భాషతో సంబంధం లేకుండా సినిమా చేసే హీరోల్లో మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కూడా ఒకరు. మలయాళంలో చేస్తూనే మరోపక్క తెలుగు, హిందీ ఇలా పలు భాషల్లో సినిమాలు చేసుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ఇక తెలుగులో కూడా దుల్కర్ కు మంచి ఫ్యాన్ బేస్ ఉన్న సంగతి తెలిసిందే కదా. మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న దుల్కర్ సీతారామంతో తెలుగులో తన మార్క్ ను క్రియేట్ చేసుకున్నాడు. ఇక ఇప్పుడు మరో సినిమాతో వస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అభిలాష్ జోషి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, ఐశ్వర్య లక్ష్మీ ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా కింగ్ ఆప్ కోత. గ్యాంగ్‌స్టర్ డ్రామాగా 80, 90 కాలం బ్యాక్ డ్రాప్ లో ఈసినిమా వస్తుంది. ఈసినిమా ఆగష్ట్ 24వ తేదీన రిలీజ్ కానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. దీనిలో భాగంగానే తాజాగా ఈసినిమా ట్రైలర్ను రిలీజ్ చేశారు మేకర్స్. నిజానికి నిన్న రిలీజ్ అవ్వాల్సిన ట్రైలర్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. మలయాళం స్టార్ డైరెక్టర్ సిద్దిఖీ మరణించిన కారణం చేత ఈ ట్రైలర్ రిలీజ్ ను వాయిదా వేశారు. ఫైనల్ గా నేడు ఈసినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్ అయితే సినిమాపై అంచనాలను పెంచేసింది. ఎప్పటిలాగే ధనుష్ నటన ఈసినిమాకు హైలెట్ అవ్వనుందని అర్థమవుతుంది. ముఖ్యంగా పీరియాడిక్ సినిమా కాబట్టి అందుకు తగ్గట్టుగా విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి. మరో హైలెట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్. ట్రైలర్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. మొత్తానికి ట్రైలర్ తో అంచనాలు పెరిగిపోయాయి.. మరి సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే రిలీజ్ వరకూ ఆగాల్సిందే.
కాగా ఈసినిమాలో ఇంకా ప్రసన్న, నైలా ఉషా, చెంబన్ వినోద్, గోకుల్ సురేశ్, షమ్మీ తిలకన్, శాంతి కృష్ణ, వడా చెన్నై శరన్, అనిఖా సురేంద్రన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వేఫరెర్ ఫిలిమ్స్-జీ స్టూడియోస్ సంయుక్తంగా ఈసినిమాను నిర్మిస్తున్నాయి. షాన్ రెహ్మాన్, జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తుండగా..నిమిష్ రవి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈసినిమా పాన్ ఇండియా స్థాయిలో మలయాళంతో పాటు తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: