టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన యంగ్ హీరో ఆశిష్ రెడ్డి నటుడిగా ఒక్కో సినిమాతో తానేంటో ప్రూవ్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో తన తొలి సినిమా ‘రౌడీ బాయ్స్’తో యూత్‌ను ఆకట్టుకున్న ఆశిష్.. రెండో సినిమాగా ‘సెల్ఫిష్’ అనే చిత్రం చేశాడు. ఇక ఇటీవలే అద్వైతా రెడ్డిని వివాహం చేసుకుని ఒక ఇంటివాడైన ఆయన తాజాగా నటించిన మూడో సినిమా ‘లవ్ మీ’. దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హన్షిత రెడ్డి మరియు హర్షిత్ రెడ్డి నిర్మిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
యూత్ ఫుల్ మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు అరుణ్ భీమవరపు దర్శకత్వం వహిస్తున్నారు. ‘బేబి’ మూవీ ఫేమ్ వైష్ణవి చైతన్య కథానాయికగా నటిస్తోంది. ‘బేబి’ తర్వాత వైష్ణవి చైతన్యకి యూత్‌లో క్రేజ్ బాగా పెరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘లవ్ మీ’ చిత్రం నుంచి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ఈ మేరకు మేకర్స్ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు.
ఇక ఈ సినిమాకు ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతం సమకూరుస్తుండగా.. పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కాగా ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ‘లవ్ మీ’ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. ‘బేబి’ ఫేమ్ వైష్ణవి చైతన్య కథానాయికగా నటిస్తుండటం కూడా ఈ సినిమాపై క్రేజ్ పెంచుతోంది. అలాగే దిల్ రాజు బ్యానర్ నుంచి వస్తున్న సినిమా కావడంతో దీనిపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: