ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన పౌరాణిక సినిమా ఆదిపురుష్. రామాయణంలోని యుద్ధకాండ ఆధారంగా ఈసినిమాను రూపొందించాడు ఓం రౌత్. ఇక జూన్ 16వ తేదీన ఈసినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. ఇక మిక్స్డ్ టాక్ ను తెచ్చుకున్న ఈసినిమా ఫస్ట్ డే నుండే అంచాలనకు మించి వసూళ్లను రాబట్టుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా ప్రస్తుతం ఓటీటీలోకి కూడా వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వారు ఈసినిమా ఓటీటీ హక్కులను సొంతం చేసుకున్నారు. ఈనేపథ్యంలో నేడు ఈసినిమా సైలెంట్ గా రిలీజ్ అయిపోయింది. తెలుగు, కన్నడ, మలయాళం, తమిళ్ భాషల్లో కూడా ఈసినిమా అందుబాటులో ఉంది. మరి థియేటర్లలో చూడటం మిస్ అయినవారు ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.
timeless saga of the victory of good over evil! 🔥 #AdipurushOnPrime, watch now
available in Telugu, Kannada,Tamil and Malayalamhttps://t.co/B4XPNyeIkV pic.twitter.com/4qMas3UJ6P
— prime video IN (@PrimeVideoIN) August 11, 2023
కాగా ఈసినిమాలో ప్రభాస్ రాముడిగా, కృతీ సనన్ సీతగా, సన్ని సింగ్ లక్ష్మణుడిగా.. సైఫ్ అలీ ఖాన్ రావణాసురిడిగా.. హనుమంతుడిగా దేవ్ దత్త నటించారు. ఈ సినిమాను టీ-సిరీస్, రెట్రో ఫైల్స్ సంస్థలపై బాలీవుడ్ నిర్మాతలు భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ భారీ బడ్జెట్తో నిర్మించారు. ఇంకా ఈసినిమాకు సినిమాటోగ్రఫి కార్తిక్ పళని, సంగీతం.. అజయ్ అతుల్, ఎడిటింగ్.. అపూర్వ మోతివాలే అందించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: