ఈమధ్య సీక్వెల్స్ రావడం కామన్ అయిపోయిన సంగతి తెలిసిందే కదా. సినిమా హిట్ అయితే వెంటనే సీక్వెల్స్ చేయడానికి రెడీ అయిపోతున్నారు. ఇక ఇప్పుడు మరో క్లాసిక్ సినిమా కూడా సీక్వెల్ కు సిద్దమవుతుంది. ఈసినిమా మరేదో కాదు.. శంకర్ దర్శకత్వంలో అర్జున్, మధుబాల హీరో హీరోయిన్లుగా వచ్చి సంచలనం సృష్టించిన జెంటిల్‌మేన్ సినిమా. 1993లో తమిళ, తెలుగు భాషల్లో రిలీజ్ అయి ఓ సంచలనం సృష్టించింది. అర్జున్ కెరీర్‌లో ఈ సినిమా ఓ మైలురాయిగా నిలిచింది. కృష్ణమూర్తి పాత్రలో తన సత్తా చాటాడు. ఇక శంకర్ కూడా తొలి చిత్రంతోనే అందరి దృష్టిని ఆకర్షించి ప్రశంసలు అందుకున్నాడు. అప్పట్లో కె.జి. కుంజమోన్ ఈసినిమాను నిర్మించారు. ఇప్పుడు జెంటిల్‌మేన్‌కు పార్ట్ 2గా, మొదటి భాగానికి రెండింతలు ఉండేలా జెంటిల్‌మేన్ 2 చిత్రాన్ని నిర్మించనున్నారు కే. కుంజుమోన్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను ప్రారంభించి అది పూర్తి చేసే పనిలో ఉంది. ఇప్పటికే ఇప్పటికే ఈసినిమాకు సంబంధించిన పలు అప్ డేట్లు ఇచ్చాడు కుంజుమోన్.రీసెంట్ గానే ఈసినిమా మ్యూజిక్ కంపోజిషన్ ను మొదలుపెట్టినట్టు తెలియచేసిన సంగతి తెలిసిందే కదా. ఇక ఇప్పుడు మరో సర్ ప్రైజింగ్ అప్ డేట్ ఇచ్చారు. తాజాగా ఈసినిమా నుండి మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. కాన్ఫిడెన్స్ ఈజ్ అవర్ ట్రేడ్ మార్క్ అనే క్యాప్షన్ తో రిలీజ్ అయిన జెంటిల్ మేన్ 2 మోషన్ పోస్టర్ ఆకట్టుకుంటుంది.
కాగా ఏ గోకుల్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమాలో మాలీవుడ్ బ్యూటీ నయనతార చక్రవర్తి ఇంకా ప్రియా లాల్ హీరోయిన్లు గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని తమిళ, తెలుగు, హిందీ, మలయాళ, కన్నడ ఐదు భాషలలో జెంటిల్‌మేన్ ఫిలిం ఇంటర్‌నేషనల్ సంస్థ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తుంది. కీరవాణి ఈసినిమాకు సంగీతం అందిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: