ కు బాగా కలిసొచ్చింది.మొదటి రోజు కన్నా సోమవారం ఎక్కువ వసూళ్లను రాబట్టుకుంది.దాంతో నాలుగు రోజుల్లో ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 21.75కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుందని మేకర్స్ పోస్టర్ ద్వారా ప్రకటించారు.ఇదే జోరు కొనసాగిస్తే ఈ వారంలో అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ కానుంది.అయితే ఈ వీకెండ్ నుండి ఈసినిమాకు బాక్సాఫీస్ వద్ద పోటీ ఎదురుకానుంది.ఈశుక్రవారం సిద్దు జొన్నలగడ్డ నటించిన టిల్లు స్క్వేర్ రిలీజ్ కానుంది.