కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Telugu Film News 2023

ట్యాగ్ · 3328 కథనాలు · పేజీ 71

adipurush movie streaming now on prime video
ఓటీటీ

ఓటీటీ లోకి వచ్చేసిన ఆదిపురుష్

ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన పౌరాణిక సినిమా ఆదిపురుష్. రామాయ‌ణంలోని యుద్ధ‌కాండ ఆధారంగా ఈసినిమాను రూపొందించాడు ఓం రౌత్. ఇక జూన్ 16వ తేదీన ఈసినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. ఇక మిక్స్డ్ టాక్ ను తెచ్చుకున్న ఈసినిమా ఫస్ట్ డే నుండే అంచాలనకు మించి వసూళ్లను రాబట్టుకుంది.

TFN Adminవాట్సాప్
vishal clarity on his marriage rumours with heroine lakshmi menon
సినిమా వార్తలు

హీరోయిన్ తో పెళ్లి రూమర్స్ పై విశాల్ క్లారిటీ

తమిళ్ లో మోస్ట్ బ్యాచ్ లర్ హీరో ఎవరంటే విశాల్ అని చెప్పొచ్చు. అందుకే తన పెళ్లిపై వచ్చే వార్తలు ఎప్పుడూ వైరల్ గానే మారుతాయి. గతంలో విశాల్ కు ఎంగేజ్ మెంట్ అయింది. అయితే కొన్ని కారణాల వల్ల వివాహం ఆగిపోయింది. కానీ విశాల్ పెళ్లిపై ఎప్పుడూ ఏదో ఒకవార్త తెరపైకి వస్తూనే ఉంటుంది. గతకొద్దిరోజుల క్రితం హీరోయిన్ అభినయతో ప్రేమలో ఉన్నాడనే వార్తలు వచ్చాయి. అప్పట్లో ఆ వార్తలకు గాను త‌న‌కు అరెంజ్‌డ్ మ్యారేజ్ సెట్ కాద‌ని, ల‌వ్ మ్యారేజ్‌నే చేసుకోవాల‌ని ఉంద‌ని ఆయ‌న‌ అన్నారు. ప్రేమించిన అమ్మాయితోనే ఏడ‌డుగులు వేస్తా.. త్వ‌ర‌లోనే ఆమెను మీకు ప‌రిచ‌యం చేస్తాన‌ని చెప్పుకొచ్చాడు. దాంతో ఈవార్తలకు కొంతకాలం బ్రేక్ పడిది.

TFN Adminవాట్సాప్
mahesh babu send best wishes to bholaa shankar movie team
సినిమా వార్తలు

భోళా శంకర్ కు సూపర్ స్టార్ బెస్ట్ విషెస్

మెగాస్టార్ చిరంజీవి మాత్రం ఈవయసులో కూడా వరుసగా సినిమాలు చేసుకంటూ వెళుతున్నాడు. గత ఏడాది ఆచార్య, గాడ్ ఫాదర్ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన చిరు ఈఏడాది అప్పుడే వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. ఇక ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా వస్తున్న సినిమా భోళా శంకర్. ఈసినిమా తమిళ్ లో హిట్ అయిన వేదాళం సినిమాకు రీమేక్.

TFN Adminవాట్సాప్
siddhu jonnalagadda and bommarillu bhaskar new movie grand launch
సినిమా వార్తలు

జోరు మీదు DJటిల్లూ.. మరో సినిమా లాంచ్

ముందు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాల్లో నటించి ఆ తరువాత గుంటూరు టాకీస్ సినిమాతో హీరోగా తెలుగు తెరకు పరిచయమైన హీరో సిద్దు జొన్నలగొడ్డ. తనకు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. అయితే డీజే టిల్లు తో సిద్దు కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. ఆసినిమాతో సూపర్ హిట్ ను అందుకోవడమే కాకుండా సిద్దూ క్రేజ్ కూడా మరింత పెరిగిపోయింది. ప్రస్తుతం డీజే టిల్లూ సీక్వెల్ తో బిజీగా ఉన్నాడు. టిల్లూ స్క్వేర్ అనే టైటిల్ తో ఈసినిమా రాబోతుంది. అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. రీసెంట్ గానే గ్లింప్స్ ను రిలీజ్ చేయగా గ్లింప్స్ తో…

