రెండు పార్టులుగా లియో?

thalapathy vijay leo movie will release in two parts

ఇప్పుడు పెద్ద సినిమాలను రెండు పార్ట్ లుగా రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే పుష్ప పార్ట్ 1 వచ్చింది.. ఇప్పుడు పార్ట్ 2 రాబోతుంది. రీసెంట్ గానే పొన్నియన్ సెల్వన్ రెండు పార్ట్ లుగా రిలీజ్ అయింది. ఇక త్వరలో రిలీజ్ కాబోతున్న సలార్ సినిమా కూడా రెండు పార్ట్ లుగా రాబోతుంది. ముందు ఒక సినిమానే అనుకున్నారు కానీ రీసెంట్ గానే రెండు పార్ట్ లుగా రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. ఇక ఇప్పుడు మరో సినిమాను కూడా రెండు భాగాలుగా రిలీజ్ చేయలని చూస్తున్నారట. ఆసినిమా మరేదో కాదు విజయ్ నుండి రాబోతున్న లియో సినిమా.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తమిళ్ స్టార్ హీరో విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వస్తున్న సినిమా లియో. మాస్టర్ తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక తాజాగా ఈసినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వినిపిస్తుంది. ఈసినిమాను కూడా రెండు పార్ట్ లుగా రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మొదటి పార్ట్ ఎండింగ్ సెకండ్ పార్ట్ కు లీడింగ్ గా ఉంటుందని అంటున్నారు. ఈ పార్ట్ ను 2025లో రిలీజ్ చేయాలని చూస్తున్నారట. ప్రస్తుతం ఈవార్త అయితే జోరుగా వినిపిస్తుంది. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ ఆగాల్సిందే.

ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా ఈసినిమాలో సంజయ్ దత్, మిస్కిన్, గౌతమ్ మీనన్, అర్జున్ సర్జ, ప్రియా ఆనంద్, ఇంకా మాథ్యూ థామస్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాకు ఎస్ ఎస్ లలిత్ కుమార్ నిర్మిస్తుండగా జగదీష్ పళనిసామి సహ నిర్మాతగా వ్యవహరించనున్నట్టు తెలిపారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తుండగా.. సినిమాటోగ్రాఫర్ గా మనోజ్ పరమహంస పనిచేస్తున్నారు. సతీశ్ కుమార్‌ ఆర్ట్‌ డైరెక్టర్‌ గా.. అన్బరివ్‌ యాక్షన్‌ కొరియోగ్రఫర్‌గా పనిచేస్తున్నాడు. ఈసినిమా తమిళ్ తోపాటు ఇతర భాషల్లో అక్టోబర్ 19న విడుదలకానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.