మెగాస్టార్ చిరంజీవి మాత్రం ఈవయసులో కూడా వరుసగా సినిమాలు చేసుకంటూ వెళుతున్నాడు. గత ఏడాది ఆచార్య, గాడ్ ఫాదర్ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన చిరు ఈఏడాది అప్పుడే వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. ఇక ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా వస్తున్న సినిమా భోళా శంకర్. ఈసినిమా తమిళ్ లో హిట్ అయిన వేదాళం సినిమాకు రీమేక్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా ఎన్నో అంచనాల మధ్య నేడు రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా కోసం మెగా అభిమానులు ఎంతగా వెయిట్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. అయితే ఇక్కడ మరో హీరో కూడా భోళా శంకర్ కోసం చూస్తున్నాడు. ఆ హీరో ఎవరో కాదు సూపర్ స్టార్ మహేష్ బాబు. భోళా శంకర్ రిలీజ్ నేపథ్యంలో మహేష్ తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. భోళా శంకర్ కోసం చూస్తున్నాను.. చిరంజీవి గారికిి ఫ్రెండ్ అయిన మెహర్ రమేష్ కు అలానే నా ఫేవరెట్ ప్రొడ్యూసర్ అనిల్ సుంకరకు బెస్ట్ విషెస్ అంటూ ట్వీట్ చేశాడు.
Looking forward to #BholaShankar! Sending my best wishes to @KChiruTweets sir, my dear friend @MeherRamesh, and my favourite producer @AnilSunkara1 for a blockbuster release tomorrow!
— Mahesh Babu (@urstrulyMahesh) August 10, 2023
కాగా ఈసినిమాలో చిరు కి చెల్లెలిగా కీర్తి సురేష్ నటిస్తుంది. ఈసినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.. వీరితో పాటు రఘు బాబు, రావు రమేష్, మురళీ శర్మ, రవి శంకర్, వెన్నెల కిషోర్, తులసి, ప్రగతి, శ్రీముఖి, బిత్తిరి సత్తి, సత్య, గెటప్ శ్రీను, రష్మీ గౌతమ్, ఉత్తేజ్, ప్రభాస్ శ్రీను ఉన్నారు.ఇక ఈసినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. సంగీతం మహతి సాగర్.. సినిమాటోగ్రఫి డూడ్లే అందిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: