విజయ్ దేవరకొండ,సమంత కలిసి నటించిన ఖుషి మరో మూడు వారాల్లో థియేటర్లోకి రానుంది.పోస్టర్లు ,సాంగ్స్ సినిమాఫై హైప్ క్రీయేట్ చేయగా నిన్న విడుదలైన ట్రైలర్ ఆ అంచనాలను మరింత పెంచింది.యూనానిమస్ పాజిటివ్ రెస్పాన్స్ వస్తుండడంతో ఖుషి,విజయ్ కి కావాల్సిన విజయాన్ని అందిస్తుందని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు.ఇక ఈట్రైలర్ 24గంటల్లో కోటికి పైగా వ్యూస్ ను రాబట్టుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
నిన్నుకోరి,మజిలీ ఫేమ్ శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ఈసినిమాలో మురళి శర్మ,రాహుల్ రామకృష్ణ,వెన్నెల కిషోర్,రోహిణి కీలక పాత్రలు పోషించారు.హృదయం ఫేమ్ హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.ఖుషి తెలుగుతో పాటు తమిళ,మలయాళ,కన్నడ,హిందీ భాషల్లో విడుదలకానుంది.
ఇక విజయ్ దేవరకొండ ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీ గా వున్నాడు.అందులో జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరితో ఓ సినిమా చేస్తున్నాడు.సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈసినిమాకి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు.ఈసినిమాతోపాటు విజయ్,పరుశురాంతో కూడా సినిమా చేస్తున్నాడ.దిల్ రాజు నిర్మిస్తుండగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది.ఇటీవలే షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యింది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: