ఈరోజు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే. ఈ సందర్భంగా ఆయనకు తన అభిమానులతో పాటుగా ఎంతోమంది సినీ ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. మహేష్ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు జనసేన పార్టీ సోషల్ మీడియా వేదిక ట్విట్టర్ ద్వారా ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు. అందులో పవన్ కళ్యాణ్.. “తెలుగు చిత్ర సీమలో తనదైన పంధా కలిగిన అగ్రశ్రేణి కథానాయకుడు శ్రీ మహేష్ బాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. శ్రీ మహేష్ బాబు కథానాయకుడిగా అందుకున్న ఘన విజయాలు తెలుగు సినీ పరిశ్రమ వృద్ధికి ఎంతో దోహదపడ్డాయి. తండ్రి నటశేఖర కృష్ణగారి అడుగుజాడల్లో వెళ్తూ, విభిన్న పాత్రల్లో మెప్పించే అభినయ సామర్ధ్యం అయన సొంతం. సోదర సమానుడైన శ్రీ మహేష్ బాబు మరిన్ని విజయాలు అందుకోవాలని, సంపూర్ణ ఆనందంతో ఉండాలని ఆకాంక్షిస్తున్నాను” అని పేర్కొన్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
శ్రీ మహేష్ బాబుకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు – JanaSena Chief shri @PawanKalyan @urstrulyMahesh#HBDSuperstarMaheshBabu pic.twitter.com/Cb0Hd2tODN
— JanaSena Party (@JanaSenaParty) August 9, 2023
కాగా మహేష్ బాబు ఈ ఏడాది పుట్టిన రోజును స్కాట్లాండ్‌లో తన కుటుంబ సభ్యులతో కలిసి సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. మరోవైపు టాలీవుడ్ ప్రముఖులు మెగాస్టార్ చిరంజీవి, యంగ్ టైగర్ జూ.ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ, తమన్, హరీష్ శంకర్ తదితరులు మహేష్ బాబుకి సోషల్ మీడియా ద్వారా బర్త్ డే విషెస్ చెప్పారు. ఇక మహేష్ బాబు ప్రస్తుతం దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘గుంటూరు కారం’ అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. మీనాక్షి చౌదరి ఇందులో కథానాయికగా నటిస్తోంది. ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్ తమన్ స్వరాలు సమకూరుస్తున్నాడు. వచ్చే ఏడాది సంక్రాతి పండుగ సందర్భంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే దీని తర్వాత దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఒక భారీ బడ్జెట్ చిత్రం చేయనున్నారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: