బుల్లి తెర స్టార్ యాంకర్ సుమ తనయుడు రోషన్ హీరోగా బబుల్ గమ్ మూవీతో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే కదా. క్షణం, కృష్ణ అండ్ హిజ్ లీల సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రవికాంత్ పేరెపు దర్శకత్వంలో ఈసినిమా వచ్చింది. ఇక ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా డిసెంబర్ 31 వ తేదీన రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈసినిమా పాజిటివ్ టాక్ నే సొంతం చేసుకుంది. ముఖ్యంగా రోషన్ నటనకు మంచి అప్లాజ్ దక్కింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమా ఇప్పటికే ఓటీటీలోకి వచ్చిన సంగతి తెలిసిందే కదా. ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన ఆహాలో ఈసినిమా స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఈసినిమా థియేటర్లలో ఏమో కానీ ఓటీటీలో మాత్రం సూపర్ హిట్ అయింది. అంతేకాదు ఈసినిమా ఓటీటీలో రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఈసినిమా తాజాగా 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ ను సొంతం చేసుకుంది.
కాగా మానస చౌదరి హీరోయిన్ గా నటించిన ఈసినిమాలో హర్ష వర్ధన్, అను హాసన్ కీలకపాత్రల్లో నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, మహేశ్వరి మూవీస్ బ్యానర్ పై నిర్మించిన ఈసినిమాకు సురేష్ రగుతు సినిమాటోగ్రఫి..శ్రీచరణ్ పాకాల సంగీతం అందించాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: