మహేష్ కు అరుదైన గౌరవం- పేరుతో స్టార్ రిజిస్ట్రేషన్

star certificate for super star mahesh babu

నేడు మహేష్ బాబు పుట్టినరోజు అన్న సంగతి తెలిసిందే కదా. ఈ సందర్భంగా ఫ్యాన్స్ ఆయన సినిమాల నుండి అప్ డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే బిజినెస్ మేన్ సినిమా రీ రిలీజ్ అవుతుంది. తాజాగా గుంటూరు కారం నుండి స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఈపోస్టర్ తో ఫ్యాన్స్ కు మహేష్ ఫుల్ మాస్ ట్రీట్ ఇచ్చాడని చెప్పొచ్చు. లుంగీ కట్టుకొని, బిడీ వెలిగించుకుంటున్న మహేష్ లుక్ మాత్రం అదిరిపోయింది. మొత్తానికి టైటిల్ గ్లింప్స్ ను బట్టి.. ఈ పోస్టర్ ను బట్టి ఈసారి మహేష్ ఫుల్ మాస్ అవతారంలో సందడి చేయడానికి వచ్చేస్తున్నాడని మాత్రం అర్థమవుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు మరొక అరుదైన గౌరవం దక్కింది మహేష్ కు. సూపర్ స్టార్ మహేష్ బాబు పేరుతో స్టార్ సర్టిఫికేషన్ జరిగింది. అంటే ఒక నక్షత్రానికి మహేష్ పేరును పెడుతూ రిజిస్టర్ చేస్తారన్నమాట. ఇప్పుడు మహేష్ పుట్టిన రోజు సందర్బంగా మహేష్ పేరుతో రిజిస్టేషన్ చేశారు. ఇక ఇండస్ట్రీలోనే ఇలాంటి అరుదైన గౌరవం దక్కిన మొదటి హీరోగా మహేష్ రికార్డును సొంతం చేసుకున్నారు.

కాగా మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా గుంటూరు కారం. ఈసినిమాలో మహేష్ బాబు సరసన మీనాక్షి చౌదరి అలానే శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. మధి కెమెరామెన్‌గా, నవీన్ నూలి ఎడిటర్‌గా, థమన్ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్‌పై ఎస్.రాధాకృష్ణ ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఆతరువాత రాజమౌళి తో తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ను చేయనున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.