ఇండస్ట్రీకి హీరోగా పరిచయమై.. ఆతరువాత విలన్ గా కూడా చేసి తన టాలెంట్ చూపించి అందర్నీ మెప్పించి.. ఆ తరువాత యాక్షన్ హీరోగా మారిన నటుడు గోపీచంద్. తన కెరీర్ లో పలు డిఫరెంట్ కథలతో అలరించాడు.. అలరిస్తూనే ఉన్నాడు. హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఈనేపథ్యంలోనే ఇప్పుడు మరో సినిమాతో వస్తున్నాడు. కన్నడ దర్శకుడు ఎ హర్షశ్రీ దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా వస్తున్న సినిమా భీమా. ఈసినిమా ఇప్పటికే షూటింగ్ ను మొదలుపెట్టేసింది. రీసెంట్ గానే భారీయాక్షన్ ప్యాక్డ్ షెడ్యూల్ ను పూర్తిచేసుకుంది. కాకినాడ పరిసర ప్రాంతాలు అయిన రాజనగరం అద్దరిపేటలో ఈ షెడ్యూల్ ను కంప్లీట్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా తాజాగా ఈసినిమాలో నటించే హీరోయిన్లకు సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమాలో ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా నటిస్తుందని అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే ప్రియా భవాని శంకర్ తెలుగులో సంతోష్ శోభన్ తో కళ్యాణం కమనీయం సినిమాలో నటించింది.. అలానే సత్యదేవ్ హీరోగా వస్తున్న జీబ్రా సినిమాలో కనిపించనుంది. ఇంకా ప్రియా భవానితో పాటు మరో హీరోయిన్ గా కూడా నటించనుంది. మాళవిక శర్మ ఈసినిమాలో మరో హీరోయిన్ గా నటించబోతుంది.
LIGHTS, CAMERA, & WELCOME 🤩
Team #BHIMAA welcomes the charismatic @priya_Bshankar onboard 💕
Regular shoot in progress ❤️🔥
🌟ing @YoursGopichand
A @nimmaaharsha Directorial @KKRadhamohan @RaviBasrur @SriSathyaSaiArt pic.twitter.com/2LG8vJr9VW— Sri Sathya Sai Arts (@SriSathyaSaiArt) August 10, 2023
Team #BHIMAA welcomes onboard the stunning actress @ImMalvikaSharma ❤️🔥
Regular shoot in progress 🎬
More exciting updates soon💥🌟ing @YoursGopichand @nimmaaharsha @KKRadhamohan @RaviBasrur @SriSathyaSaiArt pic.twitter.com/FGZsGLvrMk
— Sri Sathya Sai Arts (@SriSathyaSaiArt) August 10, 2023
కాగా ఈ సినిమాను శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి స్వామి జే సినిమాటోగ్రాఫర్ కాగా, కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ఇంకా ఇతర నటీనటుల వివరాలను త్వరలో తెలియచేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: