హీట్ వేవ్ కు సిద్దమైన OG

fire storm is coming from pawan kalyans OG movie

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొత్తానికి హ్యాట్రిక్ హిట్ ను అందుకున్నాడు. తన సెకండ్ ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేసిన తరువాత పవన్ వరుసగా వకీల్ సాబ్, భీమ్లానాయక్ సినిమాలతో రెండు బ్లాక్ బస్టర్లు అందుకున్నాడు. ఇప్పుడు బ్రో సినిమాతో మరో బ్లాక్ బస్టర్ ను అందుకొని హ్యాట్రిక్ ను సొంతం చేసుకున్నాడు. ఇదిలా ఉండగా అందరూ ఇప్పుడు ఆసక్తిగా ఎదురుచూస్తుంది మాత్రం ఓజీ సినిమాకోసం. సుజీత్ దర్శకత్వంలో పవన్ హీరోగా వస్తున్న సినిమా ఓజీ.. (ఒరిజినల్ గ్యాగ్ స్టర్).

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. పవన్ కూడా ఇప్పటికే కొంతవరకూ షూటింగ్ ను పూర్తిచేసుకున్నాడు. చిత్రయూనిట్ పవన్ లేని పోర్షన్స్ ను పూర్తి చేస్తున్నారు. ఇక ఈసినిమాపై ఇప్పటికే భారీ ఎక్స్ పెక్టేషన్స్ ఉండగా దానికితోడు రోజు రోజుకు వస్తున్న వార్తలు సినిమాపై ఆసక్తిని మరింత పెంచేస్తున్నాయ. రీసెంట్ గానే ఈసినిమా నుండి పవన్ మార్షల్ ఆర్ట్స్ చేస్తున్నట్టు వచ్చిన ఫొటోలు అంచనాలను మరింత పెంచేశాయి. తాజాగా ఈసినిమాకు సంబంధించి సర్ ప్రైజింగ్ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. సెప్టెంబర్ 2వ తేదీన పవన్ కళ్యాణ్ పుట్టినరోజు అన్న సంగతి తెలిసిందే కదా. ఆరోజు ఈసినిమా నుండి ఏదో ఒక అప్ డేట్ వస్తుందని చూస్తున్న ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పారు. సెప్టెంబర్ 2వ తేదీన ఫైర్ స్ట్రామ్ పేరుతో గ్లింప్స్ ను రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు.

ఈసినిమాలో ప్రియాంక అరుళ్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈసినిమాను డీవీవీ ఎంటర్‌ టైన్‌ మెంట్‌ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా.. రవి..కె.చంద్రన్ డీవోపీ అందిస్తున్నారు. తెలుగు తోపాటు హిందీ, మలయాళం, తమిళ్ మరియు కన్నడ భాషల్లో పాన్ ఇండియా రేంజ్ లో విడుదలకి సిద్ధమవుతోంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine − two =