ఆర్ సి 17 అప్డేట్ వచ్చేసింది

The official announcement for RC 17 is now out

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించనున్న 17వ సినిమా గురించి అఫిషియల్ గా అప్డేట్ వచ్చింది.గత కొన్ని రోజులు గా ఈసినిమాను సుకుమార్ డైరెక్షన్ లో చేయనున్నాడని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.ఇక ఈకాంబినేషన్ ఫిక్స్ అయ్యింది.రామ్ చరణ్ 17వ సినిమాను సుకుమార్ డైరెక్ట్ చేయనున్నాడు.ఈసినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు.మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనుంది.ఇంతకుముందు ఇదే కాంబినేషన్ లో ఇంతకుముందు రంగస్థలం వచ్చింది.ఈసినిమా హ్యుజ్ బ్లాక్ బాస్టర్ అనిపించుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు ఈ కాంబో మరో సారి రిపీట్ అవుతుంది.పాన్ వరల్డ్ లెవల్లో ఈసినిమా వుండనుందట.2025 ఫస్ట్ హాఫ్ లో సెట్స్ మీదకు వెళ్లనుంది.త్వరలోనే ఈసినిమా గురించి మరిన్ని అప్ డేట్స్ రానున్నాయి.

ఇదిలావుంటే ప్రస్తుతం రామ్ చరణ్, గేమ్ ఛేంజర్ చేస్తున్నాడు.శంకర్ డైరెక్ట్ చేస్తుండగా దిల్ రాజు నిర్మిస్తున్నాడు. షూటింగ్ కూడా చివరికి వచ్చేసింది.ఈసినిమా తరువాత చరణ్ తన 16వ సినిమా ను బుచ్చి బాబు సనా తో చేయనున్నాడు.రీసెంట్ గానే ఈ ప్రాజెక్ట్ కూడా లాంచ్ అయ్యింది.మే నుండి సెట్స్ మీదకు వెళ్లనుంది.

ఇక సుకుమార్ ప్రస్తుతం మచ్ అవైటెడ్ సీక్వెల్ పుష్ప 2 ను పూర్తి చేసే పనిలో వున్నాడు.ఈసినిమాపై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు వున్నాయి.ఆగస్టు 15న విడుదలకానుంది.ఈసినిమా విడుదలైన తరువాతే సుకుమార్,చరణ్ సినిమాపై కాన్సంట్రేట్ చేయనున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 4 =