TFN Adminవాట్సాప్
dil raju interesting comments on jailer movie success
సినిమా వార్తలు

జైలర్ యునానిమస్ బ్లాక్ బస్టర్

సూపర్ స్టార్ రజినీకాంత్ ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూసిన సినిమా జైలర్. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈసినిమా ఫైనల్ గా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిలీజ్ కు ముందే అప్ డేట్లతో సినిమాపై ఆసక్తిని పెంచేశారు. ముఖ్యంగా కావాలయ్యా పాట మాత్రం ఈసినిమాకు కావాల్సినంత బజ్ ను అయితే క్రియేట్ చేసింది. ఇక ఎన్నో అంచనాల మధ్య నేడు రిలీజ్ అయిన ఈసినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంటుంది. అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. దీంతో మేకర్స్ అప్పుడే సక్సెస్ సెలబ్రేషన్స్ ను స్టార్ట్ చేశారు.

TFN Adminవాట్సాప్
dhanush captain miller teaser release in 3500 big screens
ట్రైలర్ & టీజర్

3500 స్క్రీన్స్ లో కెప్టెన్ మిల్లర్ టీజర్

అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో ధనుష్ హీరోగా వస్తున్న సినిమా కెప్టెన్ మిల్లర్. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను ముగించుకుంటుంది. 1930 - 40ల బ్రిటిష్ కాలం నాటి పీరియాడిక్ మూవీగా పుల్ యాక్షన్ తో ఈసినిమాను రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. టీజర్ అయితే మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. అంతేకాదు 24గంటల్లో 23 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకొని రికార్డ్ ను క్రియేట్ చేసుకుంది. ఇక ఇదిలా ఉండగా చిత్రయూనిట్ ప్రమోషన్స్ తో మరింత బజ్ ను క్రియేట్ చేయడానికి కొత్త కొత్త ఐడియాలతో వస్తున్నారు. దీనిలో భాగంగానే దాదాపు 3500 స్క్రీన్స్ లో ఈసినిమా టీజర్ ను ప్రదర్శించనున్నారు…

TFN Adminవాట్సాప్
kushi trailer gets super response
ట్రైలర్ & టీజర్

ఖుషి ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్

విజయ్ దేవరకొండ,సమంత కలిసి నటించిన ఖుషి మరో మూడు వారాల్లో థియేటర్లోకి రానుంది.పోస్టర్లు ,సాంగ్స్ సినిమాఫై హైప్ క్రీయేట్ చేయగా నిన్న విడుదలైన ట్రైలర్ ఆ అంచనాలను మరింత పెంచింది.యూనానిమస్ పాజిటివ్ రెస్పాన్స్ వస్తుండడంతో ఖుషి,విజయ్ కి కావాల్సిన విజయాన్ని అందిస్తుందని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు.ఇక ఈట్రైలర్ 24గంటల్లో కోటికి పైగా వ్యూస్ ను రాబట్టుకుంది.

Mahender Reddyవాట్సాప్
businessman day 1re release collections
బాక్సాఫీస్

బిజినెస్ మేన్ కు రికార్డు ఓపెనింగ్స్

సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా నిన్న రీ రిలీజైన బిజినెస్ మేన్ థియేటర్లలో రచ్చ చేసింది.దాంతో మొదటి రోజు రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ ను రాబట్టింది.ఇప్పటివరకు రీరిలీజైన సినిమాల్లోనే అత్యధిక ఓపెనింగ్స్ ను రాబట్టిన సినిమాగా రికార్డు సృష్టించింది.మొదటి రోజు ఈసినిమా తెలుగు రాష్ట్రాల్లో 4.40కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.ఇందులో నైజాం నుండి ఈసినిమా 2.50కోట్ల గ్రాస్ వసూళ్లను దక్కించుకుంది.

Mahender Reddyవాట్సాప్
Megastar Chiranjeevi's Bholaa Shankar Movie Team Held Huge Rally in Hyderabad
సినిమా వార్తలు

'భోళా శంకర్' మేనియా.. హైదరాబాద్‌లో చిత్ర బృందం భారీ ర్యాలీ

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘భోళా శంకర్‌’ చిత్రం రేపు (ఆగస్టు 11, 2023) ప్రపంచవ్యాపంగా పెద్ద ఎత్తున విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ఓ అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. హైదరాబాద్‌లో వేలాది మెగా అభిమానులతో భారీ ర్యాలీ నిర్వహించింది. హైదరాబాద్ వీధుల్లో మొత్తం 600 కిలోమీటర్ల మేర భారీ ర్యాలీ నిర్వహించారు. గురువారం ఉదయం చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నుంచి ర్యాలీ ప్రారంభమైంది. మొత్తం జీపీఎస్ ట్రాకింగ్‌లో మెగాస్టార్ ముఖ చిత్రం కనిపించేలా ఈ ర్యాలీ చేపట్టడం విశేషం. అయితే ఇప్పటి వరకు సినీ పరిశ్రమలో ఏ హీరో ఇలా జరుపుకోలేదని చిత్ర నిర్మాణ సంస్థ తెలియజేసింది. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత అనిల్…

Srikanth Mవాట్సాప్
gopichand bhimaa movie heroines fixed
సినిమా వార్తలు

గోపీచంద్ భీమా కోసం ఇద్దరు హీరోయిన్లు

ఇండస్ట్రీకి హీరోగా పరిచయమై.. ఆతరువాత విలన్ గా కూడా చేసి తన టాలెంట్ చూపించి అందర్నీ మెప్పించి.. ఆ తరువాత యాక్షన్ హీరోగా మారిన నటుడు గోపీచంద్. తన కెరీర్ లో పలు డిఫరెంట్ కథలతో అలరించాడు.. అలరిస్తూనే ఉన్నాడు. హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఈనేపథ్యంలోనే ఇప్పుడు మరో సినిమాతో వస్తున్నాడు. కన్నడ దర్శకుడు ఎ హర్షశ్రీ దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా వస్తున్న సినిమా భీమా. ఈసినిమా ఇప్పటికే షూటింగ్ ను మొదలుపెట్టేసింది. రీసెంట్ గానే భారీయాక్షన్ ప్యాక్డ్ షెడ్యూల్ ను పూర్తిచేసుకుంది. కాకినాడ పరిసర ప్రాంతాలు అయిన రాజనగరం అద్దరిపేటలో ఈ షెడ్యూల్ ను కంప్లీట్ చేశారు.

TFN Adminవాట్సాప్
fire storm is coming from pawan kalyans OG movie
సినిమా వార్తలు

హీట్ వేవ్ కు సిద్దమైన OG

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొత్తానికి హ్యాట్రిక్ హిట్ ను అందుకున్నాడు. తన సెకండ్ ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేసిన తరువాత పవన్ వరుసగా వకీల్ సాబ్, భీమ్లానాయక్ సినిమాలతో రెండు బ్లాక్ బస్టర్లు అందుకున్నాడు. ఇప్పుడు బ్రో సినిమాతో మరో బ్లాక్ బస్టర్ ను అందుకొని హ్యాట్రిక్ ను సొంతం చేసుకున్నాడు. ఇదిలా ఉండగా అందరూ ఇప్పుడు ఆసక్తిగా ఎదురుచూస్తుంది మాత్రం ఓజీ సినిమాకోసం. సుజీత్ దర్శకత్వంలో పవన్ హీరోగా వస్తున్న సినిమా ఓజీ.. (ఒరిజినల్ గ్యాగ్ స్టర్).

TFN Adminవాట్సాప్
vijay deverakonda interesting comments on samantha
సినిమా వార్తలు

తన కోసం 10 ఏళ్లు అయినా వెయిట్ చేసేవాళ్లం

ఆమె కోసం పదేళ్లయినా వెయిట్ చేసేవాళ్లం అంటున్నారు ఖుషి చిత్రయూనిట్. మరి ఇంతకీ ఆమె ఎవరో ఇప్పటికే ఒక ఐడియా వచ్చి ఉంటుంది కదా. ఎవరో కాదు స్టార్ హీరోయిన్ సమంత. శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా సమంత హీరోయిన్ గా వస్తున్న సినిమా ఖుషి. నిజానికి వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా అన్నప్పుడే ఈ కాంబినేషన్ పై భారీ అంచనాలను ఏర్పడ్డాయి. అందులోనూ అప్పటికే మహానటి సినిమాలో వీరిద్దరి కెమిస్ట్రీకి మంచి మార్కులు పడటంతో ఈసినిమాను ఎప్పుడు సిల్వర్ స్క్రీన్ పై చూద్దామా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రోడక్షన్ పనులను ముగించుకుంటుంది.

TFN Adminవాట్సాప్
gentlemen 2 movie motion poster out
ఫస్ట్ లుక్

జెంటిల్ మేన్ 2 మోషన్ పోస్టర్ రిలీజ్

ఈమధ్య సీక్వెల్స్ రావడం కామన్ అయిపోయిన సంగతి తెలిసిందే కదా. సినిమా హిట్ అయితే వెంటనే సీక్వెల్స్ చేయడానికి రెడీ అయిపోతున్నారు. ఇక ఇప్పుడు మరో క్లాసిక్ సినిమా కూడా సీక్వెల్ కు సిద్దమవుతుంది. ఈసినిమా మరేదో కాదు.. శంకర్ దర్శకత్వంలో అర్జున్‌, మధుబాల హీరో హీరోయిన్లుగా వచ్చి సంచలనం సృష్టించిన జెంటిల్‌మేన్‌ సినిమా. 1993లో తమిళ, తెలుగు భాషల్లో రిలీజ్ అయి ఓ సంచలనం సృష్టించింది. అర్జున్ కెరీర్‌లో ఈ సినిమా ఓ మైలురాయిగా నిలిచింది. కృష్ణమూర్తి పాత్రలో తన సత్తా చాటాడు. ఇక శంకర్ కూడా తొలి చిత్రంతోనే అందరి దృష్టిని ఆకర్షించి ప్రశంసలు అందుకున్నాడు. అప్పట్లో కె.జి. కుంజమోన్‌ ఈసినిమాను నిర్మించారు. ఇప్పుడు…

TFN Adminవాట్సాప్
king of kotha movie trailer released
ట్రైలర్ & టీజర్

కింగ్ ఆఫ్ కోత ట్రైలర్ రిలీజ్

భాషతో సంబంధం లేకుండా సినిమా చేసే హీరోల్లో మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కూడా ఒకరు. మలయాళంలో చేస్తూనే మరోపక్క తెలుగు, హిందీ ఇలా పలు భాషల్లో సినిమాలు చేసుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ఇక తెలుగులో కూడా దుల్కర్ కు మంచి ఫ్యాన్ బేస్ ఉన్న సంగతి తెలిసిందే కదా. మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న దుల్కర్ సీతారామంతో తెలుగులో తన మార్క్ ను క్రియేట్ చేసుకున్నాడు. ఇక ఇప్పుడు మరో సినిమాతో వస్తున్నాడు.

TFN Adminవాట్సాప్
thalapathy vijay leo movie will release in two parts
సినిమా వార్తలు

రెండు పార్టులుగా లియో?

ఇప్పుడు పెద్ద సినిమాలను రెండు పార్ట్ లుగా రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే పుష్ప పార్ట్ 1 వచ్చింది.. ఇప్పుడు పార్ట్ 2 రాబోతుంది. రీసెంట్ గానే పొన్నియన్ సెల్వన్ రెండు పార్ట్ లుగా రిలీజ్ అయింది. ఇక త్వరలో రిలీజ్ కాబోతున్న సలార్ సినిమా కూడా రెండు పార్ట్ లుగా రాబోతుంది. ముందు ఒక సినిమానే అనుకున్నారు కానీ రీసెంట్ గానే రెండు పార్ట్ లుగా రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. ఇక ఇప్పుడు మరో సినిమాను కూడా రెండు భాగాలుగా రిలీజ్ చేయలని చూస్తున్నారట. ఆసినిమా మరేదో కాదు విజయ్ నుండి రాబోతున్న లియో సినిమా.

TFN Adminవాట్సాప్
ram skanda movie shooting completed
షూటింగ్ అప్‌డేట్

స్కంద షూటింగ్ కంప్లీట్

ఎనర్జిటిక్ హీరో రామ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమాను పొలిటికల్ అండ్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టింది చిత్రయూనిట్. ఇప్పటికే ఈసినిమా నుండి టైటిల్ గ్లింప్స్ ను రిలీజ్ చేయగా దానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈసినిమాలో కూడా రామ్ మరోసారి మాస్ పాత్రలో అరించనున్నట్టు అర్థమవుతుంది. రీసెంట్ గానే ఈసినిమా నుండి నీ చుట్టూ చుట్టూ అనే పాటను రిలీజ్ చేయగా ఆపాట ఏ రేంజ్ లో ఆకట్టుకుందో చూశాం. ముఖ్యంగా కలర్…

TFN Adminవాట్సాప్
mass poster released from guntur kaaram movie
ఫస్ట్ లుక్

గుంటూరు కారం- మహేష్ సూపర్ మాస్ పోస్టర్ రిలీజ్

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా గుంటూరు కారం. అతడు, ఖలేజా సినిమాల తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ షూటింగ్ ను పూర్తిచేసుకునే పనిలో ఉంది. ఇప్పటికే సూపర్ స్టార్ కృష్ణ గారి జయంతి సందర్భంగా మాస్ స్ట్రైక్ పేరుతో విడుదల చేసిన గ్లింప్స్ అద్భుతమైన స్పందనతో వైరల్ గా మారిన విషయం తెలిసిందే.

TFN Adminవాట్సాప్
Power Star Pawan Kalyan Extends Birthday Wishes To Super Star Mahesh Babu
సినిమా వార్తలు

సూపర్ స్టార్ మహేష్‌ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

ఈరోజు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్‌ బాబు బర్త్ డే. ఈ సందర్భంగా ఆయనకు తన అభిమానులతో పాటుగా ఎంతోమంది సినీ ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. మహేష్‌ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు జనసేన పార్టీ సోషల్ మీడియా వేదిక ట్విట్టర్ ద్వారా ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు. అందులో పవన్ కళ్యాణ్.. "తెలుగు చిత్ర సీమలో తనదైన పంధా కలిగిన అగ్రశ్రేణి కథానాయకుడు శ్రీ మహేష్ బాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. శ్రీ మహేష్ బాబు కథానాయకుడిగా అందుకున్న ఘన విజయాలు తెలుగు సినీ పరిశ్రమ వృద్ధికి ఎంతో దోహదపడ్డాయి. తండ్రి నటశేఖర కృష్ణగారి…

Srikanth Mవాట్సాప్
dulquer salmaan king of kotha movie trailer release postponed
ట్రైలర్ & టీజర్

కింగ్ ఆఫ్ కోత ట్రైలర్ రిలీజ్ వాయిదా

అభిలాష్ జోషి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, ఐశ్వర్య లక్ష్మీ ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా కింగ్ ఆఫ్ కోత. గ్యాంగ్‌స్టర్‌ డ్రామాగా 80, 90 కాలం బ్యాక్ డ్రాప్ లో ఈసినిమా వస్తుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ప్రమోషన్స్ తో బిజీగా ఉంది చిత్రయూనిట్. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ రిలీజ్ చేయగా దానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు హల్లా మచారే అనే పాటని విడుదల చేశారు మేకర్స్. ఎనర్జిటిక్ ఫుట్ టాపింగ్ గా ఉన్న ఈపాటకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి సిద్దమయ్యారు.

TFN Adminవాట్సాప్
star certificate for super star mahesh babu
సినిమా వార్తలు

మహేష్ కు అరుదైన గౌరవం- పేరుతో స్టార్ రిజిస్ట్రేషన్

నేడు మహేష్ బాబు పుట్టినరోజు అన్న సంగతి తెలిసిందే కదా. ఈ సందర్భంగా ఫ్యాన్స్ ఆయన సినిమాల నుండి అప్ డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే బిజినెస్ మేన్ సినిమా రీ రిలీజ్ అవుతుంది. తాజాగా గుంటూరు కారం నుండి స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఈపోస్టర్ తో ఫ్యాన్స్ కు మహేష్ ఫుల్ మాస్ ట్రీట్ ఇచ్చాడని చెప్పొచ్చు. లుంగీ కట్టుకొని, బిడీ వెలిగించుకుంటున్న మహేష్ లుక్ మాత్రం అదిరిపోయింది. మొత్తానికి టైటిల్ గ్లింప్స్ ను బట్టి.. ఈ పోస్టర్ ను బట్టి ఈసారి మహేష్ ఫుల్ మాస్ అవతారంలో సందడి చేయడానికి వచ్చేస్తున్నాడని మాత్రం అర్థమవుతుంది.

TFN Adminవాట్సాప్

షేర్