సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా నిన్న రీ రిలీజైన బిజినెస్ మేన్ థియేటర్లలో రచ్చ చేసింది.దాంతో మొదటి రోజు రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ ను రాబట్టింది.ఇప్పటివరకు రీరిలీజైన సినిమాల్లోనే అత్యధిక ఓపెనింగ్స్ ను రాబట్టిన సినిమాగా రికార్డు సృష్టించింది.మొదటి రోజు ఈసినిమా తెలుగు రాష్ట్రాల్లో 4.40కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.ఇందులో నైజాం నుండి ఈసినిమా 2.50కోట్ల గ్రాస్ వసూళ్లను దక్కించుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసిన ఈసినిమాలో సూర్య పాత్రలో మహేష్ అదుర్స్ అనిపించాడు.ఈపాత్ర ప్రేక్షకులను ఫిదా చేసింది.కాజల్ హీరోయిన్ గా నటించగా తమన్ సంగీతం అందించాడు.ఆర్ఆర్ మూవీ మేకర్స్ నిర్మించింది.2012లో సంక్రాంతికి విడుదలైంది.
ఇక మహేష్ ప్రస్తుతం గుంటూరు కారంలో నటిస్తున్నాడు. త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ఈసినిమాలో శ్రీ లీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లు గా నటిస్తుండగా తమన్ సంగీతం అందిస్తున్నాడు.హారిక హాసిని క్రియేషన్స్ నిర్మిస్తుంది.వచ్చే ఏడాది సంక్రాంతికి గుంటూరు కారం థియేటర్లలోకి రానుంది.ఈసినిమాను పూర్తి చేసి మహేష్ బాబు,టాప్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి తో సినిమా చేయనున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: