పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. మరికొద్ది రోజుల్లోనే ఎలక్షన్స్ ఉండటంతో తన ఫుల్ ఫోకస్ ను మొత్తం రాజకీయాలపైనే పెట్టాడు. దీంతో ప్రస్తుతం తన లిస్ట్ లో ఉన్న మూడు సినిమాల షూటింగ్ లు కూడా పెండింగ్ లో పడిపోయాయి. ఇక మూడు సినిమాల్లో సుజీత్ దర్శకత్వంలో వస్తున్న ఓజీ మాత్రం చాలా వరకూ షూటింగ్ ను పూర్తి చేసుకుంది. అంతేకాదు రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించారు. సెప్టెంబర్ 27వ తేదీన ఈసినిమా రిలీజ్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఒకవైపు పవన్ సినిమాలతో బిజీగా ఉంటే మరోవైపు సుజీత్ మాత్రం తన పనిని తాను చేసుకుంటూ వెళుతున్నాడు. పవన్ లేకపోయినా సినిమాకి సంబంధించిన మిగిలిన షూటింగ్ ను పూర్తి చేయాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈనేపథ్యంలోనే తాజాగా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఓ ఫోటో షేర్ చేసాడు. డైరెక్టర్ సుజీత్, కెమెరామెన్ రవిచంద్రన్ కలిసి తన సినిమా కోసం లొకేషన్స్ రెక్కీ లో ఉన్నట్టు తెలిపాడు.
ఈసినిమాలో ప్రియాంక అరుళ్ హీరోయిన్ గా నటిస్తుంది. అర్జున్ దాస్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమాను డీవీవీ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా.. రవి..కె.చంద్రన్ డీవోపీ అందిస్తున్నారు. తెలుగు తోపాటు హిందీ, మలయాళం, తమిళ్ మరియు కన్నడ భాషల్లో పాన్ ఇండియా రేంజ్ లో విడుదలకి సిద్ధమవుతోంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: